Trust & Safety
Twitterలో జరిగే మోసాలనుంచి మిమ్మల్ని రక్షించుకోండి — నకిలీ హెల్ప్‌లైన్ నెంబర్లతో తస్మాత్ జాగ్రత్త!
PhonePe Regional|1 min read|19 April, 2021
Twitter అనేది ఒక సామాజిక మాధ్యమ వేదిక. కస్టమర్లకు దగ్గరై, వారి సమస్యలను పరిష్కరించడానికి ఒకానొక అత్యుత్తమ మార్గంగా నిలుస్తోంది. స్పందన వెంటనే వస్తుంది. వినియోగదారులు కూడా ఇందులో పోస్ట్ చేసిన సమాచారాన్ని విశ్వసిస్తారు.
అయినప్పటికీ, నకిలీ Twitter ఖాతాల ద్వారా వచ్చే మోసం కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి.
Twitterలో జరిగే మోసాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి:
-PhonePe వినియోగదారులు కంపెనీ యొక్క అసలు హ్యాండిల్: https://twitter.com/PhonePe ను ఉపయోగించి, ఆఫర్ల రిడెంప్షన్, క్యాష్‌బ్యాక్ అందుకోవడం, నగదు బదిలీలు, రీఫండ్లను ప్రారంభించడం, PhonePeలో తమ బ్యాంకు ఖాతాను లింక్ చేయడం తదితరాలకు సంబంధించిన సమస్యల గురించి ట్వీట్ చేస్తారు.
-వారు ఏమేం పోస్ట్ చేస్తున్నారనే విషయాన్ని పసి గడుతున్న మోసగాళ్లు వెంటనే దానికి స్పందిస్తారు. నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లను ట్వీట్ చేసి, PhonePe హెల్ప్‌లైన్ నెంబర్లు అని చెబుతూ ట్వీట్ చేయడం ద్వారా యూజర్ ఖాతా నుంచి డబ్బును చోరీ చేయడం ఎక్కువగా జరుగుతోంది.
– ఇది తెలియక పోవడంతో, మోసగాళ్లు ట్వీట్ చేసే నకిలీ హెల్ప్‌లైన్ నెంబర్లకు కస్టమర్లు కాల్ చేసి, తాము క్యాష్‌బ్యాక్ అందుకోలేదని నివేదించడమో లేదా విఫలమైన లావాదేవీకి రీఫండ్‌ను అభ్యర్థించడమో చేస్తారు.
– ఈ సమస్యను పరిష్కరించే సాకుతో, కస్టమర్ల కార్డు వివరాలు, వారి ఫోన్‌కు అందుకునే OTP వివరాలు లాంటి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కస్టమర్లను మోసగాళ్లు కోరుతారు.
– కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునేందుకు, మోసగాళ్లు తమ నెంబర్ నుంచి కస్టమర్ నెంబర్‌కు ఒక వసూలు పిలుపు (నగదు అభ్యర్థన)ను కూడా లేవనెత్తుతారు. వారికి క్యాష్‌బ్యాక్ ఇస్తామని కూడా హామీ ఇస్తారు.
– కస్టమర్లు తమ కార్డు వివరాలు, OTPని పంచుకున్న వెంటనే లేదా వసూలు పిలుపును అంగీకరించిన వెంటనే కస్టమర్ ఖాతానుంచి మోసగాళ్ల ఖాతాకు డబ్బు బదిలీ జరిగిపోతుంది.
ముఖ్య గమనిక- PhonePe ఎన్నడూ రహస్యమైన లేదా వ్యక్తిగతమైన వివరాలు కోరదు. Phonepe ప్రతినిధి అని చెప్పుకుని ఎవరైనా అలాంటి వివరాలను కోరితే, దయచేసి, మీకు ఇమెయిల్ పంపాలని కోరండి. అంతేకాక, @phonepe.com డొమైన్ నుంచి వచ్చే ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.
మీరు ఎలా సురక్షితంగా ఉండవచ్చో తెలుసుకోండి:
వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లోని మా అధికారిక ఖాతాలలో మాత్రమే మాతో కనెక్ట్ కండి.
● Twitter హ్యాండిల్స్: https://twitter.com/PhonePe
● https://twitter.com/PhonePeSupport
● ఫేస్‌బుక్: https://www.facebook.com/OfficialPhonePe/
● వెబ్: support.phonepe.com
మీ కార్డు లేదా ఖాతా వివరాలు ఎవరికైనా తెలిసిందనే అనుమానం ఏర్పడితే:
- [email protected]కు నివేదించండి.
- మీ సమీపంలో ఉన్న సైబర్ సెల్‌ను సంప్రదించి, పోలీసు ఫిర్యాదును దాఖలు చేయండి.