PhonePe Blogs Main Featured Image

Trust & Safety

పెరుగుతున్న ఉద్యోగ మోసాలు: మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్న ఉద్యోగార్థులు

PhonePe Regional|4 min read|27 January, 2025

URL copied to clipboard

ఉద్యోగావకాశాలకోసం కోట్లాది మంది నిరీక్షిస్తున్న నేటి ప్రపంచంలో తమకు ఉద్యోగం త్వరగా రావాలనే ఒత్తిడి నిరుద్యోగులను ఆవహిస్తుంది. సరిగ్గా ఈ బలహీనతపైనే కొన్ని కుంభకోణాలు, మోసాలు నడుస్తున్నాయి. నేడు జరిగే ఉద్యోగ మోసాల్లో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, అధికారికమైనవిగా కనిపించే ఇమెయిల్ చిరునామాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే వీటిని చేస్తుండడం. ఇటీవలి కాలంలో జనం నుండి డబ్బును దోచుకోవడానికి ఈ పద్ధతిని మోసగాళ్లు ఉపయోగించుకోవడం పెరుగుతోంది. 

దూరప్రాంతాల్లో ఉద్యోగాలు పెరుగుతుండడంతో పాటు నిరుద్యోగ రేట్ ఎక్కువగా ఉండడం ఉద్యోగమోసాల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. సెంటర్ ఫార్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2024 నాటి లెక్కలను బట్టిదేశంలోని సగటు నిరుద్యోగ రేట్ 7.8%గా ఉంది. ఇది ఉద్యోగం కోసం ఉద్యోగార్థుల్లో ఉన్న తపనను ఆసరాగా చేసుకుని, దోపిడీకి పాల్పడేందుకు మోసగాళ్లకు వీలు కల్పిస్తోంది.

నకిలీ ఇమెయిల్ హ్యాండ్లర్ల పెరుగుదల

మోసం చేయడానికి వంచకులు ఎంచుకుంటున్న అత్యంత మోసపూరితమైన పద్ధతుల్లో ఒకటేమిటంటే, చట్టబద్ధమైన కార్పొరేట్ చిరునామాలను పోలినట్టే కనిపించే ఇమెయిల్ చిరునామాను రూపొందించుకుని, ఉపయోగించడమే. ఈ ఇమెయిల్ హ్యాండ్లర్స్ తరచూ ఒక సుప్రసిద్ధమైన కంపెనీ పేరును పోలినట్టు ఉంటుంది. ఇది ఒక గుర్తింపు పొందిన సంస్థకు చెందిన నియమాక ప్రతినిధితో మాట్లాడుతున్నామనే నమ్మకాన్ని ఉద్యోగార్థులకు కలిగిస్తుంది. 

ఉదాహరణకు, మోసగాళ్లు ఒక నిజమైన కార్పొరేట్ ఇమెయిల్ చిరునామాలాగే ఉండే [email protected] లేదా [email protected] ఇమెయిల్ చిరునామాలను ఉపయోగించవచ్చు. చాలావరకు, ఈ ఇమెయిళ్లు అధికారిక లోగోలు, చిరునామాలు, అధికారిక కమ్యూనికేషన్ తరహాలో కనిపించే ప్రొఫెషనల్ భాష సహా నమ్మదగే రీతిలో ఉన్నట్టు రూపొందించబడుతాయి. 

మోసగాళ్లు స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఉద్యోగ దరఖాస్తుల డొమైన్‌కు అనుగుణంగా ఆన్‌లైన్ ఇంటర్వ్యూ పరీక్షలను రూపొందించడానికి చాలా శ్రమిస్తారు.  వారు పేమెంట్ల కోసం ప్రయత్నించే ముందు ఈ ప్రక్రియను మరింత ప్రామాణిమైనదిగా కూడా క్రియేట్ చేస్తారు.

ఉద్యోగార్ధులు ఇమెయిల్‌కు ప్రతిస్పందించిన తర్వాత, వారికి ఉత్తేజకరమైన ఉద్యోగ అవకాశం చూపించబడి, వారు ఆ ఉద్యోగాన్ని అందుకునే ముందు ముందు “ప్రాసెసింగ్ ఫీజు” లేదా “శిక్షణ ఫీజు” చెల్లించమని అడుగుతారు. బ్యాక్‌గ్రౌండ్ తనిఖీలు, శిక్షణ లేదా పరికరాల ఖర్చుల పేరుతో కూడా ఈ ఫీజులకు స్కామర్లు కారణం చెబుతారు. అయితే, పేమెంట్ చేసిన వెంటనే ఆ జాబ్ ఆఫర్ మాయమైపోతుంది. దీంతోపాటు బాధితుడి డబ్బుతో మోసగాళ్ళు అదృశ్యమవుతారు.

ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ఎంతో అప్రమత్తంగా ఉండే వ్యక్తులు కూడా ఈ మోసపూరిత ఇమెయిల్ చిరునామాల మోసం బారిన పడవచ్చు. ఇది జాబ్ ఆఫర్ల చట్టబద్ధతను వెరిఫై చేయడానికున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రత్యేకించి, ముందస్తుగా పేమెంట్ కోరే వాటిపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

సోషల్ మీడియా, జాబ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మోసాలు

ఇటీవలి కాలంలో, స్కామర్లు తమ తదుపరి బాధితుడిని కనుగొనడానికి సోషల్ మీడియా, జాబ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.

మోసగాళ్లు సాధారణంగా ఉద్యోగార్థులను ఆకర్షణీయమైన ఆఫర్‌తో సంప్రదిస్తారు. తాము గౌరవనీయమైన కంపెనీకి చెందినవారమని నమ్మబలుకుతారు. వారు వ్యక్తులను సందేశాల ద్వారా సంప్రదించవచ్చు లేదా ఉద్యోగం కోసం జనం చురుగ్గా వెతుకుతున్న గ్రూప్‌లు లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ ఉద్యోగ లిస్టింగ్‌లను పోస్ట్ చేయవచ్చు. ఈ లిస్టింగ్‌లు చాలావరకు ఎక్కువ వేతనాలతో కూడినవి, తక్కువ అనుభవం లేదా నైపుణ్యాలు అవసరమయ్యే ఇంటినుండి పని చేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రయోజనాలను కలిగి ఉంటాయని వాగ్దానం చేస్తాయి, ఇది త్వరితగతి ఉపాధి కోసం వెతుకుతున్న ఉద్యోగార్ధులను తక్షణమే ఆకర్షిస్తుంది.

ఉద్యోగంపై ఆసక్తిని వ్యక్తం చేసిన తర్వాత, మోసగాడు ఆ వ్యక్తి వద్ద నకిలీ KYC ప్రక్రియను నిర్వహిస్తాడు. ఈ ప్రక్రియలు పూర్తిగా చట్టబద్ధంగా కనిపిస్తుండవచ్చు. దీంతో వాటిపట్ల నమ్మకం మరింతగా పెరుగుతుంది. అలా నకిలీ వెరిఫికేషన్ జరిపిన తర్వాత, ఉద్యోగార్ధులకు వారు పని కోసం ఎంపిక చేయబడ్డారని, కొన్ని పనులు లేదా అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత వారి జీతం పొందేందుకు ముందుగా చెప్పబడిన అడ్వాన్స్‌ని చెల్లించమని సూచించబడతారు. దీనిని “పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు” లేదా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్‌లో భాగమని మోసగాళ్లు చెప్పవచ్చు. నమ్మకాన్ని పొందడంకోసం వారు అకౌంట్‌లో చిన్న అమౌంట్లను కూడా జమ చేయవచ్చు. పని పూర్తయిన తర్వాత, వారు సదరు వ్యక్తి నుండి తమకు తాముగా దూరమవుతారు. బాధితులు మళ్లీ వారిని సంప్రదించలేరు. ఈ స్కామ్‌లకు సంబంధించి దారుణమైన విషయం ఏమిటంటే, చాలా సందర్భాల్లో అవి చాలా చక్కగా అలంకరించబడి, చట్టబద్ధతను కలిగి ఉన్నట్టు కనిపిస్తాయి. ఉద్యోగార్ధులు నకిలీ కాంట్రాక్టులు, అధికారి నుండి విన్నట్టనిపించే ఉద్యోగ హోదాలు, వేతన హామీలను అందుకోవచ్చు. అయితే డబ్బు పంపిన తర్వాత, ఆ మోసగాళ్లు మాయమైపోతారు.

గమనించాల్సిన హెచ్చరికలు

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాన్ని తెలిపే సంకేతాలను అర్థం చేసుకోవడం ఇలాంటి మోసపూరితమైన కుయుక్తులను నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనం గమనించాల్సిన హెచ్చరికలు కింది విధంగా ఉంటాయి:

  1. కోరుకోకున్నా వచ్చే ఉద్యోగ ఆఫర్లు: మీరు ఉద్యోగం కోసం అప్లై చేయకున్నా, ఎవరో ఒకరు అనుకోకుండా ఉద్యోగం పేరుతో మిమ్మల్ని సంప్రదించడం అనేది ఒక మోసంగానే ఉండగలదు. 
  2. డబ్బు కోసం అభ్యర్థనలు: ఒక చట్టబద్ధమైన కంపెనీ ఏదీ మీరు పనిని ప్రారంభించడానికి ముందో లేదా మీ వేతనాన్ని అందుకునే ముందో మిమ్మల్ని ఏ రకంగానూ డబ్బు పే చేయమని ఎన్నడూ కోరదు. “శిక్షణ ఫీజు,” “బ్యాక్‌గ్రౌండ్ తనిఖీ ఫీజు,” లేదా “మిశ్రమ ఫీజు” పేరుతో వచ్చే అభ్యర్థనల పట్ల అప్రమత్తంగా ఉండండి. 
  3. నిజమైన ఆఫర్లుగా చూపించడం: తక్కువ ప్రయత్నం లేదా తక్కువ విద్యార్హతలతో ఎక్కువ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు లాంటి అబద్ధపు ప్రమాణాలతో ఉద్యోగార్థులను మోసగాళ్లు అనేక సందర్భాల్లో దోచుకుంటున్నారు. 
  4. నకిలీ ఇమెయిల్ చిరునామాలు: ఇమెయిల్ చిరునామాలను ఎప్పుడూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. స్వల్ప మార్పులతో అదనపు అక్షరాలు, సంఖ్యలు లేదా సాధారణంగా కనిపించని డొమైన్ పేర్లు లాంటి వాటికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. 
  5. త్వరగా చర్య తీసుకోవాలని ఒత్తిడి: ఆలోచించడానికి లేదా మీ వైపున పరిశోధించడానికి తగినంత సమయం ఇవ్వకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తొందరపెడితే, అది స్కామ్ కావచ్చు. 
  6. ప్రొఫెషనల్ తరహాలో లేని కమ్యూనికేషన్: మోసగాళ్ల మాటల్లో సరైన వ్యాకరణం ఉండదు. భాష విచిత్రంగా ఉంటుంది. సాదాసీదా భాష (మీ పేరుకు బదులు “డియర్ క్యాండిడేట్” అని సంబోధించడం లాంటివి) ను ప్రయోగిస్తారు. దీన్ని బట్టి ఆ ఆఫర్ నకిలీవని అర్థం చేసుకోవచ్చు.

మనల్ని మనం రక్షించుకోవడం ఎలా

ఉద్యోగ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, కింది చిట్కాలను అనుసరించండి:

  • కంపెనీని పరిశోధించండి: కంపెనీ గురించి ఆన్ లైన్ లో వివరాలు ఉన్నాయా అని చూడండి. వారి అధికారిక వెబ్ సైట్ ను వెరిఫై చేయండి. ఉద్యోగ ఆఫర్ చట్టబద్ధతను నిర్ధారించుకోవడానికి అధికారిక కమ్యూనికేషన్ ద్వారా వారిని సంప్రదించండి.
  • ఉద్యోగం కోసం డబ్బు చెల్లించవద్దు: గుర్తింపు పొందిన యాజమాన్య సంస్థలు ఉద్యోగం కోసం లేదా వేతనం ప్రాసెసింగ్ కోసం డబ్బు కోరదు. మిమ్మల్ని డబ్బు కోరితే, అది మోసానికి స్పష్టమైన సంకేతం కావచ్చు.
  • నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించండి: కంపెనీలు నిజమైన ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేస్తాయని బాగా తెలిసిన ఉద్యోగ బోర్డులు, కెరీర్ ప్లాట్‌ఫామ్‌లకు మాత్రమే కట్టుబడండి. చట్టబద్ధతను వెరిఫై చేయడం కష్టమైనట్టుగా చెప్పే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండండి.
  • ఇమెయిల్ డొమైన్ చెక్ చేయండి: ఇమెయిల్ చిరునామాను పూర్తిగా పరిశీలించి, అది కంపెనీ అధికారిక డొమైన్ నుండి వచ్చాయా అని నిర్ధారించుకోండి.
  • మీ అంతరాత్మను నమ్మండి: ఉద్యోగ ఆఫర్ గురించి మీ మనసుకు ఏదైనా ఫీలింగ్ కలిగితే, దానిని ఒక హెచ్చరికగా భావించి, వదిలేయడం మంచిది. డబ్బును ముందుగా పంపాలని ఏ చట్టబద్ధమైన ఉద్యోగమూ కోరదు.

ముక్తాయింపు

ఉద్యోగ మోసాలు కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. అలాగే మోసగాళ్లు కూడా తమ కుయుక్తులను మరింత  హంగులతో ముందుకు తీసుకువస్తున్నారు. అధికారిక కంపెనీ డొమైన్లను పోలినట్టు ఉండే నకిలీ ఇమెయిల్ చిరునామాలు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని మోసపూరిత జాబ్ లిస్టింగ్ లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఉద్యోగార్థులు అప్రమత్తంగా, హెచ్చరికతో ఉండాలి. ప్రత్యేకించి, చాలా నిజమైనదిగా కనిపించే ఆఫర్లు లేదా ముందుగా పేమెంట్ చేయాలని వాటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.  ఏదైనా ఉద్యోగ ఆఫర్ చట్టబద్ధతను వెరిఫై చేసేందుకు ఎల్లప్పుడూ కాస్త సమయం తీసుకోండి. అలాగే ఈ మోసాల బారిన పడకుండా నివారించేందుకు మీ ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని బయటపెట్టకుండా చూసుకోండి. అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం ద్వారా, మీరు ఒక సురక్షితమైన ఉద్యోగ శోధన అనుభవాన్ని పొందడమే కాక, ఉద్యోగం కోసం మీరు పడే తపనను మోసగాళ్లు అవకాశంగా చేసుకుని, మిమ్మల్ని దోచుకోకుండా చూసుకోవచ్చు.

ఉద్యోగ మోసం బారిన పడినప్పుడు మీరు చేయాల్సినవి

PhonePeలో ఉద్యోగ మోసం బారిన పడినప్పుడు,  మీరు వెంటనే ఆ సమస్యను కింది మార్గాల్లో లేవనెత్తవచ్చు:

  1. PhonePe యాప్: Help/సహాయం విభాగానికి వెళ్లి, “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్‌ కింద మీ సమస్యను తెలపండి.
  2. PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు సమస్యను లేవనెత్తడానికి PhonePe కస్టమర్ కేర్ నంబర్‌ 80–68727374 / 022–68727374కు కాల్ చేయవచ్చు, ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ మీ కోసం టికెట్‌ను క్రియేట్ చేసి, మీ సమస్యకు పరిష్కారం చూపుతారు.
  3. వెబ్‌ఫామ్‌‌లో సబ్‌మిట్ చేయడం : మీరు PhonePe వెబ్‌ఫామ్‌ https://support.phonepe.com/కు వెళ్లి కూడా టికెట్‌ను లేవనెత్తవచ్చు.
  4. సోషల్ మీడియా: మీరు ఈ కింద పేర్కొన్న PhonePe సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా మోసపూరిత ఘటనలను రిపోర్ట్ చేయవచ్చు

ట్విటర్ — https://twitter.com/PhonePeSupport

ఫేస్‌బుక్‌ — https://www.facebook.com/OfficialPhonePe

5. ఫిర్యాదు పరిష్కారం: ఇదివరకే చేసిన ఫిర్యాదును పరిష్కరించమని కోరడానికి, మీరు https://grievance.phonepe.com/లోకి లాగిన్ అయ్యి, గతంలో పంపిన టికెట్ ఐడిని షేర్ చేయవచ్చు.

6. సైబర్ సెల్: చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి ఈ మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు లేదా సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ నంబర్ 1930కు కాల్ చేసి మీ సమస్యను తెలపవచ్చు.

ముఖ్య గమనిక — PhonePe ఎన్నడూ గోప్యమైన లేదా వ్యక్తిగతమైన సమాచారం కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే, PhonePeనుండి పంపుతున్నామని చెప్పే మెయిళ్లను పట్టించుకోవద్దు. మోసం చోటు చేసుకున్నట్టు మీకు ఎక్కడైనా అనుమానం ఏర్పడితే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading