ఈ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 ప్రకారం రూపొందిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డు. దీనికి కాలానుగుణంగా సవరణలు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000ను అనుసరించి సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన సవరణలు, నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డు కంప్యూటర్ ద్వారా తయారు చేసిన డాక్యుమెంట్ కాబట్టి దీనిపై ఎలాంటి భౌతిక లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
ఈ నియమ, నిబంధనలు (నియమాలు) PhonePe మొబైల్ యాప్‌లో (“PhonePe యాప్”) “PhonePe స్విచ్” (స్విచ్) వినియోగాన్ని నిర్వహిస్తాయి. PhonePe మొబైల్ అప్లికేషన్ (PhonePe యాప్) PhonePe ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అందించబడుతోంది, ఇది కంపెనీల చట్టం, 1956 కింద రిజిస్టర్ అయిన కంపెనీ. ఇది ఆఫీస్-2, 4,5,6,7 వ అంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియా చిరునామాలో వుంది.
ఈ నియమాల ఉద్దేశాలను నెరవేర్చడానికే PhonePeలో PhonePe అధికారులు, డైరెక్టర్లు, ప్రతినిధులు, ఉద్యోగులు ఉన్నారని మీరు స్పష్టంగా అంగీకరిస్తున్నారు. స్విచ్‌లో ప్రదర్శించబడే హోస్ట్ చేసిన యాప్(ల) యొక్క లోగో(లు)/ట్రేడ్‌మార్క్(లు) సంబంధిత హోస్ట్ చేసిన యాప్(ల) లక్షణాలే. మీ స్విచ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు విద్య, వినోదం, ఆహారం, కిరాణా, షాపింగ్, ట్రావెలింగ్ వంటి కేటగిరీలలో వివిధ సేవా సంస్థల (“హోస్ట్ చేసిన యాప్(లు)”) మొబైల్-సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, బ్యానర్లు, ప్రమోషన్లు, ఆఫర్లు మొదలైన వాటిని అంగీకరిస్తున్నారు, వీటి వినియోగంలో మీరు నియమాలకు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు.
PhonePe వెబ్‌సైట్(లు) మరియు/లేదా PhonePe యాప్‌లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేయడం ద్వారా మేము ఈ నిబంధనలను ఎప్పుడైనా సవరించవచ్చు. అప్‌డేట్ చేసిన ఈ నియమాల వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే అవి అమలులోకి వస్తాయి. అప్‌డేట్లు / మార్పులు ఏవైనా ఉంటే వాటిని తెలుసుకోవడానికి, ఈ నిబంధనలను అప్పుడప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత మీరు PhonePe యాప్‌ను ఉపయోగించడం కొనసాగిస్తున్నారు అంటే సవరణ(లు)/మార్పు(లు)ను మీరు అంగీకరించి, ఆమోదిస్తున్నారని అర్థం.
- వివిధ హోస్ట్ చేసిన యాప్‌లు స్విచ్ జాబితాలో ఉన్నాయని, హోస్ట్ చేసిన యాప్‌నకు సంబంధించిన లోగో/ట్రేడ్‌మార్క్/బ్యానర్/ప్రమోషన్/పై క్లిక్ చేసిన తర్వాత, మీరు సంబంధిత హోస్ట్ చేసిన యాప్‌ల యొక్క మొబైల్-సైట్/అప్లికేషన్‌కు మళ్లించబడతారని మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి హోస్ట్ చేసిన యాప్ ద్వారా అవి అందుబాటులోకి రావచ్చు. స్విచ్ యాప్ ద్వారా దారి మళ్లించబడినప్పుడు ఇతర సాంకేతిక లోపం/సమస్య వల్ల సరిగ్గా పనిచేయకపోవడం చోటు చేసుకోవచ్చు (ల్యాండింగ్ మొబైల్-సైట్/అప్లికేషన్ పోస్ట్ దారి మళ్లింపు అనేది హోస్ట్ చేసిన యాప్ ద్వారా సూచించబడేది కాదని నిరూపిస్తుంది). ఈ సందర్భంలో మీరు PhonePe యాప్‌ను వెంటనే లాగ్-అవుట్ చేసి మూసివేయాలని నొక్కి చెబుతున్నాము. మీరు హోస్ట్ చేసిన యాప్‌లను ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి మీ సమ్మతిని అభ్యర్థిస్తూ ప్రాంప్ట్ కూడా కనబడవచ్చు. మీ సౌలభ్యం కోసం ఒక్క క్లిక్‌తో లాగిన్ అవ్వగల సౌకర్యాన్ని ఎనేబుల్ చేస్తారు. మీ సమ్మతి తర్వాత, PhonePe మీ వివరాలను, హోస్ట్ చేసిన యాప్‌తో పంచుకోవచ్చు. దీనికి మీరు సమ్మతించిన తర్వాత, సంబంధిత హోస్ట్ చేసిన యాప్‌నకు మీరు కస్టమర్/వినియోగదారుగా రిజిస్టర్ చేయబడతారు, తదనుగుణంగా సంబంధిత హోస్ట్ చేసిన యాప్ ద్వారా నిర్వహించబడుతున్న వినియోగ నియమాలు, గోప్యతా విధానాలు మీకు వర్తించబడతాయి. మీ సమ్మతిని పోస్ట్ చేశాక హోస్ట్ చేసిన యాప్‌లతో పంచుకోబడే అటువంటి ఏదైనా డేటాకు (మరియు దాని వినియోగానికి) సంబంధించి PhonePe ఎలాంటి పూచీ వహించదు.
- హోస్ట్ చేసిన యాప్‌లను ఉపయోగించడానికి మీరు ఎంచుకున్నప్పుడు, హోస్ట్ చేసిన యాప్‌ల వినియోగాన్ని మీరు అంగీకరిస్తున్నారు. అలాగే హోస్ట్ చేసిన యాప్‌లో ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలు సంబంధిత హోస్ట్ చేసిన యాప్‌ల నియమాలు వర్తించబడతాయి. అంతే కాక హోస్ట్ చేసిన యాప్‌ల డేటా వినియోగానికి గోప్యతా విధానాలు వర్తిస్తాయి. అందుకే మీకు వర్తించే హోస్ట్ చేసిన యాప్‌ల వినియోగ నియమాలు, గోప్యతా విధానం మరియు/లేదా ఏదైనా ఇతర అంతర్గత విధానాలను జాగ్రత్తగా చదవాలని మీకు నొక్కి చెబుతున్నాము. మీరు ఉపయోగించే సమయంలో సంబంధిత హోస్ట్ చేసిన యాప్ ద్వారా సేకరించబడే ఏదైనా డేటాకు (మరియు దాని ఉపయోగానికి) సంబంధించిన అన్ని బాధ్యతలను PhonePe నిరాకరిస్తుంది.
- మీ సౌలభ్యం కోసం మాత్రమే PhonePe మీకు స్విచ్‌కు యాక్సెస్‌ను అందిస్తోందని మీరు అంగీకరిస్తున్నారు. అయితే దానిని నెరవర్చే విషయంలో హోస్ట్ చేయబడ్డ యాప్‌ల నుంచి ఉత్పత్తు(ల)ను మరియు/లేదా సేవ(ల)ను పొందడంలో PhonePeకు ఎలాంటి పాత్ర ఉండదని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe కేవలం హోస్ట్ చేసిన యాప్‌ల నుంచి కొనుగోలు చేసిన/పొందిన ఉత్పత్తు(ల)కు/సేవ(ల)కు పేమెంట్(ల)ను సులభతరం చేస్తుంది. దీని ప్రకారం, మీ స్విచ్ వినియోగానికి సంబంధించి PhonePe బాధ్యత మీ పేమెంట్లను ప్రాసెస్ చేయడానికి, సంబంధిత హోస్ట్ చేసిన అప్లికేషన్‌లకు సెటిల్ చేయడానికి మాత్రమే పరిమితం చేయబడింది. హోస్ట్ చేసిన యాప్ ద్వారా అందించబడే ఉత్పత్తులు మరియు/లేదా సేవలకు సంబంధించి తలెత్తే ఏదైనా సమస్యకు సంబంధించి PhonePe ఎటువంటి బాధ్యత లేదా జవాబుదారీ కలిగి ఉండదు.
- హోస్ట్ చేసిన యాప్‌లపై ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలు/పొందడానికి సంబంధించి, సంబంధిత హోస్ట్ చేసిన యాప్ మీ ఏకైక సంప్రదింపు కేంద్రంగా ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు. ఇంకా సంబంధిత ఇన్ వాయిస్(లు), వారెంటీ కార్డు, వినియోగ సూచనలు, అమ్మకం తర్వాత సహకారం మొదలైన వాటిని అందించడానికి హోస్ట్ చేసిన యాప్ బాధ్యత వహిస్తుందని మీరు అంగీకరిస్తున్నారు. ఇలాంటి ఏ సందర్భానికైనా PhonePe బాధ్యత వహించదు. హోస్ట్ చేసిన యాప్‌ల యొక్క ఉత్పత్తు(లు)/సేవ(లు)కు సంబంధించి ఏదైనా వివాదం/ఫిర్యాదు/గ్రీవెన్స్/సమస్య (డెలివరీ/నాన్ ఫుల్‌ఫిల్‌మెంట్/లోపభూయిష్టమైన వస్తువులు/సేవల లోపం/అమ్మకాల తర్వాత మద్దతు మొదలైన వాటితో సహా) మీకు మరియు సంబంధిత హోస్ట్ చేసిన యాప్‌నకు మధ్య వ్యవహారాలు జరగాలి. ఈ వ్యవహారాల మధ్యలోకి PhonePeను పార్టీగా చేర్చకూడదు. అటువంటి సందర్భాల్లో మీరు PhonePeను (దాని అనుబంధ సంస్థలు మరియు అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, ఉద్యోగులతో సహా) అన్ని రకాల క్లెయిమ్‌లు, డిమాండ్‌లు మరియు నష్టాల (వాస్తవ మరియు పర్యవసాన) నుండి, వివాదాలు/ఫిర్యాదులు/సమస్యలతో సంబంధం ఉన్న లేదా ఏవిధంగానైనా తెలిసిన, తెలియని అన్ని రకాల, అన్ని స్వభావాలు కలిగిన విషయాల నుండి విడుదల చేయడానికి అంగీకరిస్తున్నారు.
- హోస్ట్ చేసిన యాప్‌లతో సహా స్విచ్‌ను ఏదైనా అక్రమమైన లేదా చట్టవ్యతిరేక ప్రయోజనాల కోసం (18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే తప్ప వయస్సు-ఆధారిత నియంత్రిత కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవడంతో సహా) ఉపయోగించనని మీరు అంగీకరిస్తున్నారు. ఏదైనా మోసపూరిత లావాదేవీని నిర్వహించడం లేదా ఆ విధంగా వ్యవహరించడంపై వర్తించే చట్టం మరియు/లేదా విధానాలు, నియమాలు, వినియోగ నియమాల ఉల్లంఘనగా పరిగణింపబడుతుంది. హోస్ట్ చేసిన యాప్‌ల నుండి ఉత్పత్తు(లు) కొనుగోలు చేసేటప్పుడు లేదా సేవ(లు) పొందేటప్పుడు, అటువంటి ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలు చేయబడుతున్న/డెలివరీ చేయబడుతున్న/పొందబడుతున్న అధికార పరిధిలో వర్తించే చట్టాలను ఉల్లంఘించలేదని మీరు ధృవీకరించుకోవాలి. PhonePeకి వర్తించే నిషేధించబడిన చట్టాలకు వ్యతిరేకంగా ఏ లావాదేవీలు చేయకూడదు, అటువంటి విషయాలలో PhonePeకి వ్యతిరేకంగా ఏవైనా క్లెయిమ్‌లు వచ్చినప్పుడు PhonePeను బాధ్యత నుండి విముక్తిని ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు.
- మీ స్విచ్ వినియోగం అనేది, అన్ని సమయాల్లో స్విచ్‌ను యాక్సెస్ చేయగల హక్కుగా భావించకూడదు. PhonePe దాని స్వంత విచక్షణ మేరకు, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా, స్విచ్‌కు మీ యాక్సెస్‌ను ఏ సమయంలోనైనా నోటీసు లేకుండా నిలిపివేయవచ్చు. ఇంకా, అనుమానాస్పద/మోసపూరిత లావాదేవీల విషయంలో, మీ లావాదేవీలను PhonePe మరియు/లేదా హోస్ట్ చేసిన యాప్‌ల ద్వారా మదింపు చేయవచ్చు, దర్యాప్తు చేయవచ్చు. సమాచారం అందిన తరువాత మీరు సదరు లావాదేవీ(ల)కు సంబంధించిన అభ్యర్థన పత్రాలను సమర్పించడంతో పాటు రాతపూర్వక వివరణను అందించాల్సి ఉంటుంది.
- హోస్ట్ చేసిన యాప్‌లు థర్డ్ పార్టీ(ల) ద్వారా ఆఫర్ చేయబడతాయి/పొడిగించబడతాయి అని మీరు అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా, హోస్ట్ చేసిన యాప్‌లను (ఎ) ఉపయోగించడానికి ముందు లేదా (బి) హోస్ట్ చేసిన యాప్‌ల నుంచి/ద్వారా ఏదైనా ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలు/పొందడానికి ముందు మీరు తగిన జాగ్రత్త మరియు సహేతుకమైన శ్రద్ధ పాటించడానికి అంగీకరిస్తున్నారు.
- రీఫండ్స్ మరియు రిటర్న్‌కు సంబంధించిన పాలసీలు హోస్ట్ చేసిన యాప్‌ల ద్వారా అందించబడతాయని మీరు అంగీకరిస్తున్నారు. ఏదైనా ఉత్పత్తు(లు)/సేవ(లు) కొనుగోలు చేయడానికి/పొందడానికి ముందు మీరు దానిని చదవాలని నొక్కి చెబుతున్నాము. రీఫండ్‌కు సంబంధించిన ఫిర్యాదులు/క్లెయిమ్‌లకు PhonePe బాధ్యత వహించదు. దీని కోసం మీరు సంబంధిత హోస్ట్ చేసిన యాప్‌ను మాత్రమే సంప్రదించాలి.
- హోస్ట్ చేసిన అప్లికేషన్‌లకు సంబంధించి స్విచ్‌లో ఏదైనా ప్రమోషన్/ఆఫర్‌ను అందుబాటులో ఉంటే, వాటికి వర్తించే నియమ, నిబంధనల ద్వారా అవి నిర్వహించబడతాయి. అటువంటి ప్రమోషన్/ఆఫర్ పొందడానికి ముందు వర్తించే నియమ, నిబంధనలను చదవడానికి మీరు అంగీకరిస్తున్నారు.
- వర్తించే చట్టం ప్రకారం, ఎంత మేరకు అనుమతించే అవకాశం ఉందో అంత వరకు PhonePe, అన్ని వారెంటీలను లేదా గ్యారంటీలను నిరాకరిస్తుంది. అవి చట్టబద్ధం కావచ్చు, స్పష్టంగా పేర్కొని ఉండవచ్చు లేదా సూచనప్రాయంగానూ ఉండవచ్చు. ఈ నిరాకరణలోకి వారంటీల వాణిజ్య సన్నద్ధత, నిర్దిష్ట ప్రయోజనం కోసం ఫిట్‌నెస్ ఉండటం, యాజమాన్య హక్కులను ఉల్లంఘించకుండా ఉండటం కూడా వస్తాయి. హోస్ట్ చేసిన అప్లికేషన్‌లతో సహా స్విచ్ ద్వారా అందించబడ్డ మొత్తం సమాచారం యొక్క కచ్చితత్వం, పూర్తి సమాచారం మరియు వినియోగాన్ని మదింపు చేయడం మీ బాధ్యత. PhonePe యాప్ మరియు మరీ ముఖ్యంగా, స్విచ్ ద్వారా మీ వినియోగం, యాక్సెస్ లేదా ఇతరత్రా సమాచారాన్ని పొందడం అనేది మీ సొంత విచక్షణ మరియు రిస్క్‌పై ఆధారపడి ఉంటుందని, అటువంటి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా ఉపయోగించడం వల్ల మీ ఆస్తికి (మీ కంప్యూటర్ సిస్టమ్ మరియు మొబైల్ పరికరం లేదా ఏదైనా ఇతర పరికరాలతో సహా) ఏదైనా నష్టం లేదా డేటా నష్టానికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe దాని తరఫున ఎటువంటి వారంటీ ఇవ్వడానికి ఎవరికీ అధికారం ఇవ్వదు, అటువంటి ప్రకటనలపై మీరు ఆధారపడకూడదు.
- స్విచ్ అంతరాయం లేకుండా, దోషరహితంగా లేదా వైరస్‌లు లేదా ఇతర హానికరమైన కాంపోనెంట్‌లు లేకుండా ఉంటుందని PhonePe హామీ ఇవ్వదు. స్విచ్‌పై లభ్యమయ్యే మొత్తం డేటా “యథాతథంగా”, “అందుబాటులో ఉన్న విధంగా” మరియు “అన్ని లోపాలతో” అనే ప్రాతిపదికల మీద ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైన వారెంటీలు లేదా ప్రాతినిధ్యాలు లేకుండా అందించబడుతుంది.
- హోస్ట్ చేసిన యాప్‌ల నుంచి/ద్వారా ఈ నియమాలు ఉల్లంఘించడం మరియు/లేదా ఉత్పత్తు(లు)/సేవ(ల)తో పరస్పర మార్పిడి లేదా కొనుగోలు చేయడం/పొందడం ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తలెత్తే ఏవైనా మరియు అన్ని నష్టాలు, చర్యలు, క్లెయిమ్‌లు మరియు బాధ్యతల (చట్టపరమైన ఖర్చులతో సహా) విషయంలో PhonePeకు, దాని అనుబంధ సంస్థలు, ఉద్యోగులు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు మరియు ప్రతినిధులకు ఎటువంటి బాధ్యతా లేదని మీరు విముక్తిని ఇస్తున్నారు.
- లాభాలు లేదా ఆదాయాల నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవడం, కాంట్రాక్ట్, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా ఇతరత్రా, అందించిన సమాచారాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వంటి వాటికి పరిమితి లేని నష్టాలతో సహా ఏదైనా పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు, అంతేకాక కాంట్రాక్ట్, హక్కుల అతిక్రమణ, నిర్లక్ష్యం, వారంటీ లేదా మరేదైనా కారణం కావచ్చు ఇలా వేటికైనా PhonePe ఏ సందర్భంలోనూ బాధ్యత వహించదు.
- ఈ నియమాలు, దాని చట్టాల వైరుధ్యాల సూత్రాలకు సంబంధం లేకుండా భారత చట్టాలచే నియంత్రించబడతాయి. ఈ నియమాలకు సంబంధించి మీకు, PhonePeకి మధ్య మొత్తంగా లేదా పాక్షికంగా ఉత్పన్నమయ్యే ఏదైనా దావా లేదా వివాదం బెంగుళూరులో ఉన్న అర్హత కలిగిన అధికార పరిధిలోని న్యాయస్థానం ద్వారా ప్రత్యేకంగా నిర్ణయించబడుతుంది.
- PhonePe వినియోగ నియమాలు మరియు PhonePe గోప్యతా విధానం సూచన ద్వారా ఈ నియమాలలో చేర్చబడినట్లు పరిగణించబడతాయి.