Trust & Safety
వ్యాపార మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!
PhonePe Regional|2 min read|29 August, 2019
మోసగాళ్లు డబ్బును కొల్లగొట్టేందుకు ఎప్పుడూ కొత్త మార్గాలవైపు చూస్తూనే ఉంటారు. ఆన్ లైన్ లో షాపింగ్ చేసే వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతుండడంతో, వ్యాపార మోసాలు కూడా దానికి తగ్గట్టే పెరుగుతున్నాయి. ఈ బ్లాగ్ పోస్టులో మనం వ్యాపార మోసాలనుంచి రక్షించుకోవడం గురించి చర్చించనున్నాము.
ఒక ఉత్పత్తికోసం కొనుగోలుదారు ఆర్డర్ చేయడం, ఆన్‌లైన్ ద్వారా చెల్లించడం జరిగినా దానిని ఎప్పటికీ అందుకోలేకపోవడం గురించి మనం పదే పదే చదువుతూ, వింటూ ఉన్నాము. వ్యాపార మోసానికి ఇదో ఉదాహరణ!
మన డబ్బు దోచేందుకు ఈ మోసగాళ్లు ఎంతవరకైనా దిగజారుతారు. ఒక వ్యాపారి/విక్రేత ఆర్డర్ చేసేందుకు తగిన వస్తువులతో ఒక వెబ్‌సైట్ ను ఏర్పాటు చేస్తారు. కంపెనీ చిరునామా, ఫోన్ నంబర్, రద్దు విధానాలు, రిటర్న్, రీఫండ్లు, లావాదేవీలు జరిపేందుకు పేమెంట్ గేట్ వే అంటూ బూటకపు వివరాలను అందులో పొందుపరుస్తారు.
ఇక వర్తకుడు తన వినియోగదారులనుంచి పేమెంట్లను స్వీకరించడాన్ని ప్రారంభించేందుకు ఒక పేమెంట్ గేట్ వేతో చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడుతుంది. పేమెంట్ సేవలను అందించే ముందు వర్తకులపై పేమెంట్ గేట్ వేలు లేదా పేమెంట్ ప్రాసెసర్లు లోతుగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియలో పట్టుబదదాన్ని నివారించడం కోసం, వర్తకులు NEFT ద్వారా నగదును బదిలీ చేసుకోవడం కోసం ఒక వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను ఏర్పాటు చేసుకుంటారు. లేదా వర్తక QR కోడ్ బదులు వ్యక్తిగత కోడ్ ను ఉపయోగిస్తారు. ఈ మార్గంలో వర్తకుడు ఒక చట్టబద్ధమైన పేమెంట్ గేట్ వే గా భ్రమ కల్పిస్తారు. తన వ్యాపారాన్ని సామాజిక మాధ్యమాలలో ప్రమోట్ చేసి, వినియోగదారుల లావాదేవీల కోసం ఎదురు చూస్తారు.
ముఖ్య గమనిక: PhonePe నమోదు చేసుకున్న, క్రియాశీలకమైన మొబైల్ నంబర్లను కలిగిన వర్తకులను మాత్రమే తనవెంట తీసుకువస్తుంది. వ్యాపారులు కఠినమైన ధృవీకరణ ప్రక్రియకు, KYC డాక్యుమెంట్ తనిఖీలకు, పలు దఫాలుగా ఆకస్మిక దుకాణాల తనిఖీలకు గురి చేయబడుతారు. ఆ తర్వాతే PhonePe ద్వారా పేమెంట్లను స్వీకరించడాన్ని ప్రారంభించేందుకు వారు అనుమతించబడుతారు. PhonePeతో చెల్లించే సమయంలో మీకు హామీ లభిస్తుంది.
వ్యాపార మోసానికి సంబంధించిన చాలా సందర్భాల్లో పేమెంట్ చేసిన తర్వాత లేదా ఉత్పత్తి డెలివరీ తేదీ దాటిన తర్వాతే ఏదో తప్పు జరిగిందనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకుంటున్నారు. వారు సాధారణంగా వెబ్‌సైట్ వినియోగదారు సేవా విభాగాన్ని సంప్రదించి, మోసపూరిత వర్తకుడు తమ సొమ్మును దోచుకెళ్లిన సంగతిని గ్రహిస్తున్నారు.
కింది విషయాలను దృష్టిలో పెట్టుకుంటే, మీరు ఇలాంటి మోసాలను నివారించవచ్చు.
-అన్ని షాపింగ్ వెబ్‌సైట్లను నమ్మరాదు. వినియోగదారుల స్పందనలు, సమీక్షలతో పాటు కొనే ముందు (అందుబాటులో ఉంటే) వెబ్‌సైట్ సామాజిక మాధ్యమ పేజీని చదవండి.
– విశ్వసనీయమైన షాపింగ్ వెబ్‌సైట్లు మరియు వేదికల నుంచి మాత్రమే కొనండి
-మోసపూరిత వెబ్‌సైట్‌ల గురించి గూగుల్‌కు నివేదించండి.
-మీ డబ్బును తిరిగి పొందడానికి మోసపూరిత వెబ్‌సైట్లో డబ్బును చెల్లించడానికి ఉపయోగించిన డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా( UPI)పై ఛార్జ్‌బ్యాక్ దాఖలు చేయండి.