Trust & Safety
మీ గుర్తింపును కాపాడుకోండి, ఆధార్ కార్డు మోసాలను అరికట్టండి
PhonePe Regional|2 min read|19 August, 2024
ఆధార్, ప్రపంచంలోని అతిపెద్ద బయోమెట్రిక్ వ్యవస్థ, భారతీయులు తమ బయోమెట్రిక్, జనాభా సమాచారంతో స్వచ్ఛందంగా 12-అంకెల ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశం ఇస్తుంది.
బ్యాంక్ అకౌంట్ తెరవడానికి, పాస్‌పోర్ట్ పొందడానికి, సబ్సిడీలను పొందేందుకు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయడానికి, తదితర పనులకు ఆధార్ సులభమైన ప్రమాణీకరణను అందిస్తుంది. ఆధార్ మొబైల్ నంబర్లతో కూడా అనుసంధానించబడి ఉంది, రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఆర్థిక సంస్థలు దీనిని గుర్తింపు రూపంగా అంగీకరిస్తాయి.
ఆధార్ అత్యంత ఉపయోగకరమైన లక్షణాల్లో ఒకటి OTP వెరిఫికేషన్, ఇది వ్యక్తులకు ఎక్కడి నుండి అయినా తమను తాము సులభంగా ప్రామాణీకరించడానికి అనుమతిస్తుంది.
సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, సులభతరం చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రక్రియలు, తమ గుర్తింపును కాపాడేందుకు సరైన సమాచారం లేని వ్యక్తుల డేటాను అనవసరంగా వెల్లడించగలవు.
ఈ బ్లాగులో, ఆధార్ నంబర్లు మరియు బ్యాంకు అకౌంట్ల మధ్య ఉన్న అనుసంధానాన్ని మోసగాళ్లు ఎలా దుర్వినియోగం చేసుకుంటారు, దుర్వినియోగపు లావాదేవీలు చేయడం లేదా డబ్బుని చోరీ చేయడం ఎలా జరుగుతుందో సవివరంగా చూపిస్తాము.
ఆధార్ సంబంధిత సాధారణ UPI మోసపూరిత పద్ధతులు
- ఫిషింగ్ దాడులు: ఫిషింగ్ అనేది మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగులు లేదా పేమెంట్స్ యాప్ నిపుణులుగా నటించి, అమాయకులను తమ వ్యక్తిగత వివరాలను వెల్లడించమని నమ్మబట్టించేందుకు ఉపయోగించే మోసపూరిత పద్ధతి. ఆధార్-సంబంధిత మోసాలలో, మోసగాళ్లు వినియోగదారుల ఆధార్ వివరాలు లేదా UPI పిన్ అప్‌డేట్ చేయమని మెసేజ్‌లు లేదా ఇమెయిల్స్ పంపిస్తారు. అటువంటి సందర్భాలలో, ఈ సందేశాల్లో ఉన్న నకిలీ లింకులు మీ సున్నితమైన సమాచారాన్ని సంగ్రహించడానికి తయారుచేయబడినవి.
- విషింగ్ కాల్స్: ఫిషింగ్ లాంటి మరో మోసపూరిత పద్ధతి విషింగ్, మోసగాళ్లు బ్యాంకు లేదా UIDAI నుండి వచ్చామంటూ వ్యక్తులుగా కాల్ చేసి అకౌంట్ వెరిఫికేషన్ లేదా సమస్య పరిష్కారం సాకుతో, ఆధార్ నంబర్లు, UPI పిన్‌లు లేదా OTPలను అడుగుతారు.
- సిమ్ స్వాప్ మోసం: మోసగాళ్లు బాధితుని ఫోన్ నంబరుతో నకిలీ సిమ్ కార్డును పొందుతారు, UPI లావాదేవీల కోసం పంపిన OTPలను అందుకొని, అనుసంధానించబడిన బ్యాంకు అకౌంట్లలోకి ప్రవేశిస్తారు.
- నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లు: మోసగాళ్లు నిజమైన UPI పేమెంట్ సేవలను నకలుచేసే యాప్‌లు లేదా వెబ్‌సైట్లు క్రియేట్ చేసి, ఆధార్, బ్యాంకు వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తారు.
ఆధార్ మోసం నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి
- వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి: మీ ఆధార్ నంబర్, UPI పిన్, OTP లేదా బ్యాంకు వివరాలను ఫోన్, ఇమెయిల్, లేదా SMS ద్వారా ఎవరితోనూ పంచుకోకండి.
- ప్రామాణికతను వెరిఫై చేయండి: మీ బ్యాంక్ లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ నుండి వచ్చిన ఏదైనా సందేశం యొక్క ప్రామాణికతను ఎల్లప్పుడూ వెరిఫై చేయండి. అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి లేదా కస్టమర్ సేవను నేరుగా సంప్రదించండి.
- మీ మొబైల్ నంబర్‌ను సురక్షితంగా ఉంచండి: మీ ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానమైన మొబైల్ నంబర్ సురక్షితంగా ఉండేలా చూసుకోండి. సిమ్ స్వాప్ అభ్యర్థనలపై జాగ్రత్త వహించండి, పోయిన సిమ్ కార్డులను వెంటనే రిపోర్ట్ చేయండి.
- విశ్వసనీయ యాప్‌లను ఉపయోగించండి: ఇండస్ యాప్‌స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ వంటి వెరిఫై చేయబడిన మూలాధారాల నుండి మాత్రమే అధికారిక మరియు విశ్వసనీయ UPI యాప్‌లను ఉపయోగించండి.
- లావాదేవీలను పర్యవేక్షించండి: ఏదైనా అనధికార కార్యకలాపాల కోసం మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు మరియు UPI లావాదేవీ చరిత్రను క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయండి.
- అలెర్ట్‌లను ఎనేబుల్ చేయండి: మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా కార్యాచరణ గురించి తెలియజేయడానికి SMS లేదా ఇమెయిల్ ద్వారా లావాదేవీ అలెర్ట్‌లను సెటప్ చేయండి.
ఆధార్-సంబంధిత UPI మోసాలను ఎలా రిపోర్ట్ చేయాలి
మీరు ఆధార్, UPI పేమెంట్‌లకు సంబంధించి ఏదైనా మోసపూరిత కార్యకలాపాన్ని అనుమానించినట్లయితే:
- మీ బ్యాంక్‌ను సంప్రదించండి: మీ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడానికి, తదుపరి అనధికార లావాదేవీలను నిరోధించడానికి వెంటనే మీ బ్యాంక్‌కి తెలియజేయండి.
- UIDAIకి రిపోర్ట్ చేయండి: మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం అయినట్లయితే UIDAIకి తెలియజేయండి. మీరు వారి అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా వారిని సంప్రదించవచ్చు.
- ఫిర్యాదు చేయండి: మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు, సైబర్ నేరాల అధికారులకు రిపోర్ట్ చేయండి. మీరు జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
మీరు ఆధార్ కార్డ్ మోసానికి గురైనట్లయితే PhonePeలో సమస్యను ఎలా లేవనెత్తాలి
ఒకవేళ మీరు PhonePe ద్వారా మోసపోయినట్లయితే, మీరు వెంటనే ఈ క్రింది మార్గాల్లో సమస్యను లేవనెత్తవచ్చు:
- PhonePe యాప్: సహాయ విభాగానికి వెళ్లి, “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్ కింద సమస్యను లేవనెత్తండి
- PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు సమస్యను లేవనెత్తడం కోసం PhonePe కస్టమర్ కేర్ విభాగాన్ని 80–68727374 / 022–68727374లో సంప్రదించవచ్చు. ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ టికెట్టు లేవనెత్తి, మీ సమస్య విషయంలో సహాయం చేస్తారు.
- వెబ్ ఫారం సమర్పణ: PhonePe వెబ్ ఫారం ఉపయోగించి మీరు టికెట్ లేవనెత్తవచ్చు, https://support.phonepe.com/
- సోషల్ మీడియా: PhonePe సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా మోసపూరిత సంఘటనలపై ఫిర్యాదు చేయవచ్చు.
ట్విటర్ — https://twitter.com/PhonePeSupport
ఫేస్‌బుక్ — https://www.facebook.com/OfficialPhonePe
- గ్రీవెన్స్: ప్రస్తుతమున్న మీ సమస్య గురించి ఫిర్యాదు చేయడానికి, మీరు https://grievance.phonepe.com/కు లాగిన్ అయి, గతంలో లేవనెత్తిన టికెట్ ఐడిని షేర్ చేయండి.
- సైబర్ సెల్: చివరగా, మీరు మీకు సమీపంలోని సైబర్ సెల్ వద్ద మోసానికి సంబంధించిన ఫిర్యాదులను నివేదించవచ్చు. లేదా https://www.cybercrime.gov.in/లో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు లేదా సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను 1930లో సంప్రదించవచ్చు.