ఈ ఒప్పందం (ఈ కింద నిర్వచనం ఇచ్చాము) PhonePe ప్రైవేట్ లిమిటెడ్ (ఇకపై “కంపెనీ“/ “PhonePe” అని పిలుస్తారు) నిర్వహించే, ఆపరేట్ చేసే PhonePe మొబైల్ అప్లికేషన్ మరియు/లేదా ఏదైనా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్/వెబ్‌సైట్ (“వెబ్‌సైట్“గా పిలుస్తారు)ను యాక్సెస్ చేయడానికి, అలానే వినియోగించడానికి వర్తించే నియమ, నిబంధనలను నిర్దేశిస్తుంది. ఈ కంపెనీ భారతదేశ చట్టాల కింద ఏర్పాటు అయింది, అలానే కంపెనీల చట్టం, 1956 కింద రిజిస్టర్ అయింది.
ఈ క్రెడిట్ కార్డ్ వినియోగ నియమ, నిబంధనలు (“ఒప్పందం” అని పిలుస్తారు)ను సమాచార సాంకేతిక చట్టం, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్ రికార్డ్‌గా పరిగణిస్తారు. ఇది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా తయారైంది, దీనికి ఎటువంటి ఫిజికల్ సంతకాలు (నేరుగా చేసిన సంతకాలు) గానీ, డిజిటల్ సంతకాలు గానీ అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు) 2011లోని నియమం 3లో ఉన్న నిబంధె అనుగుణంగా ఈ ఒప్పందాన్ని ప్రచురించారు. ఇది ఈ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసేటప్పుడు లేదా వినియోగించేటప్పుడు నిర్వహించాల్సిన ప్రాథమిక వివరాల నిశిత పరిశీలన తప్పకుండా జరిగేలా చూసుకుంటుంది.
ఈ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా లేదా వెబ్‌సైట్‌లో మీ సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా, యూజర్లు (ఇకపై “మీరు” లేదా “మీ” అని పిలుస్తాము) ఈ వినియోగ నియమాలు (“వినియోగ నియమాలు“/ “ఒప్పందం“)కు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకారం తెలిపినట్లుగానే పరిగణిస్తాము. ఈ వెబ్‌సైట్ ద్వారా అందించిన ఏదైనా నిర్దిష్ట సేవకు వర్తించే నియమాలు, మార్గదర్శకాలు, విధానాలు, నియమ, నిబంధనలకు లోబడి మీతో మాకు ఉన్న సంబంధంతో పాటు గోప్యతా విధానం, నిరాకరణను కూడా ఈ ఒప్పందం వివరిస్తుంది, అలానే అవన్నీ కూడా ఈ వినియోగ నియమాలలో భాగమని, ఈ వినియోగ నియమాల పార్శిల్‌లోనే కలిపి ఉన్నాయని పరిగణిస్తాము.
అప్‌డేట్ చేసిన తాజా వినియోగ నియమాల వెర్షన్‌ను చదివి సమీక్షించడానికి ఎప్పటికప్పుడు ఈ పేజీని తెరుస్తూ ఉండండి. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, మా సొంత అభీష్టానుసారం ఏ సమయంలోనైనా వినియోగ నియమాలను మార్చే హక్కు మాకు ఉంది. అలానే ఈ వెబ్‌సైట్‌ను మీరు వాడుతున్నట్లయితే లేదా వినియోగాన్ని కొనసాగించినట్లయితే, సవరించిన లేదా అప్‌డేట్ చేసిన వినియోగ నియమాలను మీరు అంగీకరించినట్లుగానే పరిగణిస్తాము.
దయచేసి ఈ నియమ, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఉన్న నియమాలను మీరు అంగీకరించినట్లయితే ఇక్కడ నిర్వచించిన ప్రయోజనం/ఉద్దేశం నిమిత్తం కంపెనీకి, మీకు మధ్య ఒప్పందం కుదురుతుంది.
1. సేవల వివరణ, వాటిని అంగీకరించడం
- PhonePe, ఈ ప్లాట్‌ఫామ్‌లో తన భాగస్వాములైన ఆర్థిక సంస్థలు అందించే క్రెడిట్ కార్డ్ సదుపాయం (వీటన్నిటినీ కలిపి “సేవ(లు)” అని పిలుస్తారు)తో పాటు కొన్ని ఫైనాన్షియల్ ఉత్పత్తులు/సేవలకు యాక్సెస్‌ను అందిస్తుంది, అయితే ఈ సేవలను అందించడానికి మాత్రమే పరిమితం కాదు.
- PhonePe, తన మరియు/లేదా అనుబంధ ప్లాట్‌ఫామ్ ద్వారా భాగస్వామ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డ్ వినియోగ సేవలను అందిస్తుంది.
- పైన పేర్కొన్న సేవలను వాణిజ్యపరంగా సహేతుకమైన ప్రయత్న ప్రాతిపదికన అందిస్తాము, అలానే పైన పేర్కొన్న సేవలను పొందడం కోసం మీరు మాతో భాగస్వామ్యం అవ్వాలా వద్దా అన్నది పూర్తిగా మీ ఇష్టం, అలానే సమ్మతిపైనే ఆధారపడి ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
- మీరు ఎప్పటికప్పుడు సేవలను కొనసాగించినట్లయితే, వినియోగ నియమాలు ఏవైనా అప్‌డేట్ అయినా లేదా సవరించినా, వాటిని కూడా మీరు అంగీకరిస్తున్నట్లుగానే పరిగణిస్తాము, అలానే ఇక్కడ నిర్వచించిన నియమాల ప్రకారం ఈ ఒప్పందాన్ని మీరు రద్దు చేసే వరకు మీరు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి.
- క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో భాగంగా మీరు అందించిన సమాచారం/డాక్యుమెంట్/వివరాలను దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు PhonePe తన భాగస్వామ్య బ్యాంకులతో పంచుకుంటుంది.
- భాగస్వామ్య బ్యాంకులు KYC మరియు/లేదా కస్టమర్ వివరాలను నిశితంగా పరిశీలించడానికి పూర్తిగా బాధ్యత వహిస్తాయి, అలానే అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడం కోసం వారికి అదనపు సమాచారం/డాక్యుమెంట్లు/వివరాలను మీరు ఇవ్వాల్సి రావచ్చు.
- అప్లికేషన్‌ను నిశితంగా పరిశీలించాల్సిన బాధ్యత భాగస్వామ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకే ఉంది. ఈ అప్లికేషన్‌ను ఆమోదించడం, అలానే తిరస్కరించడం వంటి నిర్ణయాలకు పూర్తిగా అవే బాధ్యత వహిస్తాయి.
- క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే ప్రక్రియలో మరియు/లేదా జారీ చేయడంలో PhonePeకు ఎటువంటి పాత్ర లేదు మరియు/లేదా క్రెడిట్ కార్డులను జారీ చేసిన తర్వాత వాటికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలను అందించదు.
- కార్డ్ జారీ లేదా నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫీజులు లేదా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటే, వాటిని జారీ చేసిన భాగస్వామ్య బ్యాంక్ నేరుగా వసూలు చేస్తుంది.
- కార్డ్ జారీ చేసిన తర్వాత, యూజర్లు తమ Rupay క్రెడిట్ కార్డ్‌లను UPIకి కూడా లింక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన నియమ, నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.
- సంయుక్త మార్కెటింగ్ ప్రయోజనాలు/వివిధ సేవలు/నివేదిక తయారు చేసే సేవలు అందించడం మరియు/లేదా మీరు ఎంచుకున్న లేదా ఎంచుకోకుండానే పొందుతున్న సేవలకు అనుబంధంగా వివిధ విలువ ఆధారిత సేవలు అందించడం కోసం పైన పేర్కొన్న సేవలు తరహాలో సేవలు అందించడం కోసం అవసరమైనంత మేరకు మీ సమాచారాన్ని తన గ్రూప్ కంపెనీలు, భాగస్వామ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర థర్డ్ పార్టీలకు ఇవ్వడానికి మీరు కంపెనీకి అనుమతిని, అధికారాన్ని ఇస్తున్నారు.
- iఈమెయిల్‌లు, టెలిఫోన్ మరియు/లేదా SMS వంటి కమ్యూనికేషన్ మార్గాలలో సేవల అప్‌డేట్లు, సమాచారం/ప్రచార ఈమెయిల్‌లు మరియు/లేదా ఉత్పత్తి ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ లేదా దాని థర్డ్-పార్టీ విక్రేతలు/వ్యాపార భాగస్వాములు/మార్కెటింగ్ అనుబంధ సంస్థలు మీకు పంపించేందుకు మీరు అంగీకరిస్తున్నారు.
- ఈ సందర్భంలో, TRAI నిబంధనల ప్రకారం మీరు మాకు ఇచ్చిన మొబైల్ నంబర్ DND/NCPR జాబితాలో రిజిస్టర్ అయినప్పటికీ, ఆ మొబైల్ నంబర్‌కు అన్ని రకాల సందేశాలను పంపించేందుకు మీరు అంగీకరించి, సమ్మతిస్తున్నారు. అలానే అదే ఉద్దేశం కోసం, ఏదైనా థర్డ్ పార్టీ సేవా సంస్థ లేదా ఏదైనా అనుబంధ సంస్థ, దాని సమూహ కంపెనీలు, అధీకృత ఏజెంట్లకు సమాచారాన్ని ఇవ్వడానికి/చెప్పడానికి మీరు కంపెనీకి మరింత అధికారం ఇస్తున్నారు.
- మా చట్టపరమైన బాధ్యతలకు లోబడి ఉండటానికి, వివాదాలను పరిష్కరించడానికి, సేవలను అందించడానికి కుదుర్చుకున్న మా ఒప్పందాలను అమలు చేయడంలో భాగంగా అవసరమైన మేరకు మీ సమాచారాన్ని కంపెనీ దాస్తుంది, అలానే ఉపయోగిస్తుంది.
- భాగస్వామ్య బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డుల జారీ/ఆఫర్ వర్తింపచేయటం కోసం PhonePe ఎటువంటి వారెంటీ లేదా హామీని ఇవ్వదు.
2. లైసెన్స్, వెబ్‌సైట్ యాక్సెస్
సేవలకు సంబంధించిన మేధో సంపత్తి హక్కులు (ఆ హక్కులు ఎంటర్ చేసినా లేదా ఎంటర్ చేయకపోయినా) సహా, సేవలకు సంబంధించిన టైటిల్, ప్రయోజనాలు, అన్ని చట్టపరమైన హక్కులు PhonePeకు ఉన్నాయని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. గోప్యమైనది అని కంపెనీ నిర్దేశించిన సమాచారం సేవలలో ఉండవచ్చని, కంపెనీ మంజూరు చేసిన ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా అటువంటి సమాచారాన్ని మీరు బయట పెట్టరాదని కూడా అంగీకరిస్తున్నారు. వెబ్‌సైట్‌లోని కంటెంట్, దాని “లుక్ అండ్ ఫీల్” (ఉదా. టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు, లోగోలు, బటన్ ఐకాన్‌లు), ఫోటోగ్రాఫ్‌లు, ఎడిటోరియల్ కంటెంట్, నోటీసులు, సాఫ్ట్‌వేర్, ఇతర మెటీరియల్‌పై హక్కులు లేదా వాటి లైసెన్స్ హక్కులు కంపెనీ మరియు/లేదా యాజమాన్యం/దాని థర్డ్ పార్టీ సేవా సంస్థలు/వారి లైసెన్సర్లకు ఉంటాయి. అలానే వాటిని వర్తించే కాపీరైట్, ట్రేడ్‌మార్క్, ఇతర చట్టాల ప్రకారం వారే రక్షిస్తారు.
వెబ్‌సైట్, దాని సేవలను యాక్సెస్ చేయడానికి, అలానే వినియోగించుకోవడానికి కంపెనీ మీకు పరిమిత లైసెన్స్‌ను జారీ చేస్తుంది. అయితే మరొక వ్యక్తి, విక్రేత లేదా వేరే ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనం కోసం లేదా ఏదైనా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా కాపీ చేయడం లేదా సేవలకు సంబంధించిన ఏదైనా హక్కును అమ్మడం, కేటాయించడం, సబ్‌లైసెన్స్ ఇవ్వడం, భద్రతా ప్రయోజనాలను ఇచ్చేయడం లేదా బదిలీ చేయడం వంటి వాటికి మీకు అధికారం ఇచ్చే నిబంధన ఆ లైసెన్సులో ఉండదు. మీరు ఏదైనా అనధికారిక వినియోగానికి పాల్పడితే మీకు మంజూరు చేసిన అనుమతి లేదా లైసెన్స్‌ను కంపెనీ రద్దు చేస్తుంది.
వెబ్‌సైట్‌ను మీరు ఉపయోగిస్తున్నట్లయితే ఈ కింద పేర్కొన్న వాటిని చేయరని అంగీకరిస్తున్నారు: (i) ఈ వెబ్‌సైట్ లేదా దాని కంటెంట్‌లను ఏదైనా బిజినెస్ ప్రయోజనం కోసం ఉపయోగించడం; (ii) ఏదైనా ఊహాజనిత, తప్పుడు లేదా మోసపూరిత లావాదేవీ లేదా డిమాండ్ చేసే ఉద్దేశంతో ఏదైనా లావాదేవీ చేయడం; (iii) మా రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా రోబో, స్పైడర్, స్క్రాపర్ లేదా ఇతర ఆటోమేటెడ్ సాధనాలు లేదా ఏదైనా మాన్యువల్ ప్రక్రియను ఉపయోగించి ఈ వెబ్‌సైట్‌లోని ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని యాక్సెస్ చేయడం, పర్యవేక్షించడం లేదా కాపీ చేయడం; (iv) ఈ వెబ్‌సైట్‌లోని ఏదైనా ఎక్స్‌క్లూజన్ హెడర్‌లలో నిర్దేశించిన పరిమితులను ఉల్లంఘించడం లేదా ఈ వెబ్‌సైట్‌కి యాక్సెస్‌ను నిరోధించడానికి లేదా పరిమితం చేయడానికి ఉపయోగించే ఇతర చర్యలను బైపాస్ చేయడం లేదా పని చేయకుండా చేయడం లేదా తప్పించడం; (v) మా మౌలిక వసతులపై మా విచక్షణ ప్రకారం అసమంజసమని లేదా అసమానమైనదని భావించే భారాన్ని విధించడం లేదా విధించేలా చేసే చర్యలకు పాల్పడటం; (vi) మా రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ప్రయోజనం కోసం ఈ వెబ్‌సైట్‌లోని ఏదైనా విభాగానికి (దీనికే పరిమితి కాకుండా, ఏదైనా సేవను కొనుగోలు చేసే పాథ్ సహా) డీప్-లింక్ క్రియేట్ చేయడం; లేదా (vii) “ఫ్రేమ్”, “మిర్రర్” లేదా ఈ వెబ్‌సైట్‌లోని ఏదైనా భాగాన్ని మా ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ఇతర వెబ్‌సైట్‌లో చేర్చడం లేదా (viii) ఏదైనా మోసపూరిత యాప్(అప్లికేషన్)ను ప్రారంభించడం లేదా కంపెనీ/భాగస్వామి, బ్యాంకులు/ఆర్థిక సంస్థలు లేదా ఏదైనా థర్డ్ పార్టీ(లు)తో మోసపూరిత చర్యలకు పాల్పడటానికి వెబ్‌సైట్‌ను ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడటం.
3.ప్రైవసీ పాలసీ
ఈ వెబ్‌సైట్‌ను మీరు ఉపయోగిస్తున్నట్లయితే, మా గోప్యతా విధానంలో వివరించిన విధంగా మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మీరు ఇందుమూలంగా మాకు సమ్మతిని తెలిపారు. మీరు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసినప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ ఏ విధంగా ఉపయోగిస్తుందో ఈ గోప్యతా విధానం వివరిస్తుంది.
4. మీ రిజిస్ట్రేషన్/ఖాతా
వెబ్‌సైట్‌ను ఉపయోగించి, మా ప్లాట్‌ఫామ్‌లోకి సైన్ అప్ చేయడం ద్వారా, చట్టబద్ధంగా పాటించాల్సిన ఒప్పందాన్ని అంగీకరించే వయస్సు మీకు ఉందని, అలానే మా సేవలను యాక్సెస్ చేయకుండా భారతదేశ చట్టాలు లేదా ఏదైనా ఇతర సంబంధిత అధికార పరిధిలో మీపై నిషేధం ఏమీ లేదని మీరు ధృవీకరిస్తున్నారు. వెబ్‌సైట్ వినియోగం అనేది మీకు నిజంగా అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు మాత్రమే ఉద్దేశించినది. ఆ తర్వాత, ఎవరైనా వ్యక్తుల తరఫున మీరు కొనుగోలు చేస్తే, ఆ వ్యక్తులకు అనుబంధ నిబంధనలు, పరిమితులతో సహా వినియోగ నియమాలు, ప్రైవసీ పాలసీ గురించి మీరే తెలియచేస్తారని మీరు నిర్ధారిస్తున్నారు.
మీ పాస్‌వర్డ్ గోప్యతను కాపాడుకునే బాధ్యత పూర్తిగా మీదేనని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు, దీన్ని మీ లాగిన్ ఐడితో కలిపి ఉపయోగిస్తేనే ఆ సేవకు(ఎంపిక చేసుకున్న సంబంధిత సేవ ప్రకారం) యాక్సెస్ లభిస్తుంది. మీరు ఇచ్చిన ఏదైనా మొబైల్ నంబర్ లేదా సంప్రదింపు వివరాలతో పాటు మీ లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ అన్నీ కలిసి “రిజిస్ట్రేషన్ సమాచారం”లో ఉంటాయి. మీ లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ గోప్యతను కాపాడుకోవడానికి మీరు కట్టుబడి ఉంటారని, అలానే మీ కంప్యూటర్‌కు యాక్సెస్‌ను నియంత్రిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా, మీ ఖాతా లేదా పాస్‌వర్డ్‌తో నిర్వహించే అన్ని కార్యకలాపాలకు జవాబుదారీగా ఉండటానికి మీరు సమ్మతిస్తున్నారు. ఈ కారణంగా, ప్రతి సెషన్ ముగింపులో మీరు మీ ఖాతా నుండి లాగ్ అవుట్ చేయాలనే ముఖ్యమైన సలహాను మీకు ఇస్తున్నాము. మీ ఖాతాను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించినా లేదా భద్రతా ఉల్లంఘన జరిగినా, మీరు వెంటనే ఆ విషయాన్ని కంపెనీకి తెలియజేయడానికి కూడా మీరు అంగీకరిస్తున్నారు. కంపెనీకి నేరుగా ఆపాదించగలిగే కారణాల వల్ల మాత్రమే అనధికారిక యాక్సెస్ జరిగిందని మీరు నిరూపించలేకపోయిన సందర్భంలో, ఏదైనా అనధికారిక వినియోగం లేదా యాక్సెస్‌కు కంపెనీ బాధ్యత వహించదని కూడా మీరు అంగీకరిస్తున్నారు.
మీ వివరాలను తెలియచేసేటప్పుడు వాస్తవమైన, ఖచ్చితమైన, ప్రస్తుత వివరాలు, పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికే మీరు కట్టుబడి ఉన్నారు, అలానే మీ రిజిస్ట్రేషన్ సమాచారంలో ఏవైనా వివరాలు మారినట్లయితే, దాని ప్రభావం కంపెనీ ద్వారా లేదా కంపెనీ అందించే సేవలపై నేరుగా ఉంటుంది కాబట్టి వెంటనే మాకు తెలియజేయడానికి/అప్‌డేట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ గుర్తింపు సమాచారాన్ని తప్పుగా ఇవ్వకూడదని లేదా వెబ్‌సైట్‌ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడానికి లేదా దానిలోని సేవలను వినియోగించుకునేందుకు ప్రయత్నించకూడదని మీరు తెలుసుకున్నారు. మీ కొనుగోలు/మీరు ఎంచుకున్న సేవలను పొందేందుకు అదనపు నియమాలు, షరతులు వర్తిస్తాయి. దయచేసి ఈ అదనపు నియమాలు, షరతులను జాగ్రత్తగా చదవండి.
5. కస్టమర్ వివరాల నిశిత పరిశీలన ఆవశ్యకతలు (సీడీడీ)
వెబ్‌సైట్ ద్వారా ఏదైనా ఆర్థిక లావాదేవీని చేసేందుకు, క్లయింట్/కస్టమర్ వివరాలను మా భాగస్వాములైన ఆర్థిక సంస్థలు నిశితంగా పరిశీలించేందుకు తగిన చర్యలు తీసుకుంటాయని, అలానే మీ లోన్/క్రెడిట్ కార్డ్/మ్యూచువల్ ఫండ్ర్, ఇతర ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌ల అభ్యర్థనను సులభతరం చేస్తున్నప్పుడు, వర్తించే మనీలాండరింగ్ నిరోధక చట్టం (“PMLA”), దాని నిబంధనలకు అనుగుణంగా, ఓ కస్టమర్‌గా KYC కోసం అవసరమైన సమాచారాన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు మీరు తప్పనిసరిగా సమర్పించేందుకు అంగీకరించి, సమ్మతి తెలుపుతున్నారు. మా భాగస్వామ్య ఆర్థిక సంస్థలు ప్రతి కొత్త కస్టమర్/యూజర్‌ను నిర్ధారించడానికి, అలానే మీకు, ఇంకా బ్యాంక్/ఆర్థిక సంస్థకు మధ్య ఏర్పడిన సంబంధానికి ఉన్న ఉద్దేశ స్వభావాన్ని నిర్ధారించడానికి తగిన సమాచారాన్ని మీ నుంచి పొందవచ్చు. వర్తించే మనీలాండరింగ్ నిరోధక చట్టం, దాని నియమాల ప్రకారం తప్పకుండా ఉండాల్సిన వివరాలు, పాటించాల్సిన బాధ్యతలకు అనుగుణంగా కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను కంపెనీ పూర్తి చేస్తుంది, ఈ విషయంలో సంతృప్తి చెందడం కోసం కంపెనీ సమర్థవంతమైన పరిశీలన చర్యలను (ఏదైనా డాక్యుమెంటేషన్‌తో సహా) తీసుకునేందుకు మీరు అంగీకరించి, సమ్మతి తెలుపుతున్నారు. మీ సమాచారం/డేటా/వివరాలను ఆర్థిక సంస్థలకు కంపెనీ ఇచ్చేందుకు మీరు స్పష్టంగా అనుమతి ఇవ్వడమే కాకుండా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఆర్థిక సంస్థ సంతృప్తి చెందే స్థాయిలో మీ సమాచారం/డేటా/వివరాలను అందించకపోతే, మీరు ఉత్పత్తి/సేవలను పొందలేకపోవచ్చు. KYC, కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను ఆర్థిక సంస్థలు మాత్రమే నిర్వహిస్తాయి, కంపెనీకి దీనితో ఎటువంటి సంబంధమూ లేదు, అలానే దీనికి బాధ్యత వహించదు. ఉత్పత్తులు, సేవలను ఆయా ఆర్థిక సంస్థలే పూర్తిగా అందిస్తాయి. ఆర్థిక సంస్థలు అప్లికేషన్‌ను తిరస్కరించినా, ఉత్పత్తి/సేవల జారీకి తిరస్కరించినా/ఆలస్యం జరిగినా, అలానే ఉత్పత్తి/సేవలను జారీ చేసిన తర్వాత వాటి వినియోగం/సర్వీసింగ్‌కు కంపెనీ బాధ్యత వహించదు.
6. అర్హత
మీ వయస్సు 18 (పద్దెనిమిది) సంవత్సరాల కంటే ఎక్కువ అని, మీరు భారతదేశంలో నివసిస్తున్నారని, అలానే కంపెనీ అందించే సేవలు పొందుతున్నప్పుడు, భారత కాంట్రాక్ట్ చట్టం, 1872 ప్రకారం వివరించిన విధంగా ఒప్పందం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని మీరు ప్రకటించి, నిర్ధారిస్తున్నారు.
7. సమర్పించిన కంటెంట్
మీరు వెబ్‌సైట్‌లో డేటా, సమాచారంతో సహా ఏదైనా కంటెంట్‌ను పంచుకున్నప్పుడు లేదా సమర్పించినప్పుడు, మీరు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసే మొత్తం కంటెంట్‌కు మీరే పూర్తి బాధ్యత వహించడానికి అంగీకారం తెలిపారు. మీరు వెబ్‌సైట్‌లో లేదా దాని ద్వారా అందుబాటులో ఉంచడానికి ఎంచుకున్న ఏదైనా కంటెంట్‌కు కంపెనీ బాధ్యత వహించదు. కంపెనీ సొంత అభీష్టానుసారం, అటువంటి కంటెంట్‌ను సేవలలోకి (పూర్తిగా లేదా పాక్షికంగా లేదా సవరించిన రూపంలో) చేర్చవచ్చు. మీరు సమర్పించిన లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన అటువంటి కంటెంట్‌ను ఉపయోగించడానికి, కాపీ చేయడానికి, పంపించడానికి, పబ్లిక్‌గా ప్రదర్శించడానికి, సవరించడానికి, దాని నుంచి మరొక కంటెంట్‌ను రూపొందించడానికి, అటువంటి మెటీరియల్స్ లేదా అలాంటి కంటెంట్‌లోని ఏదైనా భాగానికి సబ్‌లైసెన్స్ పొందడానికి, శాశ్వతమైన, రద్దు చేయలేని, వెనక్కి తీసుకోలేని, ప్రపంచవ్యాప్తంగా వాడుకునేలా, రాయల్టీ లేని, ప్రత్యేకమైన లైసెన్స్‌ను మీరు కంపెనీకి మంజూరు చేస్తారు. మీరు సమర్పించిన కంటెంట్‌కు పూర్తి బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ వెబ్‌సైట్‌లో లేదా దీనిని ఉపయోగించి ఈ కింద పేర్కొన్న అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ లేదా ప్రసారం చేయకూడదు: (i) ఏదైనా చట్టవిరుద్ధమైన, బెదిరించేలా, అవమానకరమైన, పరువు నష్టం కలిగించే, అశ్లీలమైన, నీలిచిత్రాలు లేదా ఇతర అంశాలు లేదా కంటెంట్ ప్రచారం మరియు/లేదా గోప్యతా హక్కులను ఉల్లంఘించే లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ ; (ii) ఏదైనా కమర్షియల్ మెటీరియల్ లేదా కంటెంట్ (నిధుల అభ్యర్థన, ప్రకటనలు లేదా ఏదైనా వస్తువు లేదా సేవల మార్కెటింగ్‌తో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా); ఇంకా (iii) ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించిన కాపీరైట్, ట్రేడ్‌మార్క్, పేటెంట్ హక్కు లేదా ఇతర యాజమాన్య హక్కును ఉల్లంఘించే, దుర్వినియోగం చేసే లేదా ఉల్లంఘించే ఏదైనా మెటీరియల్ లేదా కంటెంట్‌ను పోస్ట్ చేయడం.
పైన పేర్కొన్న నిషేధిత అంశాలను ఉల్లంఘించడం వల్ల లేదా ఈ వెబ్‌సైట్‌లో మీరు కంటెంట్‌ను పోస్ట్ చేయడం వల్ల కలిగే ఏదైనా ఇతర నష్టానికి మీరు మాత్రమే బాధ్యత వహించాలి.
8. థర్డ్ పార్టీ లింక్‌లు/ఆఫర్లు
ఈ వెబ్‌సైట్‌లో ఇతర వెబ్‌సైట్‌లు లేదా ఆధారాలకు సంబంధించిన లింక్‌లు ఉండవచ్చు. ఈ బయటి సైట్‌లు లేదా ఆధారాలు ఇలా ఉండటానికి కంపెనీ బాధ్యత వహించదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. ఈ సైట్‌లు లేదా ఆధారాల వల్ల కనిపించిన లేదా అందుబాటులో ఉన్న ఏదైనా కంటెంట్, ప్రకటనలు, ఉత్పత్తులు లేదా ఇతర వస్తువులను కంపెనీ ఆమోదించదు, అలానే వాటికి బాధ్యత వహించడం లేదా వాటికి ప్రచారం కల్పించడం చేయదు. అటువంటి సైట్లు లేదా ఆధారాల ద్వారా అందుబాటులో ఉండే ఏదైనా కంటెంట్, వస్తువులు, లేదా సేవల వినియోగం లేదా వాటిపై ఆధారపడటం వల్ల కలిగే ఏదైనా నష్టం లేదా హానికి కంపెనీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహించదని, ఆ నష్టాన్ని పూడ్చదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
9. వారెంటీ నిరాకరణ
వెబ్‌సైట్‌లో ఉన్న లేదా యాక్సెస్ చేయదగిన సేవలు, అలానే ఇతర కంటెంట్ (థర్డ్ పార్టీలతో సహా)ను పూర్తిగా మీ విచక్షణ మేరకే, ఒకవేళ ఏదైనా జరిగి ప్రమాదం తలెత్తితే దానికి కూడా మీరే బాధ్యత వహించాలని స్పష్టంగా అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. సేవలను “ఉన్నవి ఉన్నట్లుగా”, “అందుబాటులో ఉన్నవి” ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్ లేదా సేవల (థర్డ్ పార్టీ సేవా సంస్థలు, స్పాన్సర్ చేసినా లేదా చేయకపోయినా) కంటెంట్ ఖచ్చితత్వం, విశ్వసనీయత లేదా సంపూర్ణతకు కంపెనీ ఎటువంటి ప్రాతినిధ్యం వహించదు. అలానే నిర్ధిష్ట ప్రయోజనం విషయంలో దాన్ని ఛేదించలేమని లేదా ఫిట్‌నెస్ పరంగా బాగుంది అనేటటువంటి వారెంటీలు లేదా హామీలు ఇవ్వదు, చెప్పదు లేదా సూచించదు.
సేవలు, మొత్తం సమాచారం, ఉత్పత్తులు, సేవలు, అలానే ఇతర కంటెంట్ (థర్డ్ పార్టీలతో సహా) సేవలకు సంబంధించిన అన్ని రకాల వారెంటీలను కంపెనీ స్పష్టంగా నిరాకరిస్తుంది. అలానే నిర్ధిష్ట ప్రయోజనం విషయంలో దాన్ని ఛేదించలేమని లేదా ఫిట్‌నెస్ బాగుందని, వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూరుస్తుందని వంటి వారెంటీలు లేదా హామీలు ఇవ్వదు, చెప్పదు లేదా సూచించదు.
కంపెనీ, అలానే దాని ,సేవా సంస్థలు, అనుబంధ సంస్థలు, భాగస్వామ్య బ్యాంకులు ఏవైనా (i) సేవలు మీ అవసరాలకు అనుగుణంగా ఉంటాయని, (ii) సేవలు అంతరాయం లేకుండా, సమయానుకూలంగా, సురక్షితంగా లేదా లోపాలు లేకుండా ఉంటాయని, (iii) సేవలు వినియోగించడం వల్ల వచ్చిన ఫలితాలు ఖచ్చితమైనవని లేదా నమ్మదగినవి అని, (iv) సేవల ద్వారా మీరు కొనుగోలు చేసిన లేదా పొందిన ఏదైనా ఉత్పత్తులు, సేవలు సమాచారం లేదా ఇతర వస్తువుల నాణ్యత మీ అంచనాలకు అనుగుణంగా ఉంటుంది, అలానే (v) టెక్నాలజీలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేస్తామని వంటి వారెంటీలను ఇవ్వవు.
ఎప్పుడైనా రిజిస్ట్రేషన్/ సభ్యత్వం లేదా బ్రౌజింగ్ ఫీజు కోసం ఎంతో కొంత ఫీజును వసూలు చేసే సంపూర్ణ హక్కు కంపెనీకి ఉంది. కంపెనీ వసూలు చేసే అన్ని ఫీజులను యూజర్లకు తెలియచేస్తాము, అలానే ఆ ఫీజులను ఎప్పుడైనా మారిస్తే వాటిని వెంటనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాము, అలా చేసిన వెంటనే అవి ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తాయి. కంపెనీ అన్ని ఫీజులను భారతీయ రూపాయలలో వసూలు చేస్తుంది. మీరు దీన్ని నిరంతర ఉపయోగిస్తున్నట్లయితే సవరించిన వినియోగ నియమాలను అంగీకరించినట్లుగానే పరిగణిస్తాము.
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా పేమెంట్ పద్ధతి/పద్ధతులను వినియోగిస్తున్నప్పుడు, ఈ కింద ప్రస్తావించిన కారణాల వల్ల మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించే ఏదైనా నష్టం లేదా హానికి సంబంధించి కంపెనీ బాధ్యత వహించదు లేదా నష్టాన్ని పూడ్చదు:
- ఏదైనా లావాదేవీ/లు చేసేందుకు ఆథరైజ్ చేయకపోవడం, లేదా
- లావాదేవీ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఏవైనా పేమెంట్ సమస్యలు, లేదా
- మీరు ఉపయోగిస్తున్న పేమెంట్ పద్ధతులు (క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసాలు మొదలైనవి) చట్టవిరుద్ధమైనవి;
- ఏదైనా ఇతర కారణాల వల్ల లావాదేవీని తిరస్కరించడం
వెబ్‌సైట్ మీకు చేసిన/మీరు చేసిన లావాదేవీ విశ్వసనీయతతో సంతృప్తి చెందకపోతే, ఇక్కడ ఉన్న వాటిని పాటించకుండా, భద్రత లేదా ఇతర కారణాల కోసం అదనపు ధృవీకరణను నిర్వహించే హక్కు వెబ్‌సైట్‌కు ఉంది.
భాగస్వామ్య ఆర్థిక సంస్థలు అందించే ఉత్పత్తులు లేదా సేవలను పంపిణీ చేయడంలో వైఫల్యం లేదా జాప్యం జరిగితే, అటువంటి ఆలస్యం కారణంగా మీకు సంభవించే ఏదైనా నష్టం లేదా హానితో సహా, దేనికీ కంపెనీ బాధ్యత వహించదు, అలానే కంపెనీని మీరు బాధ్యులుగా చేయరాదు. భారతదేశపు ప్రాదేశిక సరిహద్దులకు అవతల ఉత్పత్తులు/సేవలను డెలివరీ చేయకూడదు.
10. బాధ్యతా పరిమితి
మొత్తం ప్రక్రియలో కంపెనీ పాత్ర చాలా పరిమితమని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఇది మీకు, సంబంధిత ఆర్థిక సంస్థకు మధ్య ఫెసిలిటేటర్‌గా మాత్రమే పని చేస్తుంది. భాగస్వామ్య ఆర్థిక సంస్థ(లేదా కంపెనీ మినహా ఎవరైనా వ్యక్తి) అందించిన ఉత్పత్తి లేదా సేవలతో ఏదైనా సమస్య ఏర్పడితే, వర్తించే చట్టాలు, మీరు అమలులోకి తెచ్చిన/అంగీకరించిన లోన్ డాక్యుమెంట్ల ప్రకారం మీ హక్కులను నిర్వహిస్తారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు. కంపెనీ మరియు/లేదా కంపెనీ గ్రూప్ సంస్థలను ఎలాంటి వివాదం విషయంలోనైనా ఓ పార్టీగా చేర్చకూడదని, అలానే కంపెనీ మరియు/లేదా కంపెనీ గ్రూప్ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా క్లెయిమ్ చేయకూడదని మీరు అంగీకరించి, హామీ ఇస్తున్నారు.
పైన పేర్కొన్న నిబంధనకు ఉన్న సాధారణ అర్థం విషయంలో ఎలాంటి ప్రతికూల అభిప్రాయం లేకుండా, (ఎ) ఏ సందర్భంలోనైనా, ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష పర్యవసానాలకు, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్ష పడే అవకాశమున్న నష్టాలు, లాభాలు లేదా ఆదాయాల నష్టం, మంచి పేరు, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టం, ఒప్పందం, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా ఇంకేదైనా కారణం వల్ల, లేదంటే PhonePe సేవలను ఉపయోగించడం లేదా పొందలేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే నష్టాలకు, వీటికే పరిమితం కాకుండా ఇంకొన్ని విషయాలకు కంపెనీ మరియు/లేదా కంపెనీ గ్రూప్ సంస్థలు, దాని అనుబంధ సంస్థలు, ఉప సంస్థలు, డైరెక్టర్లు & అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, భాగస్వాములు, లైసెన్సర్లు బాధ్యత వహించరు.
11. నష్టపరిహారం
మీరు దేని నుంచైనా, అలానే ఎలాంటి క్లెయిమ్‌లు, చర్యకు దారితీసిన కారణాలు, డిమాండ్లు, రికవరీలు, నష్టాలు, నాశనం చేయడం, జరిమానాలు, అపరాధ రుసుములు లేదా ఇతర ఖర్చులు లేదా ఏ రూపంలో ఉన్నవైనా, ఎలాంటివైనా వ్యయాలు, సహేతుకమైన న్యాయవాదుల ఫీజులతో సహా, లేదా మీరు వినియోగ నియమాలు ఉల్లంఘింటడం వల్ల గానీ, థర్డ్ పార్టీకి చెందిన ఏదైనా చట్టం లేదా హక్కులను ఉల్లంఘించడం వల్ల గానీ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం వల్ల గానీ కలిగే నష్టానికి కంపెనీ అలానే వారి అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, అనుబంధ సంస్థలు, ఉప సంస్థలు, జాయింట్ వెంచర్లు, ఉద్యోగులను బాధ్యులను చేయకూడదు. మీరే వీటన్నిటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
12. అదనపు నియమ, నిబంధనలు
వెబ్‌సైట్, సంబంధిత విధానాలు, ఒప్పందాలు, ఈ వినియోగ నియమాలు, గోప్యతా విధానాన్ని అవసరమైన మేరకు, అలానే సముచితమని భావించే ఏ సమయంలోనైనా మార్పులు చేసే హక్కు కంపెనీకి ఉంది. ఈ మార్పులలో చట్టం లేదా నియంత్రించే నిబంధనలలో మార్పులు, తప్పులను సరి చేయడం, వదిలేసిన విషయాలు, తప్పులు లేదా అస్పష్టత, ప్రాసెస్ ఫ్లో, సేవల స్వభావం, ఆవశ్యకత, కంపెనీ పునర్వ్యవస్థీకరణ, మార్కెట్ పద్ధతి లేదా కస్టమర్ అవసరాలు కూడా ఉంటాయి. అయితే వీటికి మాత్రమే అవి పరిమితం కావు. మీరు సేవలను నిరంతరం ఉపయోగించడం వలన మార్పులను అంగీకరిస్తున్నారని, అలానే సవరించిన నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పరిగణిస్తాము. మీరు మార్పులకు అంగీకరించకపోతే, దయచేసి మీరు ఈ సేవల వినియోగాన్ని ఆపివేయవచ్చు.
సేవలు మరియు/లేదా వెబ్‌సైట్‌లోని నిర్దిష్ట ఫీచర్లు/కంటెంట్‌లను మార్చడం లేదా భద్రతను నిర్వహించడం వంటివి మినహాయిస్తే, ఉత్తమ ప్రయత్నం ప్రాతిపదికన సహేతుక సమయ వ్యవధి మేరకు ముందుగా నోటీసు ఇచ్చి, సేవలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయడానికి లేదా ఆపివేయడానికి కంపెనీకి హక్కు ఉంది. సేవలలో ఏవైనా మార్పులు చేయడం లేదా వాటిని పూర్తిగా నిలిపివేయడం వల్ల మీకు ఏదైనా నష్టం జరిగితే దానికి కంపెనీ ఏ రూపంలోనూ బాధ్యత వహించదు అని మీరు అంగీకరిస్తున్నారు.
చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం లేదా చట్టవిరుద్ధమైన, వేధించే, అవమానకరమైన (అవాస్తవం, ఇతరులకు నష్టం చేకూర్చే), మరొకరి ప్రైవసీకి ఇబ్బంది కలిగించే, దుర్వినియోగపర్చే, బెదిరించే లేదా అశ్లీలమైన లేదా ఇతరుల హక్కులను ఉల్లంఘించే విషయాలను ప్రసారం చేయడానికి ఈ సేవలను ఉపయోగించకూడదని మీరు అంగీకరిస్తున్నారు. .
13. సాధారణ నియమాలు
ఈ నిబంధనల్లో ఏవైనా చెల్లనివిగా, పనికిరానివిగా లేదా ఏదైనా కారణం చేత అమలు చేయలేనివిగా పరిగణించినట్లయితే, నియమాలలో పేర్కొన్న విధంగా పార్టీల ఉద్దేశాలను అమలు చేయడానికి కోర్టు ప్రయత్నించాలని పార్టీలు అంగీకరిస్తాయి, వాటిని అమలు చేయలేని పరిస్థితిని విడదీయాల్సిన స్థితిగా పరిగణిస్తారు, అయితే అది ఏదైనప్పటికీ మిగిలిన నిబంధనల చెల్లుబాటు, అమలు విషయంలో ప్రస్తుత స్థితిపై ఎటువంటి ప్రభావమూ చూపదు. హెడ్డింగ్‌లను రెఫరెన్స్ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రస్తావించాము, అవి అటువంటి విభాగాల పరిధిని లేదా స్కోప్‌ను కుదించవు. ఈ వినియోగ నియమాలతో పాటు మీకు, కంపెనీకి మధ్య ఉన్న సంబంధాన్ని భారతీయ చట్టాల ద్వారానే అమలు అవుతాయి. భారతదేశ చట్టాలకు, ఇతర చట్ట పరిధులకు మధ్య ఏదైనా వైరుధ్యం లేదా విభేదం ఏర్పడితే, భారతదేశ చట్టాలే చిట్టచివరిగా అమలవుతాయి. వెబ్‌సైట్‌ను భారతదేశ భూభాగంలోని యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించినది. కాబట్టి దీని విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే, అంటే న్యాయపరమైన లేదా పాక్షిక-న్యాయసంబంధమైన వివాదం తలెత్తితే, దానిని భారతదేశ చట్టాలకు లోబడి పరిష్కరించుకోవాలి, అలాగే ఈ కేసులన్నీ బెంగళూరులోని న్యాయస్థానాల ప్రత్యేక అధికార పరిధి కిందకు వస్తాయి. మీరు లేదా ఇతరులు ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు కంపెనీ, చర్య తీసుకోవడంలో విఫలమైనంత మాత్రాన, ఆ తర్వాత జరిగే ఉల్లంఘనలపై లేదా ఇలాంటి ఇతర ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే హక్కును కంపెనీ కోల్పోదు. ఈ ఒప్పందం/వినియోగ నియమాలు, మీకు, కంపెనీకి మధ్య కుదిరిన మొత్తం ఒప్పందంగా పరిగణించబడుతుంది/బడతాయి. అలాగే మీరు వెబ్‌సైట్ వినియోగించడాన్ని ఈ ఒప్పందం పర్యవేక్షిస్తుంది. వెబ్‌సైట్‌కు సంబంధించి మీకు, కంపెనీకి మధ్య గతంలో కుదిరిన ఏవైనా ఒప్పందాలు ఉంటే అవి రద్దు అయి వాటి స్థానంలో ఇది తాజా ఒప్పందంగా అమల్లోకి వస్తుంది.