ఈ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 నిబంధనల ప్రకారం రూపొందించిన ఎలక్ట్రానిక్ రికార్డ్, కాలానుగుణంగా దీనికి సవరణలు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000ను అనుసరించి సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన సవరణలు, నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డును కంప్యూటర్ సిస్టమ్ తయారు చేసింది. దీనిపై ఎటువంటి భౌతిక లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
PhonePe చెక్అవుట్ను (కింద నిర్వచించబడింది) యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందే దయచేసి ‘నియమ, నిబంధనలు – PHONEPE చెక్అవుట్ (“నియమాలు”) విభాగాన్ని జాగ్రత్తగా చదవండి. ఈ నియమ, నిబంధనలు అనేవి మీకు, PhonePe ప్రైవేట్ లిమిటెడ్‌కు (“PhonePe”) మధ్య ఒక చట్టపరమైన ఒప్పందాన్ని సూచిస్తాయి. PhonePe ఆఫీస్-2, 4,5,6,7 వ అంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియా అనే చిరునామాలో తన కార్యాలయాన్ని రిజిస్టర్ చేసుకుంది. మీరు క్రింద పేర్కొన్న నియమాలను చదివారని మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ నియమాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోయినా లేదా వీటికి కట్టుబడి ఉండటం మీకు ఇష్టం లేకపోయినా, మీరు PhonePe చెక్అవుట్ను ఉపయోగించడం/పొందడం చేయకూడదు.
“మీరు”, “మీ” అనే పదాలు – PhonePe చెక్అవుట్ను పొందుతున్న/యాక్సెస్ చేస్తున్న PhonePeలో రిజిస్టర్ అయిన వినియోగదారును సూచిస్తాయి.
PhonePe ఒక సాఫ్ట్‌వేర్‌ను/ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా మీరు కస్టమర్ ప్లాట్ఫామ్లో (కింద నిర్వచించాము) చెక్అవుట్ విధానాన్ని ఉపయోగించగలిగేలా PhonePeలోని కొందరు మర్చెంట్లు/క్లయింట్లు (ఇకపై “PhonePe క్లయింట్”గా పిలుస్తాము) ఒక ఎంపికను అందిస్తారు. ఈ సేవలో భాగంగా, క్లయింట్ ప్లాట్ఫామ్లో (PhonePe క్లయింట్ వెబ్సైట్/మొబైల్ అప్లికేషన్/ఇతర ప్లాట్‌ఫామ్ చెక్అవుట్ పేజీలో) (ఇక్కడ “క్లయింట్ ప్లాట్‌ఫామ్” గా సూచించబడుతుంది) మీ ఉత్పత్తి/సేవ చెక్అవుట్ విధానాన్ని పూర్తి చేయడానికి PhonePe ద్వారా ఈ ఎంపిక మీకు అందుతుంది. ఈ ఎంపికలో భాగంగా ఈ అంశాలు ఉంటాయి : (i) షిప్పింగ్ పద్ధతిని నిర్ధారించడం అలాగే కూపన్లను చేర్చడం (ఒకవేళ వర్తిస్తే) (ii) స్వీకర్త పేరు, డెలివరీ చిరునామా అలాగే సంబంధిత ఫోన్ నంబర్‌ను నిర్ధారించడం/చేర్చడం (వీటన్నిటినీ కలిపి ఇకపై “చిరునామా” అని అంటారు); ఇంకా (iii) పేమెంట్ చేయడం. ఈ నియమాలను బట్టి, ఈ పేరాగ్రాఫ్‌లో వివరించిన సేవను PhonePe చెక్అవుట్గా సూచిస్తారు.
PhonePe చెక్అవుట్ సేవను పొందడానికి, మీ చెక్అవుట్ విధాన సమయంలో కనిపించే క్లయింట్ ప్లాట్ఫామ్లో అందించిన బటన్‌పై/ట్యాబ్‌పై క్లిక్/ ట్యాప్ చేయాలి. క్లిక్/ట్యాప్ చేసిన తర్వాత, PhonePe మొబైల్ అప్లికేషన్‌కు/ప్లాట్‌ఫామ్‌కు/మొబైల్ సైట్‌కు/వెబ్‌సైట్‌కు (లేదా PhonePe ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడే ఏదైనా ఇతర ప్లాట్‌ఫామ్‌కు) మళ్ళించబడతారు, దీనిని “PhonePe ప్లాట్‌ఫామ్” అని పిలుస్తారు. బటన్‌పై/ట్యాబ్‌పై ఇంకా (ఈ నియమాలలో అందించబడ్డ PhonePe చెక్అవుట్ సర్వీస్‌ను పొందడం కోసం) యూజర్ ఫ్లోలో ప్రదర్శించే పదజాలాన్ని / క్రియాపదాలను, మీకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే PhonePe సవరించవచ్చని స్పష్టం చేస్తున్నాము.
PhonePe వెబ్సైట్(లు) మరియు/లేదా PhonePe మొబైల్ అప్లికేషన్లో అప్డేట్ చేసిన వెర్షన్ పోస్ట్ చేయడం ద్వారా PhonePe ఈ నియమాలను ఏ సమయంలోనైనా సవరించవచ్చు. ఈ నియమాల అప్డేట్డ్ వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే, అవి అమలులోకి వస్తాయి. ఏవైనా అప్డేట్లు/మార్పుల కోసం ఈ నియమాలను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం పూర్తిగా మీ బాధ్యత. మార్పులను పోస్ట్ చేసిన తరువాత PhonePe చెక్అవుట్ను మీరు వినియోగిస్తున్నారు అంటే అటువంటి రివిజన్(ల)కు / సవరణ(ల)కు మీరు అంగీకరిస్తున్నారని అర్థం.
సాధారణ నియమ, నిబంధనలు
- PhonePe చెక్అవుట్ను పొందడం/ఉపయోగించడం కొనసాగించడానికి మీ ప్రమాాణ యోగ్యతలను (OTP ద్వారా మరియు/లేదా PhonePe నిర్ణయించిన ఏ ఇతర పద్ధతిలో అయినా) PhonePe నిర్ధారించాల్సిన అవసరం ఉండవచ్చు. అదనంగా, మీ లాగిన్ వివరాలు/ఖాతా/ప్రమాాణ యోగ్యతలతో క్లయింట్ ప్లాట్‌ఫామ్ మరియు/లేదా PhonePe ప్లాట్ఫామ్లో లాగిన్ అయి ఉన్నంత వరకు PhonePe చెక్అవుట్ను పొందే వినియోగదారు మీరే అని భావించబడుతుంది.
- అంగీకారం విజయవంతమైన తర్వాత (అవసరమైతే), మీ PhonePe చెక్అవుట్ వినియోగం కోసం మీకు PhonePe ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్‌ను అందజేయడం జరుగుతుంది.
- PhonePe చెక్అవుట్కు సంబంధించి, ఏ PhonePe క్లయింట్ నుండి అయితే మీరు సదరు ఉత్పత్తు(లు)/సేవ(లు) పొందాలని ఆశిస్తున్నారో ఆ క్లయింట్ నుండి మీ కార్ట్ వివరాలను (ఎంచుకున్న ఉత్పత్తు(లు)/సేవ(లు), పరిమాణం, ధర, డెలివరీ ఛార్జీ(లు) వంటివే కాక ఇతర వివరాలను) PhonePe పొందుతుంది. సదరు PhonePe క్లయింట్ నుండి అటువంటి డేటాను (ఈ పేరాలో అందించిన విధంగా) PhonePe పొందడానికి, దానిని ప్రాసెస్ చేయడానికి మీరు ఇందు మూలంగా అంగీకరిస్తున్నారు.
- సంబంధిత PhonePe క్లయింట్ నుంచి PhonePe ద్వారా PhonePe ప్లాట్ఫామ్లో ప్రదర్శించే డేటా మొత్తాన్ని (ముందుకు కొనసాగడానికి ముందు / కొనుగోలు పూర్తి చేయడానికి ముందు) సమీక్షించడం అలాగే నిర్దారించడం అనేది మీ బాధ్యత అని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
- PhonePe క్లయింట్ నుంచి PhonePe పొందే డేటాకు అదనంగా, మీరు PhonePe ప్లాట్ఫామ్లో ఉపయోగించిన / నిర్దారించిన / అందించిన చిరునామాను, సంబంధిత ఉత్పత్తిని/సేవను కొనుగోలు చేసే / పొందే సమయంలో PhonePe సాధ్యమైనంత వరకు పొందుపరుస్తుంది / ప్రదర్శిస్తుంది.. ఏదైనా ప్రత్యామ్నాయ చిరునామాను డెలివరీ చిరునామాగా చేర్చే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది.
- మీరు ఎంచుకున్న డెలివరీ చిరునామా ఆధారంగా కార్ట్ వివరాలు (ధర, ఉత్పత్తి లభ్యత, డెలివరీ ఛార్జీలతో సహా, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు) మారవచ్చని మీరు అర్థం చేసుకుంటున్నారు. పేమెంట్‌తో ముందుకు సాగడానికి ముందు, ఈ వివరాలను జాగ్రత్తగా సమీక్షిస్తానని మీరు అంగీకరిస్తున్నారు.
- PhonePe చెక్అవుట్ ద్వారా, సంబంధిత PhonePe క్లయింట్ నుండి మీరు పొందాలని/కొనుగోలు చేయాలని అనుకుంటున్న ఉత్పత్తు(లు)/సేవ(లు) కోసం మీ చెక్అవుట్ విధానాన్ని పూర్తి చేయడానికి PhonePe కేవలం మిమ్మల్ని ఎనేబుల్ చేయడం/సులభతరం చేస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. అంతే కాక, ఉత్పత్తు(లు)/సేవ(లు) ఫుల్ఫిల్మెంట్/ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ అనేది PhonePe క్లయింట్‌కు సంబంధించిన పూర్తి బాధ్యత అని మీరు అర్థం చేసుకున్నారు.
- అటువంటి ఉత్పత్తు(లు)/సేవ(లు)కు సంబంధించి నాణ్యత, వ్యాపారితత్వం, లోపం, డెలివరీ చేయకపోవడం, డెలివరీలో జాప్యాలతో సహా, తలెత్తే వివాదాలన్నింటితో పాటు ఏదైనా ఇతర వివాదం/సమస్య అనేవి మీకు, సంబంధిత PhonePe క్లయింట్‌కు మధ్య హ్యాండిల్ చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వివాదం/సమస్య విషయంలో PhonePeను ఒక పార్టీగా చేర్చకూడదని మీరు అర్థం చేసుకొని అంగీకరిస్తున్నారు. అదనంగా, అటువంటి ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలు అనేది (రిటర్న్స్/రీఫండ్ వ్యవధితో సహా, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు) సంబంధిత PhonePe క్లయింట్ నియమాలు, షరతుల ప్రకారం నిర్వహిస్తారు. అటువంటి ఉత్పత్తు(లు)/సేవ(లు)ను కొనుగోలు చేయడం / పొందడం కొనసాగించడానికి ముందు ఆ PhonePe క్లయింట్ అందించిన / వర్తింపజేసిన నియమ, నిబంధనలను సమీక్షించుకోవాలని మిమల్నికోరుతున్నాము.
- ఉత్పత్తు(లు)/సేవ(లు) విషయంలో మీ కొనుగోలుకు సంబంధించి, మీరు అందించిన/నిర్దారించిన డేటాను PhonePe చెక్అవుట్ (నిర్దిష్ట కొనుగోలుకు సంబంధించి) ద్వారా అందించిన / నిర్దారించిన డేటాను మీరు కొనుగోలు చేసిన సంబంధిత PhonePe క్లయింట్‌తో PhonePe పంచుకుంటుందనే విషయాన్ని మీరు దీని ద్వారా అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు. అటువంటి డేటాను PhonePe పంచుకున్న తర్వాత, ఏ పరిస్థితులలోనైనా PhonePe క్లయింట్ వినియోగానికి/ప్రాసెసింగ్‌కు సంబంధించి PhonePe బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు. అదనంగా, మీరు PhonePe చెక్అవుట్లో మీకు అందించిన ఏదైనా డేటాను నిల్వ చేయడం/నిలుపుకోవడం ఇంకా ప్రాసెస్ చేయడానికి కూడా అంగీకరిస్తున్నారు.
- PhonePe చెక్అవుట్లో భాగంగా, ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలుకు/లభ్యతకు సంబంధించిన పేమెంట్లను మీ కోసం PhonePe సులభతరం చేస్తుంది. మీరు ఎంచుకున్న పేమెంట్ ఆప్షన్/పద్ధతిని బట్టి, PhonePe ప్లాట్ఫామ్లో అందించిన సంబంధిత నియమ, నిబంధనలు (సంబంధిత పేమెంట్ ఆప్షన్/పద్ధతికి వర్తించేవి) వర్తిస్తాయి. ఈ నియమ, నిబంధనలు, సూచనల ద్వారా ఇక్కడ చేర్చబడినట్లు పరిగణించబడతాయి.
- PhonePe చెక్అవుట్కు సంబంధించి కొన్ని ఆఫర్లు మీకు (PhonePe/PhonePe క్లయింట్/ఏదైనా మూడవ పార్టీ ద్వారా) అందించవచ్చు. సంబంధిత ఆఫర్ నియమ, నిబంధనలకు మీరు లోబడి ఉంటేనే అటువంటి ఆఫర్లో మీరు పాలు పంచుకోవచ్చని అంగీకరిస్తున్నారు. అటువంటి ఆఫర్‌కు సంబంధించి ఏదైనా వివాదం/సమస్య తలెత్తితే, అది మీరు, సదరు ఆఫర్‌ను అందించే పార్టీ మాత్రమే హ్యాండిల్ చేసుకోవాలని మీరు అంగీకరిస్తున్నారు.
ఇతర అంశాలు
- PhonePe చెక్అవుట్ను మీరు వినియోగించడం/యాక్సెస్ చేయడం లేదా PhonePe క్లయింట్ నుంచి ఉత్పత్తు(లు)/సేవ(లు)ను కొనుగోలు చేయడం/పొందడానికి సంబంధించి తలెత్తే ఏవైనా నష్టాలు, డ్యామేజీలు, చర్యలు, క్లెయిమ్‌లు అలాగే బాధ్యతలకు (చట్టపరమైన ఖర్చులతో సహా) PhonePeకి, దాని అనుబంధ సంస్థలు, ఉద్యోగులు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ప్రతినిధులు ఎలాంటి బాధ్యతా వహించరని మీరు అంగీకరిస్తున్నారు.
లాభాల్లో లేదా ఆదాయంలో నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవడం, కాంట్రాక్ట్, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా ఇతరత్రా, అందించిన సమాచారాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా, ఏదైనా పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు, అంతేకాక కాంట్రాక్ట్, హక్కుల అతిక్రమణ, నిర్లక్ష్యం, వారంటీ లేదా మరే దైనా కారణం కావచ్చు ఇలా వేటికైనా PhonePe ఏ సందర్భంలోనూ బాధ్యత వహించదు. - ఈ నియమాలు, దాని చట్టాల వైరుధ్యాల సూత్రాలకు సంబంధం లేకుండా భారత చట్టాలచే నియంత్రించబడతాయి,. ఈ నియమాలకు సంబంధించి మీకు, PhonePeకి మధ్య మొత్తంగా లేదా పాక్షికంగా ఉత్పన్నమయ్యే ఏదైనా దావా లేదా వివాదం బెంగుళూరులో ఉన్న అర్హత కలిగిన అధికార పరిధిలోని న్యాయస్థానం ద్వారా ప్రత్యేకంగా నిర్ణయించబడుతుంది.
- ఈ నియమాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచిన PhonePe చెక్అవుట్ సేవల ఖచ్చితత్వం, వాస్తవికతకు సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూచించే అన్ని వారెంటీలను PhonePe నిరాకరిస్తోంది.
- PhonePe వినియోగ నియమాలను, PhonePe గోప్యతా విధానాన్ని ఈ నియమాలలో చేర్చినట్లుగా పరిగణిస్తాము.