ఈ డాక్యుమెంట్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (“చట్టం”), అలాగే ఎప్పటికప్పుడు దీనికి చేసే సవరణలు, వాటి ప్రకారం వర్తించే నిబంధనలు, ఇంకా చట్ట ప్రకారం సవరించిన వివిధ చట్టాలలో ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించి సవరించిన నిబంధనల ప్రకారం రూపొందించిన ఎలక్ట్రానిక్ రికార్డ్. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను కంప్యూటర్ సిస్టమ్ సహాయంతో రూపొందించారు. కాబట్టి దీనిపై ఎలాంటి ఫిజికల్ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
‘PhonePe Earn/ఎర్న్’ను (ఈ కింద దీనికి నిర్వచనం ఇచ్చాము) రిజిస్టర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి లేదా అందులో పాల్గొనడానికి ముందు దయచేసి ఈ నియమ, నిబంధనలు (“నియమాలు“)ను జాగ్రత్తగా చదవండి. ఈ నియమాలు PhonePe Earn/ఎర్న్‌ను మీరు యాక్సెస్ చేయడాన్ని, వినియోగించడాన్ని, అందులో పాల్గొనడాన్ని నియంత్రిస్తాయి, అలాగే ఆఫీస్-2, ఫ్లోర్ 5, వింగ్ ఎ, బ్లాక్ ఎ, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక – 560103, భారత్ అనే చిరునామాలో తన కార్యాలయాన్ని రిజిస్టర్ చేసుకున్న PhonePe ప్రైవేట్ లిమిటెడ్‌కు, మీకు మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి.
ఈ నియమాల ప్రకారం ‘PhonePe’కు సంబంధించిన రెఫరెన్స్‌లు అన్నీ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్లు, ఉప సంస్థలు, గ్రూప్ కంపెనీలు, వాటికి చెందిన అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ప్రతినిధులు, ఏజెంట్‌లకూ వర్తిస్తాయి, అలానే వీటన్నింటినీ సూచిస్తాయి. మీరు ఈ నియమాలను చదివారని అంగీకరించి, ఆమోదం తెలుపుతున్నారు. ఒకవేళ మీరు ఈ నియమాలను అంగీకరించకూడదని లేదా కట్టుబడి ఉండకూడదని అనుకున్నట్లయితే, మీరు PhonePe Earn/ఎర్న్‌ను ఏ రూపంలోనూ యాక్సెస్ చేయకూడదు, ఉపయోగించకూడదు, అలానే దానిలో పాల్గొనకూడదు. PhonePe ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర వెబ్‌సైట్ విధానాలు, సాధారణ నియమాలు లేదా ఉత్పత్తికి సంబంధించిన నియమ, నిబంధనలు (ఈ కింద వీటికి నిర్వచనాన్ని ఇచ్చాము), అలాగే కాలానుగుణంగా సవరించినవి కూడా, మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్న/యాక్సెస్ చేస్తున్న ప్రకారంగా మీకు వర్తిస్తాయని కూడా అర్థం చేసుకున్నారు. PhonePe వెబ్‌సైట్(లు), PhonePe మొబైల్ అప్లికేషన్(లు), PhonePe యాజమాన్యంలో ఉన్న/హోస్ట్ చేసిన/ఆపరేట్ చేసిన/సమర్థిస్తున్న ఏవైనా ఇతర పరికరాలు/ఆస్తులు (సమిష్టిగా వీటిని “PhonePe ప్లాట్‌ఫామ్” అని పిలుస్తారు)లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసి మేము ఈ నియమాలను ఎప్పుడైనా సవరించవచ్చు. ఈ నియమాలకు సంబంధించి, అప్‌డేట్ చేసిన వెర్షన్‌లు పోస్ట్ చేసిన వెంటనే అమలులోకి వస్తాయి. అటువంటి అప్‌డేట్‌లు/మార్పుల గురించి తెలుసుకునేందుకు ఈ నియమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది, అలానే అలాంటి అప్‌డేట్లు/మార్పులను మేము పోస్ట్ చేసిన తర్వాత కూడా మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం ఉపయోగించినట్లయితే ఆ అప్‌డేట్‌లు/మార్పులన్నింటినీ మీరు అంగీకరిస్తున్నట్లుగానే పరిగణిస్తాము. ఈ నియమాలకు అదనంగా మీరు ప్రతిపాదించిన లేదా వీటికి విరుద్ధంగా ఉన్న ఏవైనా నియమ, నిబంధనలను PhonePe పూర్తిగా తిరస్కరిస్తుంది, అలాగే అవి అమలు కావు లేదా ఎటువంటి ప్రభావాన్నీ చూపవు. మీరు ఈ నియమాలను అంగీకరించిన తర్వాత, PhonePe Earn/ఎర్న్‌ను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి, పాల్గొనడానికి మీకు వ్యక్తిగతంగా, ప్రత్యేకం కాని, బదిలీ చేయలేని, పరిమిత అధికారాన్ని మేము మంజూరు చేస్తాము.
- నిర్వచనం
- “PhonePe Earn/ఎర్న్” అంటే PhonePe ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్లు అని అర్థం, దీనిలో మొబైల్ యాప్ రెఫరల్స్ (“రెఫరల్స్”), ఆన్‌లైన్/డిజిటల్ సర్వేలు (“సర్వేలు”) లేదా తమ క్లయింట్స్ తరఫున PhonePe ఎనేబుల్ చేసిన ఆన్‌లైన్ లేదా డిజిటల్‌గా పాల్గొనేందుకు/పూర్తి చేసేందుకు అవకాశం కల్పించే డిజిటల్/ఆన్‌లైన్ టాస్క్‌లు ఉంటాయి, అంటే క్లయింట్ల లేదా తమ థర్డ్ పార్టీల బ్రాండ్ విజిబిలిటీ పెంచడానికి, ఉత్పత్తులు/సేవలను ప్రమోట్ చేయడానికి లేదా వినియోగదారు/మార్కెట్ పరిజ్ఞానాన్ని (“భాగస్వామి”) పెంపొందించడానికి ఈ టాస్క్‌లను తీసుకొస్తారు, అలాగే వీటిని సంతృప్తికర స్థాయిలో పూర్తి చేసినట్లయితే మీరు ఎలక్ట్రానిక్ గిఫ్ట్ వోచర్‌లను (“రివార్డ్“) పొందడానికి అర్హత సాధిస్తారు.
- “అర్హత సాధించిన రెఫరల్” అంటే, రెఫరల్స్ అనుబంధ నియమ, నిబంధనలతో పాటు, వాటి ప్రకారం అవసరమైన మేరకు, ముందస్తుగా నిర్ధారించిన చర్యలను అన్నింటినీ సంతృప్తికరంగా పూర్తి చేయడం/నెరవేర్చడం అని అర్థం. ఉదాహరణకు, రెఫరల్ పొందిన వారి పరికరంలో మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు, రెఫరల్ పొందిన వారి తరఫున నిర్దిష్ట కాలవ్యవధిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్దిష్ట చర్యలను, అంటే టాస్క్ స్పెషిఫికేషన్‌ల ప్రకారం అవసరమైన రిజిస్టేషన్లు/సబ్‌స్క్రిప్షన్లు/సేవలను పొందడం వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది.
- “రెఫరల్ పొందిన వారు”, రెఫరల్స్ బెనెఫిట్ పొందడం కోసం, మీరు రెఫర్ చేసి పంపించిన రెఫరల్ లింక్‌లో, అలానే దాని అనుబంధ నియమ, నిబంధనలలో వివరించిన అన్ని చర్యలను విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి.
- “సెటిల్‌మెంట్” అంటే PhonePe Earn/ఎర్న్‌లో ఉన్న ఒక నిర్దిష్ట టాస్క్‌కు PhonePe మీకు మంజూరు చేసే రివార్డ్ అని అర్థం.
- “సర్వే” అంటే వినియోగదారుల ప్రవర్తన, ప్రాధాన్యతలతో పాటు మార్కెట్/ఉత్పత్తికి చెందిన నిర్దిష్ట అంశాలకు సంబంధించిన, అవి భాగస్వామి ఉత్పత్తులు/సేవలకు సంబంధించినవే అయినా లేదా కాకపోయినా, నిర్దిష్ట డేటా పాయింట్లను సేకరించడం అనే అంతర్లీన లక్ష్యంతో PhonePe ప్లాట్‌ఫామ్‌లో భాగస్వామి నిర్దేశించిన ప్రశ్నావళులు/పోల్ ఫార్మాట్‌లు.
- “మేము”, “మా”, “మాది” అంటే PhonePe అని పరిగణించాలి.
- “మీరు”, “మీది”, “మీ”, “యూజర్” అంటే PhonePe యూజర్/కస్టమర్ అని అర్థం.
- అర్హత
- PhonePe Earn/ఎర్న్‌ను యాక్సెస్ చేయడం/ఉపయోగించడం/దానిలో పాల్గొనడం ద్వారా, మీరు ఈ కింద పేర్కొన్న అంశాలకు తగినట్లుగా ఉంటున్నారని, వీటిని పాటిస్తున్నారని హామీ ఇస్తున్నారు:
- మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు, అలాగే చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకునే సామర్థ్యం మీకు ఉంది.
- మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న, అలాగే కాలానుగుణంగా సవరించిన ఈ నియమాలను, అన్ని ఇతర వెబ్‌సైట్ పాలసీలను, జనరల్/ఉత్పత్తికి సంబంధించిన నియమాలను అన్ని వేళలా తప్పకుండా పాటించాలి.
- PhonePeను యాక్సెస్ చేసే విషయంలో మీపై ఏ రూపంలోనూ నిషేధం లేదు లేదా చట్టపరమైన ఆంక్షలు లేవు.
- మీరు వేరే వ్యక్తి/సంస్థలాగా నటించడం లేదు.
- మీరు పేర్కొన్న మొత్తం సమాచారం, వివరాలు, సమర్పించిన డాక్యుమెంట్లు నిజమైనవని, అవి మీకు చెందినవని, అలాగే మీరు వాటిని ఎల్లప్పుడూ PhonePe ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్ చేస్తారని అంగీకరిస్తున్నారు.
- పైన పేర్కొన్న నిబంధనలను మీరు తప్పుగా వ్యక్తపర్చినట్లయితే, PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీ అకౌంట్‌ను వెంటనే క్లోజ్ చేసే హక్కు PhonePeకు ఉంది, అలానే అవసరమని భావించిన మేరకు మీపైన ఏవైనా ఇతర చర్యలు తీసుకునే ప్రక్రియను కూడా ప్రారంభించవచ్చు.
- PhonePe Earn/ఎర్న్‌ను యాక్సెస్ చేయడం/ఉపయోగించడం/దానిలో పాల్గొనడం ద్వారా, మీరు ఈ కింద పేర్కొన్న అంశాలకు తగినట్లుగా ఉంటున్నారని, వీటిని పాటిస్తున్నారని హామీ ఇస్తున్నారు:
- సర్వే, రెఫరల్, రివార్డుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలు
- సర్వేలకు సంబంధించి, మీరు ఈ కింద పేర్కొన్న అంశాలను అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:
- సర్వేలో మీరు ఇచ్చే జవాబులు/సమర్పించిన వివరాలు భాగస్వామి మరియు/లేదా PhonePe అంతర్గత పారామీటర్లు లేదా నాణ్యతను చెక్ చేసే విధానాలకు లోబడి ఉంటాయి, ఇంకా PhonePe లేదా భాగస్వామి నిర్ణయం ప్రకారం, అటువంటి ప్రమాణాలకు అనుగుణంగా మీ జవాబులు/సమర్పించిన వివరాలు లేనట్లయితే, ఆ సర్వేలలో పాల్గొన్నందుకు రివార్డ్‌ను పొందే అర్హత మీకు ఉండదు.
- PhonePe ఇక్కడ ప్రస్తావించిన అంశాలకు బాధ్యత వహించదు (ఎ) PhonePe Earn/ఎర్న్‌లో ఉపయోగించిన లేదా దానితో అనుసంధానమైన ఏదైనా పరికరం లేదా ప్రోగ్రామింగ్ లేదా మీ కారణంగా విలువ లేని, తప్పుదారి పట్టించే, పాత, అసంపూర్ణమైన, తప్పుడు లేదా అర్థం కాని ఎంట్రీలు/జవాబులు ఉన్నట్లయితే లేదా ఎంట్రీలు/జవాబులను ప్రాసెస్ చేస్తున్నప్పుడు తలెత్తే ఏదైనా సాంకేతిక లేదా మానవ తప్పిదాలకు; (బి) PhonePe Earn/ఎర్న్‌కు సంబంధించిన ఏదైనా మెటీరియల్‌లో ఉన్న ఏవైనా ప్రింటింగ్ లేదా టైపోగ్రాఫికల్ లోపాలకు; (సి) ఆపరేషన్‌లో ఏదైనా ఎర్రర్, టెక్నికల్, నెట్‌వర్క్, టెలిఫోన్, కంప్యూటర్, హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్, ఏవైనా మాల్‌ఫంక్షన్లు పంపడం, దొంగతనం, విధ్వంసం, ఎంట్రీలకు అనధికారిక యాక్సెస్ రావడం, లేదా మార్చడం, లేదా ఇంటర్నెట్‌లో లేదా ఏదైనా వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్యలు లేదా ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏదైనా ఎంట్రీ సమాచారాన్ని పొందడంలో వైఫల్యం లేదా తప్పుగా పంపడం; లేదా (d) PhonePe Earn/ఎర్న్‌కు సంబంధించి ఏదైనా మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేయడం వల్ల మీ కంప్యూటర్ లేదా మొబైల్‌కు నష్టం కలగడం లేదా పాడైపోవడం.
- సర్వేలలో పాల్గొంటున్నప్పుడు గోప్యమైన/యాజమాన్యానికి సంబంధించిన సమాచారం మీకు తెలిసే అవకాశముంటుంది, అయితే అటువంటి సమాచారం ఎల్లప్పుడూ దాని యాజమాన్యానికి మాత్రమే చెందిన, ప్రత్యేకమైన ఆస్తిగా ఉంటుంది. ఈ రహస్య సమాచారంలో కొత్త ఉత్పత్తికి సంబంధించిన ఐడియాలు లేదా కాన్సెప్ట్‌లు, ప్యాకేజింగ్ కాన్సెప్ట్‌లు, ప్రచార/సినిమా/టెలివిజన్ కాన్సెప్ట్‌లు లేదా ట్రైలర్‌లు, అలానే వాటికి సంబంధించిన పదాలు, విజువల్ ఇమేజ్‌లు, సౌండ్‌లు, ఇవే కాకుండా ఇంకొన్ని అంశాలు కూడా ఉండవచ్చు. సర్వేలో పాల్గొనడం ద్వారా, మీరు అటువంటి సమాచారం మొత్తాన్ని గోప్యంగా ఉంచుతారని, వాటిని ఏ థర్డ్ పార్టీకి చెప్పరని లేదా ఏదైనా ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించరని మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ బాధ్యతను ఉల్లంఘిస్తే, మీ రివార్డ్‌ను వెనక్కి తీసుకోవడం, మీ అకౌంట్‌ను రద్దు చేయడంతో పాటు, PhonePe మరియు/లేదా భాగస్వామికి కలిగే ఆర్థిక నష్టాలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తారు.
- కొన్ని సర్వేలలో, మీ సమ్మతి మేరకు మాత్రమే, మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించేందుకు అవకాశమున్న సమాచారాన్ని భాగస్వాములకు ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సమాచారాన్ని బయట పెట్టడం, సేకరించడం, నిల్వ చేయడం, పంచుకోవడం, అలానే ప్రాసెస్ చేయడంపై మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ సర్వేలలో పాల్గొనవద్దని మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాము. ఈ విషయానికి సంబంధించిన వివాదాలు అన్నింటిలోనూ PhonePeను మినహాయించి, నేరుగా భాగస్వాములను వాటిలో భాగం చేయడానికి మీరు అంగీకరిస్తున్నారు.
- రెఫరల్‌కు సంబంధించి, మీరు ఇక్కడ పేర్కొన్న విషయాలను అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:
- రెఫరల్‌లో పాల్గొనాలనుకుంటే, మీరు రెఫరల్ లింక్‌లో ఇచ్చిన సూచనలను, అలానే దాని అనుబంధ నియమ, నిబంధనలను పాటించాలి, ఇంకా మొబైల్ అప్లికేషన్‌ను రెఫరల్ పొందిన వారికి రెఫర్ చేయాలి. ఇందులో రెఫరల్ పొందిన వారి కాంటాక్ట్ వివరాలను ఎంటర్ చేయడం లేదా అనుబంధ నియమ, నిబంధనలు నిర్దేశించిన ఇతర నిబంధనలను పాటించడం కూడా ఉండవచ్చు. మీరు అలా చేయడం ద్వారా, రెఫరల్ పొందిన వారి కాంటాక్ట్ వివరాలు / ఇతర వివరాలను అందించడానికి వారి నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారని మీరు తెలుపుతున్నారు.
- రెఫరల్ పంపడం – రెఫరల్ పంపడం కోసం మీరు ఖచ్చితంగా PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలి, అలాగే ఈ నియమాల నిబంధనలను, పరిగణనలోకి తీసుకున్న రెఫరల్, దాని అనుబంధ నియమ, నిబంధనలను సంతృప్తపరిచే నిజమైన వ్యక్తులకు (మిమ్మల్ని మినహాయించి) మాత్రమే రెఫర్ చేసి రెఫరల్ స్ఫూర్తిని గౌరవించాలి. ఉదాహరణకు, మీరు PhonePeలో ఒకటి కంటే ఎక్కువ లేదా నకిలీ అకౌంట్లను క్రియేట్ చేయకూడదు లేదా ఒకటి కంటే ఎక్కువ లేదా నకిలీ ఈమెయిల్ చిరునామాలు లేదా ఐడీలను ఉపయోగించి రెఫరల్ ప్రక్రియలో పాల్గొనకూడదు. రెఫరల్ పంపుతున్నప్పుడు, మీరు రెఫరల్ పొందబోయే వారి నుండి సంబంధిత సమ్మతిని కోరిన తర్వాత పూర్తి, చెల్లుబాటు అయ్యే, వాస్తవ సమాచారాన్ని అందించాలి.
- రివార్డ్‌కు సంబంధించి, మీరు ఈ కింద పేర్కొన్న అంశాలను అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:
- అన్ని రివార్డులలోనూ వర్తించే పన్నులను కలపలేదు. రివార్డ్‌ను బదిలీ చేయడం, వేలం వేయడం, వేరే ప్రయోజనానికి బదులుగా దీన్ని ఇవ్వడం, మార్చడం లేదా అమ్మడం వంటివి చేయలేరు. మీ అకౌంట్‌ను లేదా PhonePe Earn/ఎర్న్‌లో పాల్గొనే మీ హక్కును రద్దు చేసిన తర్వాత, ఈ నియమాల కింద పేర్కొన్న కారణాల వల్ల, మీ సంపాదన కింద ఆర్జించిన అన్ని రిడీమ్ చేయని రివార్డ్‌లు చెల్లవు.
- రివార్డ్‌కు అర్హత పొందేందుకు మీరు PhonePeలో మీ మొబైల్ నంబర్, KYC డాక్యుమెంట్లను ధృవీకరించాల్సి రావచ్చు.
- ప్రతి రివార్డ్‌కు ఏ రకంగానూ, తెలిపిన లేదా అలా అనిపించిన వారెంటీ (పరిమితి లేదని, వ్యాపారానికి వాడుకోవచ్చని లేదా నిర్దిష్ట ప్రయోజనానికి సరిపోతుందని అర్థం వచ్చేలా ఉన్న వారెంటీతో సహా) ఉండదు.
- మీరు సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరియు/లేదా పరిగణనలోకి తీసుకున్న రెఫరల్‌కు అర్హత సాధించిన తర్వాత, ఏది వర్తిస్తే దాని ప్రకారం, PhonePe ప్లాట్‌ఫామ్‌లో నోటిఫికేషన్ లేదా PhonePe లేదా భాగస్వామి నుండి రాతపూర్వక నిర్ధారణ వచ్చిన తర్వాత మాత్రమే మీరు రివార్డ్‌ను వినియోగించుకునేందుకు అర్హత సాధిస్తారు.
- రివార్డ్‌ను ధృవీకరించాల్సి/విచారణ చేయాల్సి ఉంటుంది. వీటిలో తేలిన ఫలితం ప్రకారం రివార్డు ఆలస్యం/రద్దు అయ్యేందుకు అవకాశముంది. మీరు మోసపూరితంగా, అనుమానాస్పదంగా పాల్గొన్నారని, ఈ నిబంధనలను ఉల్లంఘించారని, లేదా PhonePe, భాగస్వామి లేదా వీరిలో ఒకరిపై ఆర్థిక భారం విధించే పరిస్థితి తలెత్తుతుందని భావిస్తే, PhonePe తన సొంత అభీష్టానుసారం రివార్డ్‌ను ప్రాసెస్ చేయడానికి నిరాకరించవచ్చు. PhonePe నిర్ణయాలే అంతిమంగా అమలవుతాయి, వాటికే కట్టుబడి ఉండాలి.
- మీరు సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరియు/లేదా పరిగణనలోకి తీసుకున్న రెఫరల్‌కు అర్హత సాధించిన తర్వాత, ఏది వర్తిస్తే దాని ప్రకారం, PhonePe లేదా భాగస్వామి నిర్ణయించిన రూపంలో, పద్ధతిలో మీరు రివార్డ్‌ను పొందుతారు. రివార్డ్ సెటిల్‌మెంట్ పూర్తయిన తర్వాత, PhonePe లేదా భాగస్వామికి, వీరిలో ఎవరైతే వారికి, మీరు పూర్తి చేసిన సర్వే మరియు/లేదా రెఫరల్‌కు సంబంధించి ఇకపై ఎటువంటి రివార్డునూ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదు. టాస్క్ పూర్తి చేశారనే విషయాన్ని పూర్తి స్థాయిలో పరిగణించి, అది చెల్లుబాటు అయితేనే ఏదైనా రివార్డ్‌ను జారీ చేస్తారని మీరు ఇందుమూలంగా అంగీకరించారు.
- PhonePe మరియు/లేదా దాని అనుబంధ సంస్థల కోసం చేపట్టిన సర్వేలు, రెఫరల్స్ రెండింటికీ ఇచ్చే రివార్డ్‌ల మొత్తం విలువ, ఒక్కో యూజర్‌కు (“రివార్డ్ పరిమితి“) ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 9,999/- (తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే)కి పరిమితం అవుతుంది. రివార్డ్ పరిమితిని చేరుకున్న తర్వాత, మిగిలిన ఆర్థిక సంవత్సరంలో రెఫరల్స్ మరియు/లేదా సర్వేలు చేసినట్లయితే, మీ రివార్డ్ పరిమితిని మళ్లీ రీసెట్ చేసే వరకు, తదుపరి రివార్డ్ పొందేందుకు మీకు అర్హత ఉండదు. భాగస్వామి ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి రెఫరల్స్‌ను మళ్లీ మళ్లీ వాడుతూ ఆ ప్రోడక్ట్‌లను కొనుగోలు చేసినా లేదా సేవలను పొందినా కూడా తదుపరి రివార్డ్ పొందేందుకు మీకు అర్హత ఉండదని కూడా స్పష్టం చేస్తున్నాము..
- PhonePe సూచించిన నియమ, నిబంధనల ప్రకారమే రివార్డ్ మీకు అందుతుందని ఇందుమూలంగా మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
- సర్వేలకు సంబంధించి, మీరు ఈ కింద పేర్కొన్న అంశాలను అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:
- PhonePe Earn/ఎర్న్ సాధారణ నిబంధనలు
- పబ్లిసిటీ రిలీజ్: సర్వే మరియు/లేదా రెఫరల్‌లో పాల్గొనడం ద్వారా, సర్వే మరియు/లేదా రెఫరల్‌కు సంబంధించి తీసుకున్న లేదా రూపొందించిన వాటిలో ఏవైనా చిత్రాలు, ఫోటోలు, రచనలు, వీడియో రికార్డింగ్‌లు, ఆడియో టేప్‌లు, డిజిటల్ ఇమేజ్‌లు, ఇంకా అటువంటి కంటెంట్‌లో మీ పేరు, ఇమేజ్‌ను ప్రమోషనల్ లేదా మార్కెటింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి మీరు PhonePeకు అధికారం ఇస్తున్నారు. అంతేకాక, మీరు సర్వే లేదా రెఫరల్ సమయంలో తెలుసుకున్న ఏ విషయాన్నీ ఏదైనా ప్రైవేట్ లేదా పబ్లిక్ ఫోరంలో ప్రచారం చేయరని మరింత స్పష్టంగా చెబుతున్నారు.
- గోప్యత నోటీసు: సర్వే మరియు/లేదా రెఫరల్‌లో పాల్గొనడం కోసం మీ గురించి, అలానే రెఫరల్స్ కింద సూచించే వ్యక్తులు / సర్వేలో ప్రస్తావించిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని(ఏదైనా అవసరమైతే) అంటే పేరు, ఈమెయిల్ చిరునామా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అకౌంట్ వివరాలు వంటివి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వే మరియు/లేదా రెఫరల్‌లో మీరు పాల్గొనడానికి సంబంధించి, మీరు సర్వే కింద పేర్కొన్న వ్యక్తులను లేదా రెఫరల్ పొందిన వారిని PhonePe లేదా భాగస్వామి వివిధ కమ్యూనికేషన్ మార్గాలలో సంప్రదించవచ్చని లేదా సమాచారం ఇవ్వవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe Earn/ఎర్న్ కింద సేకరించిన మొత్తం సమాచారాన్ని ఈ నియమాలు, PhonePe వెబ్‌సైట్ గోప్యతా విధానంతో సహా, దాని విధానాలకు అనుగుణంగా నిర్వహిస్తారు.
- టైమ్‌లైన్‌లు: టాస్క్ సంతృప్తికరంగా పూర్తి అయిందని నిర్ధారించేందుకు, సర్వే (స్వీకరించిన జవాబులు/సమర్పించిన విషయాలను బట్టి) లేదా రెఫరల్ (రెఫరల్ పొందిన వారు పూర్తి చేయాల్సిన చర్యలను బట్టి) స్వభావం బట్టి, PhonePe లేదా భాగస్వామి తీసుకునే సమయం(టైమ్‌లైన్‌లు) ఒక్కో కేసులో ఒక్కోలా ఉంటుంది, అలానే ఆ విధంగా నిర్ధారిస్తున్న సమయంలో మీరు ఓపికగా ఉండేందుకు అంగీకారం తెలుపుతున్నారు.
- అకౌంట్ తొలగించడం, రద్దు/సవరణ/టాస్క్‌లు, రివార్డ్‌ల నిలిపివేత:
- మీరు లేదా రెఫరల్ పొందిన వారు ఈ కింద పేర్కొన్న పనులు చేసినట్లయితే, రివార్డ్‌ను సంపాదించడానికి లేదా మీ PhonePe అకౌంట్‌ను లేదా రెఫరల్ పొందిన వారి అకౌంట్‌లను రద్దు చేయడానికి లేదా సందేహాస్పదంగా ఉన్న రెఫరల్, సర్వే లేదా తదుపరి రివార్డ్‌ను రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి PhonePeకు హక్కు ఉంది: (i) అదనపు రివార్డ్‌ను జనరేట్ చేయడానికి ఒకే వ్యక్తి వేర్వేరు ఈమెయిల్ చిరునామాలు, మొబైల్ నంబర్‌లతో PhonePe అకౌంట్‌లు తెరవడం; లేదా (ii) స్పామ్ లేదా అభ్యర్థించని ఈ-మెయిల్‌లను ఉపయోగించే వ్యక్తులను రెఫర్ చేయడం; లేదా (iii) రివార్డ్ పొందడానికి తప్పుడు పేర్లను ఉపయోగించడం, ఇతర వ్యక్తుల మాదిరిగా నటించడం లేదా PhonePeకు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించడం; లేదా (iv) ఇక్కడ ప్రస్తావించిన రెఫరల్ మరియు/లేదా సర్వే నిర్వహణ, సెక్యూరిటీ లేదా పారదర్శకత విషయంలో రాజీ పడటం లేదా రాజీపడటానికి సహాయం చేయడం; లేదా (v) ఏదైనా వర్తించే చట్టం లేదా నిబంధనల ప్రకారం సర్వే మరియు/లేదా రెఫరల్‌లో పాల్గొనడంపై నిషేధం ఉండటం; లేదా (vi) ఈ నియమాలు లేదా సర్వే మరియు/లేదా రెఫరల్ కింద నిర్దేశించిన ఏదైనా ఇతర నిబంధనలను ఉల్లంఘించడం.
- PhonePe ఈ కింద పేర్కొన్న సందర్భాలలో సర్వే మరియు/లేదా రెఫరల్‌ను రద్దు చేయవచ్చు, సవరించవచ్చు, ఆపివేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు; (i) సర్వే మరియు/లేదా రెఫరల్ నిర్వహణ, భద్రతకు విఘాతం కలిగించే లేదా బలహీనపరిచే వైరస్‌లు, వార్మ్‌లు, బగ్‌ల దాడి జరిగినప్పుడు, అనధికారిక మానవ జోక్యం లేదా దాని నియంత్రణకు మించిన ఇతర కారణాలు ఉన్నప్పుడు; లేదా (ii) ఇక్కడ పరిగణిస్తున్న నిర్దిష్ట సర్వే లేదా రెఫరల్ విషయంలో, PhonePeకు భాగస్వామి నిర్దేశించిన పరిమితి సంఖ్యను సర్వేల విషయంలో అయితే ఎంట్రీల సంఖ్య లేదా రెఫరల్స్ విషయంలో అయితే అర్హత సాధించిన రెఫరల్స్ సంఖ్య చేరుకున్నప్పుడు.
- పైన పేర్కొన్న ఉప-నిబంధనలలో ఉన్న వాటిల్లో ఏదైనా సంభవించిన సందర్భంలో, PhonePe తన సొంత అభీష్టానుసారం, అలానే సాధ్యమయ్యేంత వరకు ఆ విషయంలో మీకు తగిన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
- బాధ్యతల నుంచి విముక్తి: PhonePe Earn/ఎర్న్‌లో పాల్గొనడం ద్వారా సర్వే, రెఫరల్ లేదా రివార్డ్‌కు సంబంధించి అన్ని విషయాలలోనూ తలెత్తే బాధ్యతలు లేదా భారాల నుంచి PhonePeకు విముక్తిని కల్పించేందుకు, అలానే PhonePe తనకు హాని చేయలేదని చెప్పేందుకు మీరు అంగీకరిస్తున్నారు. ఈ విముక్తిని కల్పించడం అనేది PhonePe Earn/ఎర్న్‌లో స్వీకరించడం, సొంతం చేసుకోవడం లేదా పాల్గొనడం వల్ల వ్యక్తిగతంగా గాయపడినా(మరణంతో సహా), ఆస్తి నష్టం లేదా ధ్వంసమైనా, నేరుగా లేదా పరోక్షంగా PhonePe Earn/ఎర్న్ కింద అందించే ప్రయోజనాలు/రివార్డ్‌లను దుర్వినియోగపర్చినా కూడా వర్తిస్తుంది.
- నిరాకరణ: PhonePe మీకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే సర్వే, అలానే రెఫరెల్ నియమ, నిబంధనలను ఎప్పుడైనా సవరించవచ్చు, ఇది మాత్రమే కాకుండా, రివార్డ్ అమౌంట్లను సవరించవచ్చు, రివార్డ్‌ను రీడీమ్ చేసే విధానాన్ని మార్చవచ్చు, వోచర్‌ల కాలవ్యవధి/గడువును, మీరు గరిష్ఠంగా సంపాదించుకోగలిగే రివార్డ్‌ల నగదు మొత్తం వంటి వాటిని సవరించవచ్చు.
- నష్టపరిహారం: మీరు ఏదైనా క్లెయిమ్ లేదా డిమాండ్ నుండి లేదా హేతుబద్ధమైన న్యాయవాదుల ఫీజు, ఏదైనా థర్డ్ పార్టీ చేసిన లేదా మీరు ఈ నియమాలు, ప్రైవసీ పాలసీలను మీరు ఉల్లంఘించడం వల్ల, లేదా ఏదైనా చట్టం, నిబంధనలు లేదా నియంత్రణా నిబంధనలు లేదా థర్డ్ పార్టీ హక్కులను (మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనతో సహా) విధించిన లేదా ఉత్పన్నమైన పెనాల్టీ ఫీజులను చెల్లించాల్సి వచ్చినప్పుడు మీరు ఆ నష్టపరిహారం నుంచి PhonePeను ఖచ్చితంగా విముక్తి చేయాలి, అలానే ఆ నష్టానికి PhonePe కారణం కాదని చెప్పాలి.
- ఫోర్స్ మెజర్ (ఊహించని పరిణామం): PhonePe నియంత్రణలో లేని ఏదైనా అనూహ్య సంఘటన అని అర్థం. యుద్ధం, అల్లర్లు, అగ్నిప్రమాదం, వరదలు, ప్రకృతి విపత్తు, పేలుడు, ధర్నాలు, లాక్‌అవుట్లు, స్లోడౌన్‌లు, ఎక్కువ కాలం కొనసాగే ఎనర్జీ సరుకుల కొరత, మహమ్మాలి, కంప్యూటర్ హ్యాకింగ్, కంప్యూటర్ డేటాకు, స్టోరేజీ పరికరాలకు అనధికారిక యాక్సెస్, కంప్యూటర్ క్రాష్‌లు, PhonePe సంస్థలను వారి కాంట్రాక్ట్ ప్రకారం వారి విధులను నిర్వహించకుండా అడ్డుకునే దేశ, రాష్ట్ర, ప్రభుత్వాల, చట్టబద్ధమైన లేదా నియంత్రణా సంస్థల చర్యలు, వీటితో పాటు ఈ తరహా సంఘటనలు ఫోర్స్ మెజర్ కిందకు వస్తాయి.
- వివాదం, పాలక చట్టం & అధికార పరిధి: ఈ ఒప్పందం, అలానే దాని కింద వర్తించే హక్కులు, బాధ్యతలు, పార్టీల మధ్య సంబంధాలు, అలానే ఈ నియమాల కింద లేదా వాటికి సంబంధించి ఉత్పన్నమయ్యే అన్ని అంశాలు, నిర్మాణం, చెల్లుబాటు, పనితీరు లేదా ఆపివేయడంతో సహా భారతదేశ చట్టాలకు అనుగుణంగా అమలవ్వాలి లేదా నిర్వహించాలి. సామరస్యపూర్వక పరిష్కారానికి లోబడి, అలానే ఎటువంటి పక్షపాతం లేకుండా, మీరు PhonePe Earn/ఎర్న్‌ను ఉపయోగించడం, అలానే అందులో పాల్గొనడం వల్ల తలెత్తిన అన్ని వివాదాలను లేదా ఇక్కడ కవర్ చేసిన ఇతర అంశాలలో వాదనలు వినడం, తీర్పు ఇవ్వడం కర్ణాటకలోని బెంగళూరులో కోర్టుల ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉంటాయి.