Trust & Safety
KYC మోసం & దానినుంచి కాపాడుకునే విధానం
PhonePe Regional|2 min read|30 April, 2021
KYCని త్వరగా పూర్తి చేసుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా, చాలామంది వినియోగదారులు ఈ KYC మోసానికి గురవుతుంటారు. ఈ మోసానికి బలైన ఒక బాధితుడి కథ తెలుసుకుందాం రండి.
రోహన్‌కు ఒక కాల్ వచ్చింది. KYCని పూర్తి చేశారా అని రోహన్‌ను ఆ కాలర్ అడిగారు. KYC పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను గురించి మాట్లాడిన ఆ కాలర్ దానిని ఎందుకు ఆలస్యం చేయరాదో అనేందుకు కారణాన్ని కూడా వివరించారు. ఆ తర్వాత ఒక చిన్న మొత్తంలో ఫీజు చెల్లిస్తే, రోహన్ తరపున తానే నేరుగా KYC ప్రక్రియను పూర్తి చేస్తామని ఆఫర్ చేశారు.
తర్వాత, ఆ కాలర్ రోహన్‌ను తన పూర్తి పేరు, ఇతర వ్యక్తిగత వివరాలను అడిగారు. KYC ప్రక్రియను ప్రారంభించడానికి ఇది కావాలని చెప్పారు. ఈ తరుణంలోనే తన KYC త్వరగా పూర్తవుతుందని రోహన్ పూర్తిగా సంతృప్తి చెందారు. కాల్ కొనసాగుతున్న సందర్భంలో, మోసగాడు ‘ఎనీ డెస్క్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయనను కోరాడు. తద్వారా తాను దూరం నుంచే KYC ప్రక్రియను పూర్తి చేయగలనన్నారు. ఆ తర్వాత తన ఫీజుకు సంబంధించి ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తాన్ని బదిలీ చేయాలని రోహన్‌ను కాలర్ కోరారు. రోహన్ అలాగే చేశారు. దీంతో త్వరలోనే KYC పూర్తయినట్టు నిర్ధారణ సందేశం వస్తుందని రోహన్‌కు కాలర్ హామీ ఇచ్చారు. అయితే, రోహన్ ఆ కాల్‌ను కట్ చేసినప్పుడు, అతనికి రెండు సందేశాలు కనిపించాయి. ఒకటేమో తన లావాదేవీ గురించి తెలుపుతూ వచ్చిన OTP కాగా, మరో సందేశం తన ఖాతా నుంచి రూ. 30,000 డెబిట్ అయిన సమాచారాన్ని తెలిపిన నోటిఫికేషన్!
ఇక్కడ ఏం జరిగిందో తెలుసా:
మోసగాడు రోహన్‌ను డౌన్‌లోడ్ చేయాలని కోరిన యాప్ స్క్రీన్ షేరింగ్ యాప్. రోహన్ ఫోన్ స్క్రీన్‌లో జరిగిన అన్ని కార్యకలాపాలను చూసేందుకు మోసగాడిని ఆ యాప్ అనుమతించింది.
రోహన్ తన ఫీజును బదిలీ చేసినప్పుడు ఉపయోగించిన ఆయన బ్యాంకు ఖాతా, కార్డు నెంబర్లను, పిన్, పాస్‌వర్డ్‌లతో పాటు మోసగాడు చూశాడు.
ఆ తర్వాత మోసగాడు ఈ వివరాలను ఉపయోగించి, తన సొంత ఖాతాలోకి డబ్బును బదిలీ చేసుకున్నాడు. ఎనీ డెస్క్ యాప్‌ను రోహన్ ఇన్‌స్టాల్ చేసినందున ఆయన ఫోన్ స్క్రీన్‌లో మోసగాడికి అవసరమైన OTP కూడా కనిపించింది.
దయచేసి గుర్తుంచుకోండి: కాల్ చేయడం ద్వారా లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా KYC చేయడం సాధ్యం కాదు. మిమ్మల్ని మోసపుచ్చడం కోసం మోసగాళ్లు మీ ప్రస్తుత బ్యాంకు KYCని కూడా చెప్పవచ్చు లేదా డిజిటల్ వాలెట్ చెల్లుబాటు కావడం లేదని, తాము ఆన్‌లైన్‌లో తిరిగి చెల్లుబాటు చేస్తామని చెప్పవచ్చు. ఇది కూడా వీలుకాని పనే.
- కాలర్‌తో ఎన్నడూ మీ బ్యాంకు ఖాతా, కార్డు లేదా ఏదైనా ఇతర వివరాలను పంచుకోవద్దు.
- ఎవరైనా కాలర్ అభ్యర్థన మేరకు ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్, లేదా స్క్రీన్ షేర్ లాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. ఈ యాప్‌లు మోసగాళ్లను మీ పాస్‌వర్డ్‌లు, పిన్‌లు మరియు ఇతర ముఖ్యమైన వివరాలను చూసేందుకు అనుమతిస్తాయి.
- నమ్మకమైన PhonePe ప్రతినిధులు ఎన్నడూ ఫోన్‌లో మీ KYC చేసేందుకు కాల్ చేయడం లేదా థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని కోరరు.
ఈ మోసాల నుంచి సురక్షితంగా ఉండేందుకు గుర్తుంచుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం రండి:
PhonePe ఎన్నడూ మీ గోప్యమైన వివరాలను కోరదు. PhonePe ప్రతినిధులమని చెప్పుకుని ఎవరైనా ఇలాంటి వివరాలను ఇవ్వాలని మిమ్మల్ని కోరితే, దయచేసి ఇమెయిల్ పంపాలని వారిని కోరండి. అలాగే @phonepe.com డొమైన్ నుంచి వచ్చిన ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.
- గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితరాలలో PhonePe వినియోగదారు సేవా విభాగం నెంబర్లకోసం శోధించవద్దు. PhonePe వినియోగదారు సేవా విభాగాన్ని సంప్రదించడానికి ఏకైక మార్గం support.phonepe.comకు వెళ్లడమే.
- PhonePe సేవా విభాగం అని చెప్పుకునే ధృవీకరించని మొబైల్ నెంబర్లకు ఎన్నడూ కాల్ చేయడం కానీ, స్పందించడం కానీ చేయవద్దు.
- వివిధ సామాజిక మాధ్యమ వేదికలలో మా అధికారిక ఖాతాలలో మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.
ట్విట్టర్ హ్యాండిల్స్: https://twitter.com/PhonePe
https://twitter.com/PhonePeSupport
– ఫేస్‌బుక్ ఖాతా: https://www.facebook.com/OfficialPhonePe/ - మీ కార్డు లేదా ఖాతా వివరాలు బయటపడితే,:
– support.phonepe.comకు నివేదించండి.
– మీ సమీపంలో సైబర్ సెల్‌ను సంప్రదించి, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
సురక్షితంగా లావాదేవీలు జరపడం గురించిన వీడియోను చూడండి: https://youtu.be/VbfhRK23BQU