Trust & Safety
SIM మార్పిడీ మోసం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి
PhonePe Regional|2 min read|29 August, 2019
మీ బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకుంటూ మీకు అదివరకు తెలియని నంబర్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు అప్పుడే అందుకున్న OTPని పంచుకోవాలని ఒక SMS సందేశం కోరుతారు. మీ నగదును కాజేసేందుకు మోసగాళ్లు అనేక మార్గాలను నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు. మోసగాళ్లు ఉపయోగించే వివిధ రకాల మోసాల గురించి అవగాహన కల్పించడంలో ఈ కథనం మీకు సహాయపడుతుంది. కాబట్టి అవకతవకలకు ప్రయత్నిస్తున్న సంకేతాలను మీరు గుర్తుంచుకుని, వాటిని నివారించవచ్చు.
మోసాలు, వినియోగదారు భద్రతపై సాగుతున్న పరంపరలో భాగంగా మేము వివిధ రకాల అవకతవకలు, మోసాల గురించి కథనాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాము.
SIM మార్పిడీ మోసం అంటే ఏమిటి?
SIM మార్పిడీ మోసం అంటే మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను ఉపయోగించుకుని, మీ ఫోన్ నంబర్ కోసం ఒక కొత్త SIMను జారీ చేయించుకుంటారు. ఇలా చేయడం ద్వారా, వారు మీ బ్యాంకు ఖాతానుంచి పేమెంట్లు చేసేందుకు అవసరమైన అధికారాన్ని ఇచ్చేలా OTPలకు ప్రాప్యతను అందుకుంటారు.
అంటే ప్రాథమికంగా మోసగాళ్లు మీ OTPలను ఉపయోగించుకుని, మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు చోరీ చేయడానికి వీలు కలుగుతుందని అర్థం.
ముఖ్య గమనిక — PhonePe ఎన్నడూ మీ రహస్య లేదా వ్యక్తిగత వివరాలను కోరదు. phonepe.com డొమైన్ నుంచి వస్తే తప్పించి, PhonePe నుంచి పంపుతున్నట్టుగా చెప్పుకునే ఏ మెయిల్ నూ పట్టించుకోవద్దు. మోసం జరుగుతున్నట్టు మీకేమైనా అనుమానం కలిగితే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించగలరు.
SIM మార్పిడీ మోసం ఎలా జరుగుతుంది?
- మీ మొబైల్ ఆపరేటర్‌కు చెందిన ప్రతినిధిగా చెప్పుకుంటూ మోసగాడు మీకు కాల్ చేస్తారు. మీ నెట్‌వర్క్ ను అప్‌గ్రేడ్ చేయడం కోసం ఒక SMS పంపాలని కోరుతారు. ఈ SMS ఒక కొత్త SIM వెనుకవైపున ఉన్న 20 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. మీ రహస్య బ్యాంకు వివరాలను కూడా వారు కోరుతారు.
- ఈ SMS మీ ప్రస్తుత SIMను నిష్క్రియం చేసి, మోసగాళ్లు చట్టవిరుద్ధంగా సంపాదించుకున్న డూప్లికేట్ SIMను సక్రియం చేస్తుంది. దీంతో మీ SIM పని చేయడం మాని, కనెక్టివిటీని పూర్తిగా కోల్పోతుంది.
- మోసగాళ్లు మీ ఫోన్ నంబర్, SMSలను అందుకోగలుగుతారు. అలాగే నగదు బదిలీని ప్రారంభించడంకోసం మీ బ్యాంకు వివరాలను ఉపయోగిస్తారు.
- నగదు బదిలీకోసం మోసగాళ్లు OTPని అందుకుంటారు. ఇప్పుడు దానిని చదివి, మీ ఖాతానుంచి డబ్బును వారి సొంత ఖాతాకు బదిలీ చేసుకుంటారు.
ఎలాంటి కారణం లేకుండా నిర్ణీత కాలవ్యవధికి మీ ఫోన్ మొబైల్ కనెక్టివిటీని కోల్పోతే, ఏదో తప్పు జరిగినట్టు భావించాలి. అలా జరిగితే, దయచేసి మీ మొబైల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
మీరు సురక్షితంగా ఉండేందుకు అవలంబించాల్సిన విధానం:
- మీ బ్యాంకు వివరాలను (కార్డు సంఖ్య, గడువు తేదీ, పిన్) ఎన్నడూ ఎవరితోనూ పంచుకోవద్దు.
- మీ బ్యాంకు నుంచి లేదా మీ మొబైల్ ఆపరేటర్ నుంచి పంపుతున్నట్టు ఏదేని మెయిల్ కమ్యూనికేషన్ లేదా SMSలను మీరు అందుకుంటే, అవి అధికారిక SMS హ్యాండిల్/ఇ-మెయిల్ చిరునామా నుంచి పంపబడినవా అని సరిచూసుకోండి.
- SMS ద్వారా అందుకునే OTPలను కానీ మరే ఇతర కోడ్లను కానీ ఎవరితోనూ ఎన్నడూ పంచుకోవద్దు.
- మీ ఖాతానుంచి జరిపే లావాదేవీల ట్రాక్ ను భద్రం చేసుకోవడం కోసం ఇమెయిల్ & SMS అలెర్ట్ లను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
- అవకతవకలను పరిశీలించడంకోసం మీ బ్యాంకు లావాదేవీ చరిత్ర క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది.
మా పరంపరలో తర్వాతి కథనం కోసం వేచి చూడండి!
సురక్షితంగా లావాదేవీ జరపడంపై రూపొందించిన వీడియోను చూడండి: https://youtu.be/I2GNsUAS0GY