ఈ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 నిబంధనల ప్రకారం రూపొందించిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. దీనికి కాలానుగుణంగా సవరణలు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000ను అనుసరించి సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన సవరణలు, నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డును ఒక కంప్యూటర్ సిస్టమ్ రూపొందించింది. దీనిపై ఎటువంటి ఫిజికల్ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
మీ డెబిట్/క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి PhonePe ప్లాట్‌ఫామ్(ల)లో ఏవైనా ప్రోడక్ట్‌లను లేదా సర్వీసులను (“PhonePe సర్వీసులు”) పొందినందుకు గాను, ఏదైనా పేమెంట్‌ను చేసే ముందు దయచేసి నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. ఈ నియమ నిబంధనలను (ఇకపై “డెబిట్/క్రెడిట్ కార్డ్ పేమెంట్లు” లేదా “DCCP” అని పిలవబడతాయి) మీకు, ఆఫీస్-2, 4,5,6,7 వఅంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియాసాఫ్ట్‌జోన్, సర్వీస్రోడ్, గ్రీన్గ్లెన్లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియా వద్ద రిజిస్టర్డ్ చిరునామా కలిగిన PhonePe ప్రైవేట్ లిమిటెడ్‌కు (“PhonePe” / “మేము” / “మా”) మధ్య ఏర్పడే ఒక చట్టపరమైన ఒప్పందంగా పరిగణించబడుతుంది. మీరు ఈ కింద పేర్కొన్న నియమ నిబంధనలను చదివారని మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ నియమాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోయినా లేదా వీటికి కట్టుబడి ఉండటానికి మీరు సమ్మతించకపోతే, మీరు ఈ సేవలను ఉపయోగించకూడదు మరియు/లేదా ఈ సేవలను తక్షణమే రద్దు చేయాలి.
మేము ఎప్పుడైనా ఈ నియమ నిబంధనలలో మార్పులు చేయవచ్చు. అలా చేసి వాటిని PhonePe యాప్(లు) మరియు PhonePe వెబ్‌సైట్(ల)లో అప్‌డేట్ అయిన వెర్షన్‌ను పోస్ట్ చేస్తాము. ఇలా అప్‌డేట్ అయిన వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే అవి వర్తించడం ప్రారంభం అవుతుంది. DCCPని ఉపయోగించేటప్పుడు లేదా ఈ నియమ నిబంధనల్లో వచ్చే అప్‌డేట్‌లను / మార్పులను కాలానుగుణంగా సమీక్షించే బాధ్యత మీదే. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత PhonePe ప్లాట్‌ఫామ్‌లలో DCCPని ఉపయోగించడం కొనసాగిస్తే అదనపు నియమాలను లేదా వాటి తొలగింపును లేదా ఈ నియమాలలో జరిగిన మార్పులతో సహా ఆ సవరణలను మీరు అంగీకరించి, వాటిని ఆమోదిస్తున్నారని పరిగణిస్తాము. మీరు ఈ నియమాలకు కట్టుబడి ఉన్నంత కాలం, ఈ సేవలను పొందేందుకు గాను ఒక వ్యక్తిగతమైన, ప్రత్యేకం-కాని, బదిలీ-చేయలేని, పరిమిత హక్కును మేము మీకు జారీ చేస్తున్నాము.
PhonePe ప్లాట్‌ఫామ్‌లో DCCPని ఉపయోగించడానికి కొనసాగడం ద్వారా, మీరు (“వినియోగదారు”/ “మీరు” / “మీ”) సాధారణ PhonePe నియమ నిబంధనలకు (“సాధారణ వినియోగ నియమాలు”), PhonePe “గోప్యతా విధానం”కి కట్టుబడి ఉండటానికి సమ్మతిస్తున్నారు. PhonePe అప్లికేషన్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు PhonePeతో ఒక ఒప్పందాన్ని ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో మీకు PhonePeతో ఉండే అనివార్య బాధ్యతలను ఇక్కడ పేర్కొన్న నియమ నిబంధనలు వివరిస్తాయి.
ఈ నియమ నిబంధనలు, పేమెంట్ కార్డ్ నెట్‌వర్క్‌ల (AMERICAN EXPRESS, DINERS CLUB,MASTERCARD,RUPAY, MAESTRO, VISA) ద్వారా లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌లో పేమెంట్లను చేయడానికి ఉపయోగించే లేదా ఉపయోగించాల్సిందిగా ఆఫర్ చేసే ఏదైనా ఇతర పేమెంట్ కార్డ్ నెట్‌వర్క్ ద్వారా చేసే పేమెంట్లను నియంత్రిస్తాయి.
PhonePe యాప్‌లో లేదా PhonePe వ్యాపారులకు/మర్చెంట్‌లకు ఉత్పత్తులకు, సేవలకు గాను పేమెంట్లు చేయడానికి వీలుగా మీ కోసం PhonePe డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ పేమెంట్ సౌలభ్య సర్వీసులను అందిస్తోంది. ఈ లావాదేవీలు మీకు, సదరు వ్యాపారుల/బిల్లర్ల మధ్య జరుగుతాయి, మేము కేవలం ఒక మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నాము. మీ నుండి పేమెంట్లను అందుకుని, ఆ పేమెంట్లను సదరు వ్యాపారి/బిల్లర్‌కు అందేలా సౌకర్యాన్ని అందిస్తున్నాము. అలా చేయడానికి, పలు బ్యాంకులతో, పేమెంట్ & సెటిల్‌మెంట్ సిస్టమ్‌ల చట్టం 2007లో నిర్వచించినట్లుగా పేమెంట్ సిస్టమ్ సేవా సంస్థలతో, అలాగే కార్డ్ అసోసియేషన్లతో, ఇంకా ఇతర పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ సేవా సంస్థలతో మేము ఒప్పందాలను కుదుర్చుకున్నాము. ఈ ఒప్పందాల వల్ల, వారు అందించే ఇంటర్నెట్ పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించుకుని మీకు, సదరు వ్యాపారులు/బిల్లర్ల మధ్య పేమెంట్లను చేరవేయడానికి వీలవడమే కాక, మీ లావాదేవీకి సంబంధించి క్లియరింగ్, పేమెంట్ ఇంకా సెటిల్‌మెంట్ సేవలను అందించగలుగుతున్నాము.
కార్డ్ అసోసియేషన్లు, మీ కార్డును జారీ చేసిన బ్యాంక్/ఆర్థికపరమైన సంస్థ మీరు అందించే పేమెంట్ సూచనలను పేమెంట్ సిస్టమ్ సేవా సంస్థకు చెందిన పేమెంట్ గేట్‌వే ద్వారా ఆథరైజ్ చేసి, ధృవీకరించి ప్రాసెస్ చేస్తాయి. అటువంటి ఆథరైజేషన్/ధృవీకరణను PhonePe నియంత్రించదు, అందులో కలుగజేసుకోదు, ఏ ఇతర పాత్రనూ పోషించదు.
“కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్ నియమాలు” అనేవి కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌లు నిర్దేశించి, ఆచరించే నియమాలు, నియంత్రణలు, రిలీజ్‌లు, మార్గదర్శకాలు, ప్రక్రియలు, విశ్లేషణలు, ఇతర ఆవశ్యకతలను (అవి ఒప్పందం ప్రకారం వర్తించేవైనా కాకపోయినా) సూచిస్తాయి. లావాదేవీలను ఆథరైజేషన్‌ను ఎనేబుల్ చేసేందుకు గాను, ఈ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, ప్రక్రియలను కలిగి ఉంటాయి. వారు నిర్దేశించిన, వర్తించే మార్గదర్శకాలు, నియమాలు, నియంత్రణలన్నింటినీ మీరు పాటించాల్సి ఉంటుందని కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌లు నిర్దేశిస్తున్నాయి.
పేమెంట్ సేవా సంస్థలు, కార్డ్ అసోసియేషన్లు కాలక్రమేణా నిర్దేశించే నియమాలు, మార్గదర్శకాలు, దిశలు, సూచనలు, అభ్యర్థనలు మొదలైన వాటన్నిటికీ మీరు సమ్మతించి, వాటిని మీరు పాటిస్తారని అంగీకరిస్తున్నారు. అంతే కాక, పేమెంట్ సేవా సంస్థలు, కార్డ్ అసోసియేషన్లతో పాటు మీ కార్డ్‌ను జారీ చేసిన బ్యాంక్/ఆర్థికపరమైన సంస్థలు కూడా తమ విచక్షణ మేరకు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లపై పరిమితులు విధించవచ్చు, అటువంటి పరిమితులు/నియంత్రణల గురించి PhonePeకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి, అన్ని వేళలా లావాదేవీ విజయవంతంగా ప్రాసెస్ అవుతుందని PhonePe హామీ ఇవ్వడం సాధ్యపడదు. అలాగే ఏదైనా లావాదేవీ విఫలం అయినందువల్ల మీరు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష లేదా తత్కారణ నష్టాలను ఎదుర్కొంటే వాటికి PhonePe బాధ్యత వహించదు.
PhonePe మీ లావాదేవీలను పర్యవేక్షిస్తుంది, మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి గాను, అంతర్గతంగా ఏర్పరుచుకున్న కొన్ని రిస్క్ పారామీటర్ల ఆధారంగా కొన్ని లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉంది. అంతే కాక, కొన్ని లావాదేవీలను నియంత్రణా సంస్థలకు లేదా చట్టపరమైన ఏజెన్సీలకు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లావాదేవీలు అసాధారణమైనవి లేదా రిస్క్ అధికంగా ఉన్నవి అయితే మీ PhonePe ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు.
లావాదేవీలను సులువుగా ప్రాసెస్ చేసేందుకు వీలుగా, మీ కార్డ్ వివరాలను – అంటే కార్డ్ నంబర్, గడువు ముగింపు తేదీ-లను సురక్షితంగా గుప్తీకరించిన పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా భద్రతా ప్రమాణం “PCI-DSS” తగినట్టుగా ఉండే జోన్లో సురక్షితంగా సేవ్ చేసుకునే ఆప్షన్‌ను PhonePe అందిస్తుంది. అటువంటి కార్డ్ స్టోరేజ్ ఫీచర్‌ను మీరు ఉపయోగించినట్లయితే, మేము మీ కార్డ్ వివరాలను సేవ్ చేస్తాము. తర్వాతి సారి మీరు ఏదైనా పేమెంట్‌ను చేసినప్పుడు, పేమెంట్ అభ్యర్థనను పంపేటప్పుడు సేవ్ చేసిన కార్డ్‌ను ఎంచుకుంటే చాలు, మీ పేమెంట్ ఆదేశాన్ని ఆథరైజేషన్ కోసం పంపడం జరుగుతుంది. OTPలు, CVVలు, 3D-సురక్షిత పాస్వర్డ్, ATM PIN మొదలైన మీ కార్డ్ ఆథరైజేషన్ వివరాలను PhonePe ఎన్నడూ సేవ్ చేయదు, మీరు ఆథరైజ్ చేయకుండా లావాదేవీలను ప్రాసెస్ చేయలేదు.
మీ కార్డ్ డేటాను సురక్షితంగా ఉంచేందుకు, మీ సమాచారం ప్రమాదవశాత్తు కోల్పోకుండా ఉండేలా, అలాగే అధికారం లేని వారు యాక్సెస్ చేయలేకుండా నివారించడానికి గాను, సాంకేతికపరమైన మరియు సంస్థాగతమైన భద్రతా నియంత్రణలు, ప్రోటోకాల్స్ అమలు చేయబడతాయి. ఇటువంటి ప్రమాణాలు, ప్రోటోకాల్స్ అమలు చేయబడి, అవి పర్యవేక్షించబడుతున్నప్పటికీ మీ సమాచారాన్ని థర్డ్ పార్టీలు యాక్సెస్ చేయలేకుండా అన్ని వేళలా నివారించగలమని మేము హామీ ఇవ్వడం లేదని మీరు అర్థం చేసుకుని, రిస్కులను దృష్టిలో ఉంచుకుని మీ సొంత రిస్క్ మీద మీ సమాచారాన్ని అందిస్తున్నారని అంగీకరిస్తున్నారు.
PhonePe ప్లాట్‌ఫామ్‌పై చేసే పేమెంట్లకు లేదా ఆ ప్లాట్‌ఫామ్‌కు చేసే పేమెంట్లకు మీ కార్డును జారీ చేసిన బ్యాంక్ లేదా ఆర్థికపరమైన సంస్థ మీకు ఫీజును, ఛార్జీలను లేదా ఏవైనా ఇతర ప్రాసెసింగ్ ఫీజు(ల)ను విధించవచ్చు. అటువంటి ఛార్జీలపై లేదా ఫీజు(ల)పై PhonePeకు ఎటువంటి నియంత్రణా ఉండదనీ, ఆయా ఛార్జీలకు ఎటువంటి బాధ్యతా వహించదని మీరు అర్థం చేసుకున్నారు. ఆయా ఛార్జీలు లేదా ఫీజు(ల) గురించి తెలుసుకోవడానికి మీ కార్డును జారీ చేసిన బ్యాంక్/ఆర్థికపరమైన సంస్థను మీరే సంప్రదించాలి.
ఏవైనా ఆర్డర్లను పూర్తిగా నెరవేర్చని పక్షంలో లేదా వాటిని రిటర్న్ ఇచ్చిన పక్షంలో, సదరు వ్యాపారులు/బిల్లర్లు లేదా PhonePe ప్రారంభించిన ఏవైనా రీఫండ్లు/రివర్సల్స్ అనేవి సోర్సు ఖాతాలోకి లేదా మీ PhonePe వాలెట్‌లోకి లేదా eGVలలోకి లేదా వేరే ఏదైనా అనుమతి గల ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్‌లోకి మీ సమ్మతితోనే జమ చేయబడతాయి.
మీరు ఏవైనా ‘సబ్‌స్క్రిప్షన్‌లు’ లేదా రిపీట్ పేమెంట్ ఆదేశాలకు సమ్మతించి ఉంటే, సంబంధిత మొత్తం సంబంధిత కార్డు ద్వారా, మీరు ఆమోదించిన ఆదేశాన్ని అనుసరించి ఛార్జీ విధించబడుతుందని మీరు సమ్మతిస్తున్నారు. అటువంటి ఆదేశాన్ని మీరు రద్దు చేసే వరకు, PhonePe, PhonePe గ్రూప్, PhonePe అనుబంధసంస్థలు లేదా సదరు వ్యాపారులు/బిల్లర్లు ఆయా మొత్తాన్ని మీ కార్డ్‌పై ఛార్జీగా విధించడం కొనసాగిస్తారు.
ఇలా నిరంతరంగా మెరుగుదలలు చేస్తూ ఆవిష్కరణలు చేసే ప్రక్రియలో భాగంగా, కొన్ని ఫీచర్లను, ఫంక్షనాలిటీలను మేము చేర్చవచ్చు లేదా తీసివేయవచ్చు, అలాగే మా PhonePe సేవలకు ఉండే పరిమితులను మేము పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, PhonePe ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సేవలను అందించవచ్చు లేదా పాత సేవలను ఆపివేయవచ్చు. అలా ఏదైనా సేవను ఆపివేయడం అనేది, సదరు సేవను లేదా సౌలభ్యాన్ని PhonePe ప్లాట్‌ఫామ్‌లో థర్డ్ పార్టీ సేవా సంస్థలు లేదా వ్యాపార భాగస్వాములు నిలిపివేయడం వల్ల కూడా జరగవచ్చు.
ఇక్కడ ప్రత్యేకించి పేర్కొన్న సందర్భాల్లో మినహా, వర్తించే చట్టాల పూర్తి పరిధి మేరకు, PhonePe సేవలను “ఉన్నది ఉన్నట్టుగా”, “అందుబాటులో ఉన్న మేరకు”, ఇంకా “అన్ని లోపాలతో” అందించడం జరుగుతోంది. కాబట్టి, అటువంటి వారంటీలు, ప్రాతినిధ్యాలు, పరిస్థితులు, అండర్‌టేకింగ్‌లు, అలాగే నియమాలు, వాటిని ప్రత్యేకించి పేర్కొన్నా, పేర్కొనకపోయినా, మినహాయించబడుతున్నాయి. PhonePe సేవలు ఎంత మేరకు ఉపయోగకరంగా ఉన్నాయి అనే అంశంతో పాటు, వాటి ఖచ్చితత్వం, సంపూర్ణత అనేవే కాక PhonePe అందించే సమాచారాన్ని లేదా సాధారణంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బేరీజు వేసుకునే బాధ్యత మీదే. మా తరఫున ఏదైనా వారంటీ ఇచ్చేందుకు మేము ఎవరికీ అధికారాన్ని ఇవ్వలేదు, అటువంటి హామీలను మీరు నమ్మకూడదు.
UPI ద్వారా RUPAY క్రెడిట్ కార్డ్
UPI ద్వారా RuPay క్రెడిట్ కార్డును ఉపయోగించి మర్చంట్లకు పేమేంట్ చేయగలిగేలా ఎవరైనా మర్చంట్లు ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన సందర్భాల్లో, సదరు మర్చంట్లకు ఆ పద్ధతిలో పేమెంట్(ల)ను చేసే సౌలభ్యాన్ని మేము మీకు అందించే అవకాశం ఉంది. UPI ద్వారా మీ RuPay క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి పేమెంట్లను ఎనేబుల్ చేయడానికి మీ RuPay క్రెడిట్ కార్డును PhonePe యాప్‌లో UPIతో లింక్ చేయాల్సి ఉంటుంది, అలాగే మీరు ఒక M-పిన్‌ను సెట్ చేయాల్సి ఉంటుంది. PhonePe యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయిన RuPay క్రెడిట్ కార్డును మాత్రమే UPI ద్వారా మీరు లింక్ చేయగలరు.
M-పిన్‌ను తయారు చేయడానికి, మీ RuPay క్రెడిట్ కార్డుకు చెందిన చివరి ఆరు (6) అంకెలను, దాని గడువు ముగింపు తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉన్న RuPay క్రెడిట్ కార్డ్ వివరాలను మేము అందుకుంటాము. ఆ తర్వాత, ఆ RuPay క్రెడిట్ కార్డును UPI ద్వారా లింక్ చేయడానికి మీకు వెసులుబాటు వస్తుంది. ఒకసారి M-పిన్ తయారు అయ్యాక, ఆ M-పిన్‌ను ఉపయోగించి లావాదేవీ(ల)ని మీరు ఆమోదించవచ్చు. మీ RuPay క్రెడిట్ కార్డ్ వివరాలను, OTPని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
VPAను ఉపయోగించి UPIతో లింక్ చేసిన RuPay క్రెడిట్ కార్డ్ ఖాతాకు పేమెంట్ చేసిన మొత్తం ఏదైనా ఆ క్రెడిట్ కార్డ్ బిల్‌కు చేసే పేమెంట్ అవుతుంది. అదనంగా, UPIని ఉపయోగించి RuPay క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన ఏవైనా ఫార్వర్డ్ పేమెంట్(ల)కు రీఫండ్స్ అందినట్లయితే, ఆ మొత్తం క్రెడిట్ ఖాతాలో జమ/సర్దుబాటు చేయబడుతుంది. UPI ద్వారా మీ RuPay క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి పేమెంట్లను చేయగలిగేలా ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన వ్యాపారులకు మాత్రమే ఈ పేమెంట్లు చేయవచ్చు. వేరే ఏ విధమైన ఇతర పేమెంట్(ల)కూ (ఇందులో ఇతర వ్యక్తులకు నగదు బదిలీ, బ్యాంక్ ఖాతా బదిలీ ఉంటాయి) లేదా నగదు విత్‌డ్రాయల్‌కు ఉపయోగించకూడదు.
UPI ద్వారా RuPay క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి లావాదేవీలను జరిపేటప్పుడు, UPI లావాదేవీలకు వర్తించే లావాదేవీ పరిమితులు వర్తిస్తాయి. అంతే కాక, ఆ కార్డ్ జారీ చేసిన సంస్థ ఏవైనా పరిమితులను విధిస్తే ఆ పరిమితులు తుది పరిమితులుగా పరిగణించబడతాయి (UPI లావాదేవీలకు వర్తించే పరిమితుల కన్నా, ఆ కార్డు జారీ చేసిన సంస్థ విధించే పరిమితులు తక్కువగా ఉన్న సందర్భాలలో ఇది వర్తిస్తుంది). మీరు లింక్ చేసిన RuPay క్రెడిట్ కార్డ్‌లో ‘అందుబాటులో ఉన్న / కార్డ్ పరిమితి బ్యాలెన్స్’ను చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ సదుపాయంలో భాగంగా NPCI అందజేసినట్టుగా మీ ‘అందుబాటులో ఉన్న / కార్డ్ పరిమితి’ని మేము చూపుతామని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి బ్యాలెన్స్ వివరాలను అందించడంలో ఏదైనా వైఫల్యానికి గానీ, జాప్యానికి గానీ లేదా సదరు సమాచారంలోని ఏదైనా తప్పులకు గానీ ఖచ్చితత్వానికి గానీ మేము బాధ్యత వహించబోము.
మీ RuPay క్రెడిట్ కార్డ్‌లో UPIని ఉపయోగించి అంగీకారం పొంది, చేసిన లావాదేవీ(ల)కు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే, అవి PhonePe UPI వినియోగ నియమాలలోని ‘వివాదాలు, సమస్యల పరిష్కారం’ విభాగంలో (ఇక్కడ అందుబాటులో ఉంది: https://www.phonepe.com/terms-conditions/upi/ ) పేర్కొన్న ప్రక్రియ ప్రకారం, లేదా UPI లావాదేవీల విషయంలో NPCI (కాలక్రమేణా) సూచించే ఇతర ప్రక్రియల ప్రకారం ప్రాసెస్ అవుతాయి. ఏవైనా రీఫండ్స్‌ను/రివర్సల్స్‌ను ప్రాసెస్ చేయాల్సి ఉంటే అవి UPI లావాదేవీ(ల)కు వర్తించే కాల వ్యవధుల ప్రకారం ప్రాసెస్ అవుతాయి.