ఈ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 ప్రకారం రూపొందిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డు. దీనికి కాలానుగుణంగా సవరణలు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000ను అనుసరించి సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన సవరణలు, నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డు కంప్యూటర్ ద్వారా తయారు చేసిన డాక్యుమెంట్ కాబట్టి దీనిపై ఎలాంటి ఫిజికల్ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
ఈ వినియోగ నియమాలు – దుకాణాలు (“నియమాలు”) PhonePe మొబైల్ అప్లికేషన్‌లో ‘దుకాణాలు’ ట్యాబ్‌లో అందించిన సమాచారాన్ని (“సమాచారం”) నియంత్రిస్తాయి. PhonePe మొబైల్ అప్లికేషన్ (PhonePe యాప్) PhonePe ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అందించబడుతోంది, ఇది కంపెనీల చట్టం, 1956 కింద రిజిస్టర్ అయిన కంపెనీ. దీని రిజిస్టర్డ్ కార్యాలయం ఆఫీస్-2, 4,5,6,7 వ అంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియాలో వుంది. (ఇకపై దీనిని “PhonePe” గా సూచించడం జరుగుతుంది).
PhonePe యాప్‌లో (“దుకాణాలు”) ‘దుకాణాలు’ అనే ట్యాబ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నియమాలకు కట్టుబడి వుండటానికి అంగీకరించారని అర్థం. PhonePe వెబ్‌సైట్(లు) మరియు/లేదా PhonePe యాప్‌లో అప్‌డేట్‌లు అందించడం ద్వారా మేము ఈ నియమాలను ఎప్పుడైనా సవరించవచ్చు. ఈ నియమాల యొక్క అప్‌డేట్ చేయబడ్డ వెర్షన్ పోస్ట్ చేసిన వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ నియమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను/మార్పులను క్రమం తప్పకుండా రివ్యూ చేసుకోవలసిన బాధ్యత మీదే. మార్పులు పోస్ట్ చేసిన తర్వాత మీరు PhonePe యాప్‌ను ఉపయోగించడం కొనసాగిస్తున్నారు అంటే మీరు రివిజన్(లు)/సవరణ(లు)ను ఆమోదిస్తున్నారని, అంగీకరిస్తున్నారని అర్థం.
‘‘దుకాణాలుపై సమాచారం
మీ లొకేషన్ ఆధారంగా (సాధారణంగా PhonePe యాప్‌ను ఉపయోగించినప్పుడు మీరు లొకేషన్ యాక్సెస్‌కు అనుమతించి వుండవచ్చు లేదా ‘దుకాణాలు’ అనే ట్యాబ్‌లో వున్నప్పుడు మీరు లొకేషన్ ఎంచుకుని వుండవచ్చు) PhonePe ‘దుకాణాల’లో మీకు సమీపంలోని సేవా సంస్థల గురించి సమాచారాన్ని అందిస్తుంది (దీనిలో పరిమితి లేకుండా దుకాణాలు, అవుట్‌లెట్లు, సంస్థలు ఉంటాయి, అలాగే వ్యక్తులు కూడా వుంటారు. ఇవన్నీ ఇకపై “సేవా సంస్థలు” గా సూచించబడతాయి). కిరాణా, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యం, ఆహారం, పానీయాలు, రిటైల్, షాపింగ్, వినోదం, హోటళ్లు, లాడ్జీలు మొదలైన కేటగిరీలు ఈ “సేవా సంస్థలు” కిందకు వస్తాయి.
ఇక్కడ చట్టం అనుమతించిన మేర పూర్తి స్థాయిలో, సేవా సంస్థల సమాచారం స్పష్టంగా ఇవ్వబడింది (సంస్థలు ఆఫర్ చేసే ఉత్పత్తి/సేవ ఆఫర్‌లు, ఓపెన్/క్లోజ్డ్ స్టేటస్, సంప్రదింపు సమాచారం, చిరునామా, దిశలు, చెల్లింపుదారు వివరాలు, ఫోటోగ్రాఫ్‌లు మొదలైనవి ఈ సమాచారంలో వుంటాయి). ఈ సమాచారాన్ని సంస్థలు PhonePeకు సమర్పించినవి. ఇంకా PhonePe మొబైల్ యాప్ వినియోగదారుల ద్వారా సమర్పించబడిన సంబంధిత సేవా సంస్థల సమీక్షలు, సగటు రేటింగ్‌లు, PhonePe యాప్‌లో “ఉన్నవి ఉన్నట్టుగా”, “అందుబాటులో ఉన్న మేరకు”, “అన్ని లోపాలతో’’ అనే శీర్షికలతో ఉంటాయి. అయితే ఇవన్నీ కేవలం మీ రెఫరెన్స్ కోసమే ఉద్దేశించబడ్డాయి.
దుకాణాలుపై సమాచారాన్ని యాక్సెస్ చేసేటప్పుడు / ఉపయోగించేటప్పుడు, అటువంటి సేవా సంస్థలతో కింద పేర్కొన్న చర్యలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, సహేతుకమైన శ్రద్ధను పాటించాలి: (a) సదరు సేవా సంస్థతో ఇంటరాక్ట్ చేయడం లేదా మీ సమాచారాన్ని (స్వతంత్రంగా లేదా దుకాణాల్లో ఎనేబుల్ చేయబడ్డ చాట్ ఫీచర్ ద్వారా) అందించడం లేదా (b) అటువంటి సేవా సంస్థల నుంచి ఏదైనా ఉత్పత్తి(లు)/సేవ(లు) (PhonePe ATM సేవతో సహా) కొనుగోలు చేయడం / పొందడం వంటివి చేయడం.
డిస్‌క్లెయిమర్‌లు
‘దుకాణాలు’లోని సమాచారాన్ని ఉపయోగించడం వల్ల తలెత్తే అన్ని నష్టాలకు మీరే బాధ్యులని, దానికి సంబంధించి PhonePe ఏ విధంగానూ బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు. ఇంకా ఉత్పత్తు(లు)/సేవలు, నాణ్యత, వర్తక సామర్థ్యం, లోపం, ఉత్పత్తులను/సేవలను డెలివరీ చేయడంలో ఆలస్యం వంటి వివాదాలను మీరు, సేవా సంస్థలు నేరుగా పరిష్కరించుకోవాలి, ఈ వివాదాల్లోకి PhonePeని పార్టీగా చేయకూడదు.
- ‘దుకాణాలు’ లో అందుబాటులో ఉంచబడిన సమాచారం యొక్క కచ్చితత్వం మరియు వాస్తవికతకు సంబంధించి, వ్యక్తీకరించబడిన లేదా సూచించబడిన అన్ని వారంటీలను PhonePe నిరాకరిస్తుంది. PhonePe ఎవరికీ, తన తరఫున ఎలాంటి వారంటీని ఇవ్వడానికి అధికారం ఇవ్వదు మరియు మీరు అలాంటి ప్రకటనపై ఆధారపడకూడదు. ‘దుకాణాలు’ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న సమాచారం యొక్క కచ్చితత్వాన్ని, సంపూర్ణత్వాన్ని, ఉపయోగాన్ని అంచనా వేయడం మీ బాధ్యత.
- ఏ పద్ధతిలోనైనా ఆ సేవా సంస్థలు PhonePeకి ప్రాతినిథ్యం వహిస్తున్నవిగా పరిగణింపబడవు. అటువంటి సేవా సంస్థల ద్వారా అందించబడిన ఉత్పత్తి సేవలు, PhonePe ద్వారా అందించబడిన/అందించిన/అందుబాటులో ఉంచబడిన ఉత్పత్తులు/సేవలుగా పరిగణింపబడవు.
- PhonePe ATM సేవకు సంబంధించి, సేవా సంస్థ ద్వారా మొత్తం డబ్బులు చెల్లించకపోవడం, చెల్లించిన మొత్తంలో వ్యత్యాసం, డినామినేషన్ సమస్యలు, నకిలీ కరెన్సీ, వాటికే పరిమితం కాకుండా ఏ కారణాల వల్ల మీకు మరియు సంబంధిత సేవా సంస్థలకు మధ్య తలెత్తే ఏదైనా వివాదానికి కూడా PhonePe బాధ్యత వహించదు. మీరు ఉత్పత్తులను/సేవలను మీ సొంత రిస్క్‌పై మాత్రమే పొందవచ్చు.
ఇతర వినియోగ అంశాలు
- సేవా సంస్థల ఉత్పత్తులతో / సేవలతో ఏదైనా పరస్పర సంప్రదింపు లేదా కొనుగోలు చేయడంలో / పొందడంలో ఏర్పడే అన్ని రకాల నష్టాలు, చర్యలు, వాదనలు మరియు బాధ్యతల (చట్టపరమైన ఖర్చులతో సహా) నుండి, అవి ప్రత్యక్షమైనవైనా పరోక్షమైనవైనా, అవి ఏ పద్ధతిలో ఏర్పడినా, వాటి విషయంలో నష్టపరిహారాన్ని అందించడానికి PhonePeకు, దాని అనుబంధ సంస్థలకు, ఉద్యోగులకు, డైరెక్టర్‌లకు, అధికారులకు, ఏజెంట్లకు, ఇంకా ప్రతినిధులకు ఎలాంటి బాధ్యతా ఉండదని అంగీకరిస్తున్నారు.
లాభాలు లేదా ఆదాయాల నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవడం, కాంట్రాక్ట్, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా ఇతరత్రా, అందించిన సమాచారాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వంటి వాటికి పరిమితి లేని నష్టాలతో సహా ఏదైనా పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు, అంతేకాక కాంట్రాక్ట్, హక్కుల అతిక్రమణ, నిర్లక్ష్యం, వారంటీ లేదా మరేదైనా కారణం వల్ల ఏర్పడిన ఎలాంటి నష్టాలకైనా PhonePe ఏ సందర్భంలోనూ బాధ్యత వహించదు.
మీకు సేవా సంస్థలతో వివాదం ఉన్నట్లయితే, అన్ని రకాల క్లెయిమ్‌లు, డిమాండ్‌లు మరియు నష్టాల నుండి (వాస్తవమైన మరియు పర్యవసానంగా) తెలిసి మరియు తెలియని, అటువంటి వివాదాల నుండి మీరు PhonePeని (దాని అనుబంధ సంస్థలు, అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు మరియు ఉద్యోగులతో సహా) విడుదల చేస్తారు. - ఈ నియమాలు దాని చట్టాల వైరుధ్యాల సూత్రాలకు సంబంధం లేకుండా భారత చట్టాలచే నియంత్రించబడతాయి,. ఈ నియమాలకు సంబంధించి మీకు మరియు PhonePeకి మధ్య మొత్తంగా లేదా పాక్షికంగా ఉత్పన్నమయ్యే ఏదైనా దావా లేదా వివాదం బెంగుళూరులో ఉన్న అర్హత కలిగిన న్యాయస్థానం ద్వారా ప్రత్యేకంగా నిర్ణయించబడుతుంది.
- PhonePe వినియోగ నియమాలు మరియు PhonePe గోప్యతా విధానం ఈ నియమాలలో సూచన ద్వారా చేర్చబడినట్లు పరిగణించబడతాయి.