గోప్యతా విధానం
16, ఏప్రిల్ 2024న అప్‌డేట్ చేయబడింది
ఈ పాలసీ కంపెనీల చట్టం, 1956 ద్వారా స్థాపించబడిన PhonePe ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వర్తిస్తుంది. దీని చిరునామా ఆఫీస్-2, 5వ అంతస్తు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్ జోన్, బెల్లందూర్ విలేజ్, వర్తూర్ హొబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు, సౌత్ బెంగళూరు, కర్ణాటక, ఇండియా, 560103గా రిజిస్టర్ చేయబడింది. కేవలం PhonePe ప్రైవేట్ లిమిటెడ్, PhonePe ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, PhonePe వెల్త్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, PhonePe లెండింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో PhonePe క్రెడిట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, “ఎక్స్‌ప్లోరమ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్” అని పిలువబడేది), PhonePe టెక్నాలజీ సర్వీసెస్ (“PhonePe AA”), పిన్‌కోడ్ షాపింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో PhonePe షాపింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, PhonePe పేమెంట్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలువబడేది), వెల్త్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా PhonePe, దాని ఉపసంస్థలు/అనుబంధ సంస్థలను కూడా కలుపుకుని, (సమిష్టిగా “PhonePe, మేము, మన, మా” అని సందర్భాన్ని బట్టి పిలవబడతాయి) ఇది వర్తిస్తుంది.
మీకు తన సేవలను అందించడం కోసం PhonePe (ఇకనుండి ఇది “ప్లాట్ ఫారం”అని పిలువబడుతుంది) తన వెబ్‌సైట్లు, PhonePe అప్లికేషన్లు, m-సైట్లు, చాట్‌బాట్లు, నోటిఫికేషన్‌లు లేదా PhonePe ఉపయోగించే మరేదైనా ఇతర మాధ్యమం ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది, ఎలా నిల్వ చేస్తుంది, ఎలా ఉపయోగించి, ప్రాసెస్ చేస్తుందనే విషయాలను ఈ గోప్యతా విధానం వివరిస్తుంది. PhonePe ప్లాట్ ఫారంను సందర్శించడం, డౌన్ లోడ్ చేయడం, ఉపయోగించడం, PhonePe వెబ్‌సైట్‌ను సందర్శించడం మరియు/లేదా మీ సమాచారాన్ని అందించడం లేదా మా ఉత్పత్తి/సేవలను పొందడం ద్వారా, ఈ గోప్యతా విధానానికి (“విధానం”), వర్తించే సేవ/ఉత్పత్తి నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటారని మీరు నిరభ్యంతరంగా అంగీకరిస్తున్నారు. మీరు మాపై ఉంచిన నమ్మకానికి మేము విలువనిస్తాం. అలాగే మీ గోప్యతను గౌరవిస్తాం. లావాదేవీలకు భద్రత కల్పించడం కోసం, అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం కోసం మేము అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాము.
సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సమాచార సాంకేతిక చట్టం (తగిన సెక్యూరిటీ విధానాలు మరియు పద్ధతులు సహా భారతీయ చట్టాలు మరియు నియంత్రణలు, సున్నితమైన వ్యక్తిగత డేటా లేదా సమాచారం) నిబంధనలు, 2011లోని అంశాలు, ఆధార్ నియంత్రణలు సహా ఆధార్ చట్టం, 2016, దాని సవరణలకు; లోబడి వర్తించేలా ఈ గోప్యతా విధానం ప్రచురించబడి, అనుగుణంగా ఉంటుంది. దీనికోసం వ్యక్తిగత సమాచారం సేకరణ, వినియోగం, నిల్వ, బదిలీ కోసం గోప్యతా విధానం ప్రచురణ జరగాలి. వ్యక్తిగత సమాచారం అంటే ఒక నిర్దిష్ట వ్యక్తికి సంబంధించి లింక్ చేయగల అన్ని రకాల సమాచారం. అంతేకాక సున్నితమైన వ్యక్తిగత సమాచారం (సున్నితత్వం, వ్యక్తిగత స్వభావం కారణంగా ఎక్కువగా డేటా రక్షణ అవసరమైన వ్యక్తిగత సమాచారం) కూడా కలిగి ఉంటుంది. (ఇక నుండి ఈ రెండూ “వ్యక్తిగత సమాచారం” అని సంబోధించబడతాయి) ఉంటుంది, కానీ పబ్లిక్ డొమైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉండే లేదా ఉచితంగా యాక్సెస్ చేయగల సమాచారం సున్నితమైన వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడదు. మా ఉత్పత్తులు/సేవలు భారతదేశంలో భారతీయులకోసం అందించబడుతున్నాయని, మీ వ్యక్తిగత వివరాల ప్రాసెసింగ్ భారతీయ చట్టాలకు లోబడే జరుగుతుందని దయచేసి గమనించండి. ఒకవేళ మీరు మా గోప్యతా విధానాన్ని అంగీకరించకపోతే, దయచేసి మా వేదికను ఉపయోగించకండి, యాక్సెస్ చేయకండి.
సమాచార సేకరణ
మీరు మా సేవలను లేదా వేదికను ఉపయోగించినప్పుడు లేదా మీకు మాకు గల వృత్తిపరమైన సంబంధంలో భాగంగా మీరు మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము. మీరు కోరిన సేవలను అందించడానికి వీలుగా వాటికి కచ్చితంగా అవసరమైన, సంబంధిత వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే మేము సేకరిస్తాము. అలాగే PhonePe వేదికను నిరంతరం అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే సమాచారాన్ని మేము సేకరిస్తాము.
వర్తించిన విధంగా సేకరించిన వ్యక్తిగత, సున్నితమైన వ్యక్తిగత సమాచారంలో కింద తెలిపినవి ఉంటాయి కానీ వీటికి మాత్రమే పరిమితం కావు:
- పేరు, వయస్సు, లింగం, ఫోటో, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, మీ కాంటాక్ట్‌లు మరియు నామినీ వివరాలు
- సంబంధిత నియంత్రణ అధికారులు తప్పనిసరి చేసిన విధంగా ఆదాయ వివరాలు, మీ వ్యాపార సంబంధిత సమాచారం, వీడియోలు లేదా ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ల వంటి KYC సంబంధిత సమాచారం.
- యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో ఇ-KYC ప్రమాణికీకరణ ప్రయోజనాలకోసం ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి సహా ఆధార్ సమాచారం. ఇ-KYC ప్రమాణికీకరణకు ఆధార్ సమాచారం తప్పనిసరి కాదు అని, గుర్తింపు సమాచారాన్ని సమర్పించేందుకు ఇతర ప్రత్యమ్నాయాలు కూడా ఉన్నాయని (ఉదా., ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి) అని గమనించగలరు.
- మీ బ్యాంక్, NSDL లేదా PhonePe వారు మీకు పంపిన OTP
- PhonePe ద్వారా లావాదేవీలను సులువుగా పూర్తి చేయడం కోసం లేదా ఇతర సేవల కోసం బ్రోకర్ లెడ్జర్ బ్యాలెన్స్ లేదా మార్జిన్లు సహా బ్యాలన్స్, లావాదేవీ చరిత్ర మరియు విలువ, బ్యాంక్ ఖాతా వివరాలు, వాలెట్ బ్యాలన్స్, మదుపు వివరాలు మరియు లావాదేవీలు, ఆదాయ శ్రేణి, వ్యయశ్రేణి, పెట్టుబడి లక్ష్యాలు, సేవలకు లేదా లావాదేవీలకు సంబంధించిన కమ్యూనికేషన్, ఆర్డర్ వివరాలు, సేవ ఫుల్‌ఫిల్‌మెంట్ వివరాలు, మీ కార్డ్ వివరాలలో కొంత భాగం
- సాధనం ఐడెంటిఫైయర్, ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్, మొబైల్ సాధనం మోడల్, బ్రౌజర్ ప్లగ్-ఇన్‌ల వంటి మీ సాధనం వివరాలు, కుక్కీలు లేదా మీ బ్రౌజర్/PhonePe అప్లికేషన్లను గుర్తించే కుక్కీల లాంటి టెక్నాలజీలు, ప్లగ్-ఇన్‌లు, గడిపిన సమయం, IP అడ్రస్, ప్రదేశం లాంటి వివరాలు
- మిమ్మల్ని మరియు మీ సాధనాన్ని పేమెంట్లు లేదా పెట్టుబడి సేవల కోసం రిజిస్టర్ చేయడం, లాగిన్లు మరియు పేమెంట్ల కోసం OTPలు, మీ భద్రతను మెరుగుపరచడం, బిల్ పేమెంట్లు, రీఛార్జ్ రిమైండర్లు, ఇంకా మీ స్పష్టమైన అంగీకారంతో ఏదైనా ఇతర చట్టబద్ధ వినియోగాల కోసం పంపే ఉద్దేశాలకోసం మీ సంక్షిప్త సందేశ సేవ (SMS(లు)) మీ సాధనంలో సేవ్ చేయబడుతాయి.
- హెల్త్ ట్రాకింగ్ సేవలను మీరు కోరుకున్నప్పుడు మీ శారీరక కార్యకలాపం సహా మీ ఆరోగ్య, జీవనశైలి సంబంధిత సమాచారం
PhonePe వేదికను మీరు వాడుతున్నప్పుడు వివిధ దశల్లో సమాచారాన్ని సేకరించవచ్చు, అవేంటంటే:
- PhonePe వేదికను సందర్శించినప్పుడు
- PhonePe వేదికలో “వినియోగదారు” లేదా “విక్రేత” లాగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు లేదా PhonePe వేదిక నియమ, నిబంధనలకు లోబడి ఉండే మరేదైనా ఇతర వృత్తిపరమైన సంబంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు
- PhonePe వేదికలో లావాదేవీలు చేసినప్పుడు లేదా లావాదేవీ కోసం ప్రయత్నించినప్పుడు
- PhonePe వేదికకు చెందిన లేదా పంపిన లింక్‌లు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలు, ఫీడ్‌బ్యాక్‌లు, నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేసినప్పుడు, అలాగే అప్పుడప్పుడు జరిగే సర్వేలలో పాల్గొనడానికి మీరు సమ్మతించినప్పుడు
- ఏవైనా PhonePe ఉపసంస్థలు/అనుబంధ సంస్థలతో వృత్తిపరమైన సంబంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు
- PhonePeతో కెరీర్ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు
మేము మరియు మా సేవా సంస్థలు లేదా వ్యాపార భాగస్వాములు థర్డ్ పార్టీల నుండి కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు లేదా కింది మార్గాలలో కూడా బహిరంగంగా అందుబాటులో ఉంటే సమాచారాన్ని కూడా సేకరించవచ్చు:
- మీకు PhonePe సేవలను అందించడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలను నివారించడానికి; లేదా కోర్టు తీర్పులు మరియు దివాలాలు, రుణ రెఫరెన్స్ మరియు మోసాల నివారణ ఏజెన్సీల నుండి కాపాడేందుకు మీరు మాకు చేసిన మదుపు లావాదేవీ అభ్యర్థనను సరిచూసి, ప్రమాణీకరించడం కోసం ఆర్థిక చరిత్ర మరియు ఇతర సమాచారం
- వాహన- సంబంధిత సమాచారం
- PhonePeతో ఉద్యోగావకాశాల కోసం మీరు అప్లై చేసి ఉంటే దానికోసం చట్టబద్ధంగా పొంది ఉంటే తప్పించి, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ డేటాబేస్ ల ద్వారాతెరవెనుక తనిఖీలు, ధృవీకరణల కోసం మీ రిజ్యూమె, మీ గత ఉద్యోగం, విద్యార్ఙత
- ఆధార్ e-KYC విజయవంతమైన తర్వాత UIDAI నుండి అందుకున్న స్పందనగా ఆధార్ నెంబర్, లింగం, పుట్టినతేదీ మాత్రమే కాకుండా మీ జన్మ ప్రదేశం, ఫోటో సమాచారం
సమాచారం అవసరం, దాని వినియోగం
దిగువున తెలిపిన అవసరాల కోసం PhonePe మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు:
- మీ ఖాతాను క్రియేట్ చేసి, మీ గుర్తింపును ధృవీకరించి, యాక్సెస్ సదుపాయాలను ఇవ్వడానికి
- మేము, మర్చంట్లు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, పరిశోధన విశ్లేషకులు, ఉపసంస్థలు, అనుబంధ సంస్థలు, విక్రేతలు, లాజిస్టిక్ భాగస్వాములు లేదా వ్యాపార భాగస్వాములు అందించే ఉత్పత్తులు, సేవలకు మీకు యాక్సెస్ అందించడానికిమీ సేవ అభ్యర్థనను నెరవేర్చడానికి
- మీ సేవ అభ్యర్థనను నెరవేర్చడానికి
- ఆధార్ చట్టం మరియు దాని నియంత్రణల కింద ఉన్న UIDAI సహా వివిధ నియంత్రణా సంస్థల అవసరాల మేరకు తప్పనిసరిగా కావాల్సిన KYC అనుకూలత ప్రక్రియను నిర్వహించడానికి
- మీ KYC సమాచారాన్ని మరియు నామినీ వివరాలను తనిఖీ చేసి, ప్రాసెస్ చేసి మరియు/లేదా ఇతర మధ్యవర్తిత్వ సంస్థలు, నియంత్రణా సంస్థలు (REలు) లేదా AMCలు లేదా ఆర్థిక సంస్థలతో లేదా అవసరాన్ని బట్టి మరేదైనా ఇతర సేవా సంస్థలతో షేర్ చేయడానికి
- మీ సూచనల మేరకు మీ తరఫున పేమెంట్‌లను ప్రాసెస్ చేయడానికి; మీ సందేహాలు, లావాదేవీలు, మరియు/లేదా ఇంకేదైనా నియంత్రణా అవసరాల వంటి వాటి కోసం మీతో కమ్యూనికేట్ చేయడానికి.
- మీరు జరిపే వెల్త్ బాస్కెట్ల కొనుగోలు, విక్రయ లావాదేవీల కోసం వెల్త్ బాస్కెట్ క్యూరేటర్లు మీకు సేవలను అందించడం, కమ్యూనికేషన్లు చేయడం కోసం
- లావాదేవీ అభ్యర్థనను ధృవీకరించడానికి; సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్‌ను తనిఖీ చేయడానికి లేదా సేవల ద్వారా చేసిన పేమెంట్‌ను నిర్ధారించడానికి
- వివిధ ప్రక్రియలు/దరఖాస్తు సమర్పణలు/ఉత్పత్తి లభ్యత/అందించే సేవలలో వినియోగదారు ప్రవర్తనను సంపూర్ణ స్థాయిలో విశ్లేషించి, తద్వారా మీ వినియోగదారు అనుభూతిని మెరుగుపరచడానికి;
- ఎప్పటికప్పుడు ఉత్పత్తులు/సేవలను సమీక్షించి, పర్యవేక్షించడానికి; మీకు మరింత సురక్షితమైన, మరింత సులభమైన అనుభూతి కలిగేలా సేవలను అనుకూలీకరించడానికి, అలాగే ఆడిట్‌లను నిర్వహించడానికి
- PhonePe వేదిక లేదా థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా మీరు అభ్యర్థించిన/మీకోసం అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, సేవల కోసం మిమ్మల్ని సంప్రదించడం గురించి థర్డ్ పార్టీలను అనుమతించడానికి
- చట్టాల ప్రకారం మాకు అవసరమైన క్రెడిట్ చెక్ లు, పరిశీలనలు లేదా జాగరూకత పరీక్షలు చేయడానికి; తప్పిదం, మోసం, డబ్బు దోపిడీ, ఇతర నేరపూరిత కార్యాకలాపం లాంటి వాటిని గుర్తించి, రక్షించడానికి; మా నియమ, నిబంధనలను అమలు చేయడానికి
- వివాదాలను, సమస్యలను పరిష్కరించడానికి; సాంకేతిక సహాయం కోసం మరియు బగ్‌లు ఫిక్స్ చేయడానికి; సురక్షిత సేవను అందించడంలో సహాయం చేయడానికి
- సెక్యూరిటీ దాడులు, అక్రమ ప్రవేశాలను గుర్తించడానికి; చట్టబద్దంకాని కార్యకలాపాలను లేదా మోసం లేదా డబ్బు దోపిడీ కార్యకలాపాలుగా అనుమానించిన వాటిని పరిశోధించి, నివారించి, చర్య తీసుకోవడానికి, అలాగే అంతర్గత లేదా బహిర్గత ఆడిట్ లేదా PhonePe లేదా భారతదేశంలో లేదా భారత చట్టపరిధిని దాటి ఉన్న ప్రభుత్వ ఏజెన్సీల విచారణలో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్‌లను నిర్వహించడానికి
- చట్టపరమైన నిబద్ధతలను పాటించడానికి
ఇతర న్యాయబద్ధమైన వ్యాపార సందర్భాలలో కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము, అయితే మీ గోప్యతకు వీలైనంత తక్కువగా భంగం కలిగేలా ఉండటానికి వీలుగా ప్రాసెస్ చేసే దశలను తగ్గించడానికి తగు చర్యలు తీసుకున్నట్లు మేము నిర్ధారించుకుంటాం.
ఖాతా యాగ్రగేటర్ సేవలను మీకు అందించేటప్పుడు, మేము మా సేవల కింద బదిలీ చేయాలనుకుంటున్న ఏదైనా ఆర్థిక సమాచారాన్ని నిల్వ చేయడం కానీ, ఉపయోగించడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ లేదా యాక్సెస్ కలిగి ఉండడం కానీ చేయమని దయచేసి గమనించండి
కుక్కీలు లేదా అలాంటి టెక్నాలజీలు
మా వెబ్ పేజీ ఫ్లోను విశ్లేషించడానికి, ప్రమోషనల్ సమర్థతను కొలవడానికి, విశ్వసనీయతను, రక్షణను ప్రచారం చేయడానికి సహాయంగా మా వేదికలోని నిర్దిష్ట పేజీలలో “కుక్కీలు” లేదా అలాంటి టెక్నాలజీల వంటి డేటా సేకరణ సాధనాలను మేము ఉపయోగిస్తాం. “కుక్కీలు” అనేవి మీ సాధనం హార్డ్-డ్రైవ్/స్టోరేజీలో పెట్టిన చిన్న ఫైళ్లు. మా సేవలను అందించడానికి ఇవి సహాయం చేస్తాయి. కుక్కీలలో మీ వ్యక్తిగత సమాచారం ఏదీ ఉండదు. “కుక్కీ” లేదా అలాంటి టెక్నాలజీల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే నిర్దిష్ట ఫీచర్‌లను మేము అందిస్తాం. మీ పాస్‌వర్డ్‌ను మీరు తరచుగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చూడటానికి కూడా మేము కుక్కీలను ఉపయోగిస్తాం. మీ ఆసక్తులకు సంబంధించిన సమాచారాన్ని మాకు తెలియజేయడంలో కుక్కీలు లేదా అలాంటి టెక్నాలజీలు మాకు సహాయపడతాయి. చాలా వరకు కుక్కీలన్నీ “సెషన్ కుక్కీలే,” అంటే మీ సెషన్ పూర్తికాగానే అవి మీ సాధనం హార్డ్-డ్రైవ్/స్టోరేజీ నుండి స్వయంచాలకంగా తొలగించబడతాయి. ఒకవేళ మీ బ్రౌజర్/సాధనం అనుమతిస్తే, మీరు మా కుక్కీలను తిరస్కరించవచ్చు/తొలగించవచ్చు, కానీ అలా చేస్తే వేదికలోని నిర్దిష్ట ఫీచర్‌లను మీరు ఉపయోగించలేకపోవచ్చు, అలాగే సెషన్ సమయంలో మీరు మీ పాస్‌వర్డ్‌ను మరింత తరచుగా ఎంటర్ చేయాల్సిన అవసరం రావచ్చు. అదనంగా, వేదికలో థర్డ్ పార్టీలు పెట్టిన నిర్దిష్ట పేజీలలో కూడా మీకు “కుక్కీలు” లేదా అలాంటి ఇతర టెక్నాలజీలు కనిపించవచ్చు. థర్డ్ పార్టీల కుక్కీల వినియోగ పద్ధతిని మేము నియంత్రించము.
సమాచారాన్నిపంచుకోవడం, దానిని బహిర్గతం చేయడం
వర్తించే చట్టాలకు లోబడి, సరైన జాగ్రత్తలు పాటించి, మీ సమాచారాన్ని అందుకునే వారి గోప్యతా విధానాలు, పద్ధతులను విశ్లేషించి, అలాగే ఈ విధానంలో తెలిపిన అవసరాలకు తగినట్లుగా మీ వ్యక్తిగత సమాచారం షేర్ చేయబడుతుంది. PhonePe తరహాలో లేదా అంత కంటే కఠినమైన గోప్యతా విధానాలను అమలు చేస్తూ, ఆ పద్ధతులకు నిబద్ధులైన వారితో ఒప్పందంలోకి వచ్చిన తర్వాతే మీ వ్యక్తిగత సమాచారం షేర్ చేయబడుతుంది.
మీ లావాదేవీ జరిగే సమయంలో, ఒక్కో దశలో, వ్యాపార భాగస్వాములు, సేవా సంస్థలు, మర్చంట్లు, వెల్త్ బాస్కెట్ క్యూరేటర్లు, అఫిలియేట్లు, అనుబంధ సంస్థలు, ఉపసంస్థలు, న్యాయపరంగా గుర్తింపు ఉన్న సంస్థలు, నియంత్రణా సంస్థలు, ప్రభుత్వ అధికార యంత్రాంగాలు, ఆర్థిక సంస్థలతో పాటు మార్కెటింగ్, సెక్యూరిటీ, విచారణ మొదలైన అంతర్గత టీమ్‌ల వంటి విభిన్న వర్గాలకు చెందిన వారితో మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తాము.
కింద తెలిపిన అవసరాల మేరకు, తెలుసుకోవాల్సిన అవసరాన్ని బట్టి, కింద పేర్కొన్నవి మాత్రమే కాక వర్తించే వ్యక్తిగత సమాచారం షేర్ చేయబడుతుంది:
- మీకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులు/సేవల ప్రొవిజన్‌ను అమలు పరచడానికి, అలాగే అభ్యర్థించిన విధంగా మీకు, సేవాసంస్థలు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, పరిశోధన విశ్లేషకులు, విక్రేతలు, లాజిస్టిక్ భాగస్వాములకు మధ్య సేవలను అందించడానికి
- సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (CIDR) మరియు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL)కు ఆధార్ సమాచారాన్ని సమర్పించడం ద్వారా ఆధార్ ప్రామాణికీకరణ ప్రక్రియ కోసం
- వర్తించే చట్టాలకు లోబడి ఉండటానికి, అలాగే మా సేవలు/వేదికల ద్వారా మీరు ఎంచుకున్న సేవ/ఉత్పత్తిని నియంత్రించే వివిధ నియంత్రణా సంస్థల తప్పనిసరి విధానాల మేరకు ‘మీ వినియోగదారును తెలుసుకోండి’ (KYC) అవసరాలకు లోబడి ఉండటానికి
- విక్రేత సైట్‌లో మీరు ప్రారంభించిన పేమెంట్ లావాదేవీని పూర్తి చేయడానికి, ఇక్కడ మీ సూచనల ఆధారంగా, మా వద్ద నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని విక్రేత అభ్యర్థిస్తారు
- మాతో మీ ఆర్థిక ఉత్పత్తి సబ్‌స్క్రిప్షన్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి, అలాగే ఈ అభ్యర్థనలు మీరు ఎంచుకున్న సేవ/ఉత్పత్తిని అందించే ఆర్థిక సంస్థకు వెళ్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి
- మీకు క్రెడిట్ సంబంధిత సమస్యలు, సేవలను అందించడానికి మేము భాగస్వామ్యం కుదుర్చుకున్న అధికారిక ఆర్థిక సంస్థలతో పంచుకోవడం ద్వారా మీ లెండింగ్ యాత్రకు వీలు కల్పించడానికి. మీ KYC ప్రక్రియకు, అర్హత తనిఖీలు, వసూలు సేవలకు వీలు కల్పించడం సహా మా వ్యాపార కార్యకలాపాలలో మాకు సహాయపడే థర్డ్ పార్టీలతో కూడా మేము మీ సమాచారాన్ని పంచుకోవడం, మా లెండింగ్ భాగస్వాములకు అవసరమైన రీతిలో ఇలాంటి సమాచారాన్ని నిల్వ చేయడం కూడా చేయవచ్చు.
- ఒకవేళ ఆర్థిక సంస్థలకు అవసరమైతే వర్తించే చట్టాలు/నిబంధనలకు అనుగుణంగా ధృవీకరించి, సమస్యను పరిష్కరించడానికి, మోసాన్ని అరికట్టడానికి, లేదా నిధులను రికవర్ చేయడానికి
- కమ్యూనికేషన్, మార్కెటింగ్, డేటా మరియు సమాచారం స్టోరేజీ, ట్రాన్స్‌మిషన్, సెక్యూరిటీ, అనలిటిక్స్, మోసాల గుర్తింపు, రిస్క్ అంచనా, పరిశోధనలకు సంబంధించిన సేవల కోసం
- మా నియమాలు లేదా గోప్యతా విధానాన్ని అమలు చేయడానికి; థర్డ్ పార్టీ హక్కులను ఉల్లంఘించే ప్రకటన, పోస్టింగ్ లేదా ఇతర కంటెంట్ క్లెయిమ్‌లకు స్పందించడానికి; లేదా మా వినియోగదారులు లేదా సామాన్య ప్రజల హక్కులను, ఆస్తిని లేదా వ్యక్తిగత రక్షణను కాపాడటానికి
- చట్టపరంగా గానీ లేదా సదుద్దేశపూర్వకంగా అవసరమైతే, సబ్‌పీనల్, కోర్డు ఆదేశాలు, లేదా ఇతర చట్టపరమైన ప్రక్రియల కోసం సమాచారాన్ని బహిర్గతం చేయడం మంచిదేనని మేము నమ్ముతాం
- ప్రభుత్వ చర్యలు మరియు ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులు కోరినట్టుగా
- సమస్యల నివేదన మరియు వివాదాల పరిష్కారం కోసం
- PhonePeలో ఉన్న అంతర్గత విచారణ శాఖ లేదా భారతదేశ పరిధిలో లేదా పరిధికి వెలుపల PhonePe ద్వారా నియమించబడిన ఏజెన్సీల అవసరాల మేరకు
- మేము (లేదా మా సంస్థలు), ఏదైనా సంస్థను కలుపుకుంటే లేదా మేమే ఏదైనా వ్యాపార సంస్థతో కలిస్తే, లేదా పున:స్థాపన, కలగోలుపు, పునర్నిర్మాణం లాంటి జరిగితే అప్పుడు ఆ వ్యాపార సంస్థతో కూడా షేర్ చేస్తాం.
ఈ పాలసీలో పేర్కొన్న ప్రయోజనాలకోసం సమాచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం ప్రాసెసింగ్ ను ఆయా సంస్థల విధానాలు పర్యవేక్షిస్తాయి. వర్తించే చోట, సాధ్యమైనంత వరకు ఈ థర్డ్ పార్టీల మీద PhonePe కఠినమైన, గట్టి గోప్యతా సంరక్షణ బాధ్యతలను విధిస్తుంది. అయినప్పటికీ, ఈ విధానంలో పేర్కొన్న ప్రయోజనాలకు తగ్గట్టు లేదా వర్తించే చట్టాలకు అనుగుణంగా చట్టబద్ధంగా గుర్తింపు పొందిన అధికారులు, నియంత్రణా సంస్థలు, ప్రభుత్వ అధికార సంస్థలు, ఆర్ధిక సంస్థలు లాంటి థర్డ్ పార్టీలతో వ్యక్తిగత సమాచారాన్ని PhonePe పంచుకోవచ్చు. ఈ థర్డ్ పార్టీలు లేదా వాటి విధానాల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకోవడానికి మేము ఎలాంటి బాధ్యతను కానీ భారాన్ని కానీ అంగీకరించము PhonePe తరఫున మాత్రమే ప్రాసెసింగ్ జరిగిందని, వీలైనంత మేరకు ఈ పాలసీని అమలు చేసినట్లు PhonePe నిర్ధారిస్తుంది.
స్టోరేజీ మరియు నిల్వ కొనసాగింపు
అవసరానికి అనుగుణంగా, భారతదేశం లోపల వర్తించే చట్టాలకు లోబడి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని, దాని అవసరం తీరే వరకు మాత్రమే మేము నిల్వ ఉంచుతాము.అంతేకాకుండా, భవిష్యత్తులో మోసాలను అరికట్టడానికి లేదా సమస్యలను నివారించడానికి లేదా ఏదైనా చట్ట/నియంత్రణపరమైన ప్రోసీడింగ్స్ లేదా ఏదైనా చట్టపరమైన మరియు/లేదా నియంత్రణ ఆదేశాల మేరకు, లేదా ఇతర ముఖ్య అవసరాల కోసం అవసరమైతే మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేయడం మేము కొనసాగిస్తాము.
వ్యక్తిగత సమాచారం నిల్వ వ్యవధిని చేరుకున్న తర్వాత, వర్తించే చట్టాలకు అనుగుణంగా అది తొలగించబడుతుంది.
తగిన సెక్యూరిటీ విధానాలు
PhonePe అనేది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన పరిపాలనాత్మక, సాంకేతిక, భౌతిక సెక్యూరిటీ ప్రమాణాలను PhonePe అమలు చేస్తోంది. ప్రత్యేకించి, మీ ఆధార్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు, మేము ఆధార్ నియంత్రణలకు తగినట్టు వర్తించే భద్రతా ప్రమాణాలను అమలు చేశారు. అయితే మా సెక్యూరిటీ ప్రమాణాలు ఎంత బలంగా ఉన్నా, చేధించలేని సెక్యూరిటీ వ్యవస్థ ఉండదనే విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. కాబట్టి, అందుకు తగిన సెక్యూరిటీ విధానాల్లో భాగంగా, చలనంలో ఉన్న డేటా మీద అవసరమైన సమాచార సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్‌ను, అలాగే మా నెట్‌వర్క్ సర్వర్‌లలో ఉన్న డేటా మీద నియంత్రణను, నిర్ధారించడానికి మేము కఠినమైన అంతర్గత, బహిర్గత సమీక్షలు నిర్వహిస్తాం. ఫైర్‌వాల్ ద్వారా రక్షణ ఉన్న సర్వర్‌లలో డేటాబేస్ స్టోర్ చేయబడి ఉంటుంది; ఈ సర్వర్‌లను యాక్సెస్ చేయాలంటే పాస్‌వర్డ్ అవసరం, అలాగే కొంతమందికే యాక్సెస్ పరిమితం చేయబడి ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే, మీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను రక్షించుకోవడం, గోప్యంగా ఉంచుకోవడం పూర్తిగా మీ బాధ్యత. దయచేసి మీ PhonePe లాగిన్, పాస్‌వర్డ్, OTP వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికైనా చెప్పినా లేదా ఎవరికైనా తెలిసినట్లు మీకు అనుమానం కలిగినా మాకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీదే.
PhonePe అప్లికేషన్‌ను సురక్షితంగా ఉంచడానికి లాగిన్/లాగ్‌అవుట్ ఆప్షన్, మీరు ఎనేబుల్ చేసుకోగల లాక్ ఫీచర్ (“స్క్రీన్ లాక్ ఎనేబుల్ చేయి”) లాంటి సెక్యూరిటీలను బహుళ స్థాయిలలో మేము అందిస్తున్నాం. PhonePe అప్లికేషన్‌ను మీ సాధనంలోనే ఉపయోగించేలా, వేరొక సాధనంలో మీ లాగిన్ వివరాలు నమోదు చేస్తే, అదనపు ధృవీకరణ/OTP లేకుండా యాక్సెస్ చేయలేని విధంగా మేము నివారణ నియంత్రణలను అమలు చేశాం.
థర్డ్-పార్టీ ఉత్పత్తులు, సేవలు, లేదా వెబ్‌సైట్‌లు
PhonePe వేదికలోని సేవాసంస్థలకు చెందిన ఉత్పత్తులు, సేవలను మీరు పొందుతున్నప్పుడు, సంబంధిత సేవాసంస్థల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం సేకరించబడుతుంది. ఆ వ్యక్తిగత సమాచారం వారి గోప్యతా విధానానికి లోబడి ఉంటుంది. ఆయా సేవాసంస్థలు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తెలుసుకోవడానికి మీరు వారి గోప్యతా విధానాన్ని, సేవా నియమాలను చూడవచ్చు.
మీరు మా వేదికను సందర్శించినప్పుడు మా సేవలలో భాగంగా ఇతర వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లకు లింక్‌లు ఉండవచ్చు. అటువంటి వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లు వారి వారి గోప్యతా విధానాలకు లోబడి ఉంటాయి. వారి గోప్యతా విధానాలు మా నియంత్రణలో ఉండవు. మీరు మా సర్వర్‌ల నుండి వెళ్లిపోగానే (మీ బ్రౌజర్‌లో లేదా ఎమ్-సైట్‌లో ఉన్న లొకేషన్ బార్‌లో URLను చెక్ చేయడం ద్వారా మీరు ఏ సైట్‌కు రీడైరెక్ట్ చేయబడ్డారో తెలుసుకోవచ్చు), ఈ వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లలో మీరు అందించే ఏదైనా వ్యక్తిగత సమాచారం, మీరు సందర్శించే ఆయా అప్లికేషన్/వెబ్‌సైట్ ఆపరేటర్‌ల గోప్యతా విధానానికి లోబడి ఉంటుంది. వారి విధానానికి, మా విధానానికి తేడా ఉండవచ్చు, కాబట్టి ముందుగా మీరు ఆ విధానాలను సమీక్షించాలని లేదా ఆయా అప్లికేషన్‌లు లేదా వెబ్‌సైట్‌లకు కొనసాగడానికి ముందు డొమైన్ యజమాని నుండి విధానాలకు యాక్సెస్ పొందాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఈ థర్డ్ పార్టీలలో లేదా వారి విధానాల ద్వారా మీ వ్యక్తిగత సమాచార వినియోగానికి మేము జవాబుదారీ కాదు, అందుకు ఎటువంటి బాధ్యతా వహించము.
మీ సమ్మతి
మీ సమ్మతితోనే మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ప్రాసెస్ చేస్తాం. PhonePe వేదిక లేదా సేవలను మరియు/లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా, ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా PhonePe ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మీరు సమ్మతిని తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇతర వ్యక్తులకు చెందిన ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని మీరు మాకు తెలియజేస్తే, అలా చేయడానికి మీకు పూర్తి అధికారం ఉందని, ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా వారి సమాచారాన్ని కూడా ఉపయోగించడానికి మమ్మల్ని అనుమతిస్తున్నట్టు పరిగణిస్తాము. అంతేకాకుండా, ఎలాంటి అధికారిక DND రిజిస్ట్రీలతో సంబంధం లేకుండా ఈ పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల కోసం ఫోన్ కాల్స్, ఇమెయిల్ లాంటి మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేసేందుకు మీరు అంగీకరించి, PhonePeకు అధికారమిస్తున్నారు.
ఎంపిక/నిష్క్రమణ
ఖాతా సెటప్ చేసుకున్న ప్రతి వినియోగదారునికి మా సేవల నుండి లేదా ప్రాముఖ్యం లేని (ప్రమోషనల్, మార్కెటింగ్ సంబంధిత) కమ్యూనికేషన్‌ల నుండి నిష్క్రమించే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. మా అన్ని జాబితాలు, న్యూస్‌లెటర్ల నుండి మిమ్మల్ని సంప్రదించే సమాచారాన్ని తొలగించాలనుకున్నా లేదా మా సేవలను కొనసాగించడం నిలిపివేయాలనుకున్నా, దయచేసి ఈమెయిళ్లలో ఉండే ‘అన్‌సబ్‌స్క్రయిబ్’ బటన్‌ను క్లిక్ చేయండి.
ఏదైనా నిర్ధిష్ఠ PhonePe ఉత్పత్తి/సేవ కోసం మీరు కాల్ అందుకుంటే, కాల్ సందర్భంగా PhonePe ప్రతినిధికి తెలపడం ద్వారా అలాంటి కాల్స్ రాకుండా మీరు నివారించుకోవచ్చు.
వ్యక్తిగత సమాచార యాక్సెస్/ దిద్దుబాటు లేదా అంగీకారం
మమ్మల్ని అభ్యర్థించడం ద్వారా మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసి, సమీక్షించవచ్చు, దాంతోపాటు, మీరు ఏ సమయంలో అయినా ఆధార్ ఆధారిత e-KYC ప్రక్రియలో భాగంగా మేము సేకరించిన మీ e-KYC సమాచారాన్ని నిల్వ చేసేందుకు మాకు అందించిన అంగీకారాన్ని ఉపసంహరించుకోవచ్చు. అలా ఉపసంహరించుకున్నప్పుడు, మీరు మీకు ఇచ్చిన అంగీకారం ప్రాతిపదికన అందుకున్న సేవలకు యాక్సెస్ ను మీరు కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఈ విధానం యొక్క నిల్వ మరియు నిలబెట్టుకోవడం విభాగం ప్రకారం మీ సమాచారాన్ని అలాగే నిలుపుకుని ఉండవచ్చు. పై అభ్యర్థనలలో దేనినైనా లేవనెత్తేందుకు, మీరు ఈ విధానం కింద ఉన్న ‘మమ్మల్ని సంప్రదించండి’ కింద అందించిన సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి, మాకు రాయవచ్చు.
మీ ఖాతాను లేదా వ్యక్తిగత సమాచారాన్ని మీరు తొలగించాలనుకుంటే, దయచేసి PhonePe వేదికలోని ‘సహాయం’ విభాగాన్ని ఉపయోగించండి. అయినప్పటికీ, మీ వ్యక్తిగత సమాచారాన్ని నిలబెట్టుకోవడం వర్తించే చట్టాలకు లోబడి ఉంటుంది.
పై అభ్యర్థనల కోసం, మీ గుర్తింపును నిర్ధారించి, ప్రామాణికంగా ఉండేలా చూసేందుకు మీ నుండి నిర్ధిష్ఠ సమాచారాన్ని PhonePe కోరుకోవచ్చు. ఇది వ్యక్తిగత సమాచారాన్ని స్వీకరించే హక్కు లేని మరో వ్యక్తికి వెల్లడించకుండా చేసే లేదా తప్పుగా సవరించే లేదా తొలగించేందుకు వీలులేని ఒక భద్రతాపరమైన చర్య,
ఒకవేళ, మీరు పొందుతున్న ఏదైనాఉత్పత్తి/ సేవల గురించి ప్రత్యేకించిన ఏదైనా ఇతర సమాచారం కావాల్సి వస్తే PhonePe వేదిక ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకోగల ఉత్పత్తి/సేవకు సంబంధిత ప్రోడక్ట్/సేవకు సంబంధించిన నియమ, నిబంధనలను చదవాలని మేము అభ్యర్థిస్తున్నాం. ఈ నియమ, నిబంధనలను మీరు PhonePe వేదిక ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ విషయంలో మరింత సమాచారం కావాలంటే, ఈ విధానంలో ‘మమ్మల్ని సంప్రదించండి’ విభాగంలో ప్రస్తావించిన వివరాల ద్వారా మాకు మీరు మెయిల్ చేయవచ్చు.
చిన్నారుల సమాచారం
18 ఏళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారుల నుండి మేము ఏ వ్యక్తిగత సమాచారాన్నీ ఉద్దేశపూర్వకంగా అభ్యర్థించము, సేకరించము. అలాగే భారతీయ ఒప్పంద చట్టం, 1872 ద్వారా న్యాయపరంగా ఒప్పందం చేసుకోగల వారికి మాత్రమే మా వేదిక అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు 18 ఏళ్లలోపు వయస్సు గల వారైతే, తప్పనిసరిగా మీ తల్లి/తండ్రి, చట్టబద్ధ సంరక్షకుడు, లేదా ఎవరైనా బాధ్యత గల పెద్దవారి పర్యవేక్షణలోనే మా వేదికను ఉపయోగించాల్సి ఉంటుంది.
విధానానికి చేసే మార్పులు
మా వ్యాపారంలో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి కాబట్టి, మా విధానాల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అందుకే మీకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ గోప్యతా విధానంలో భాగాలను ఎప్పుడైనా మార్చగలిగే, జోడించే, లేదా తొలగించే సర్వహక్కులు మాకు ఉన్నాయి. అయినప్పటికీ, గోప్యతా విధానంలో చేసిన మార్పుల గురించి మీకు నోటిఫై చేస్తాం, అయితే గోప్యతా విధానంలో వచ్చిన అప్‌డేట్‌లు/మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. మార్పులు చేసిన తర్వాత కూడా మీరు మా సేవలు/వేదికను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ఆయా మార్పులను అంగీకరిస్తున్నారని అర్థం. మీరు ఇదివరకే మాతో షేర్ చేసిన వ్యక్తిగత సమాచారం రక్షణకు భంగం కలిగేలా మేము ఎన్నటికీ మా విధానాలకు మార్పులు చేయబోము.
మమ్మల్ని సంప్రదించండి
మీ వ్యక్తిగత సమాచారం ప్రాసెసింగ్ గురించి గానీ లేదా ఈ గోప్యతా విధానం గురించి గానీ మీకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే, ఈ https://support.phonepe.com లింక్ ద్వారా మీరు మీరు PhonePe’s ప్రైవసీ ఆఫీసర్ కు తెలియజేయవచ్చు. వీలైనంత తక్కువ సమయంలో మేము మీ ప్రశ్నలకు సమాధానం అందిస్తాము. పరిష్కరించడంలో ఏదైనా ఆలస్యం ఉన్నట్లయితే మేము మీకు తెలియజేస్తాము