Trust & Safety
EMI మోసాలనుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
PhonePe Regional|2 min read|04 May, 2021
రుణ గ్రహీతలు మూడు నెలల వరకు EMI/క్రెడిట్ కార్డు పేమెంట్లను వాయిదా వేసుకునేందుకు అనుమతించే రీతిలో RBI ఇటీవల ఒక మారటోరియంను జారీ చేసింది. తమ రీపేమెంట్ షెడ్యూల్‌లో చేసిన ఈ మార్పుల వల్ల రుణాల రీపేమెంట్ నుంచి వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం కోసం మోసగాళ్లు చురుగ్గా రంగంలో దిగారు. బ్యాంకు ప్రతినిధులమని చెప్పుకుంటూ, మారటోరియం అందుకునే విషయంలో తాము సాయం చేస్తామని ముందుకు వస్తుండడంతో EMI మోసాలు బాగా పెరిగాయి.
వారు అనుసరించే మార్గాల గురించి తెలుసుకుందాం రండి:
సన్నివేశం 1:’మీ బ్యాంకు ప్రతినిధి అని చెబుతూ, ఒక వ్యక్తి మీకు కాల్ చేస్తారు. ఆ నకిలీ బ్యాంకు ప్రతినిధి మీ EMIను వాయిదా వేయించే క్రమంలో మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, CVVని పంచుకోవాలని మిమ్మల్ని కోరుతారు. మీరు ఈ వివరాలను పంచుకున్న వెంటనే, ఆ మోసగాడు ఒక లావాదేవీని ప్రారంభించి, మీ ఫోన్‌కు పంపిన OTPని అందించాలని కోరుతారు. మీరు ఈ OTPని పంచుకుంటే చాలు. మీ డబ్బు మాయమైనట్టే.
సన్నివేశం 2: బ్యాంకు ప్రతినిధినని చెప్పుకునే ఒక మోసగాడు మీ EMI పొడిగించబడిందని చెప్పి, ఆ పొడిగింపును అంగీకరించడం కోసం ఒక లింక్ పైన క్లిక్ చేయమని సూచిస్తారు లేదా PhonePe యాప్‌ను నేరుగా తెరవమంటారు. మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నోటిఫికేషన్ ఐకాన్‌లో అందుకున్న అభ్యర్థనను అంగీకరించాలని మిమ్మల్ని కూడా వాళ్లు కోరవచ్చు. కొన్ని సందర్భాల్లో, రుణం EMIను వాయిదా వేయడానికి అభ్యర్థనను ఆమోదించండి.” అనే సందేశంతో పాటు బ్యాంకుల పేర్లు, లోగోలను కూడా మోసగాళ్లు ఉపయోగించవచ్చు. మీరు ఈ అభ్యర్థనను ఆమోదించిన వెంటనే, మీ డబ్బు మాయమవుతుంది.
సన్నివేశం 3: మీ EMIను పే చేయనందుకు మీనుంచి ఛార్జి వసూలు చేయబడుతుందని ‘బ్యాంకు అధికారి’ చెబుతారు. అతను మీకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్టు నటిస్తూ, ఎనీ డెస్క్ యాప్ లేదా మరేదైనా స్క్రీన్ షేరింగ్ యాప్‌లను పంచుకోవాలని కోరుతారు. మీ సాధనాన్ని దూరం నుంచి యాక్సెస్ చేసుకోవడం ద్వారా ఆ మోసగాడైన బ్యాంకు అధికారి మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యొక్క పిన్ మరియు పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసుకుంటారు. తద్వారా మీ ఖాతా వివరాలను తెలుసుకుంటారు. ఇప్పుడు మీ డబ్బు మోసగాడి చేతిలో ఉంటుంది.
దయచేసి బ్యాంకు ప్రతినిధులమని చెప్పుకుని, పైన వివరించిన సన్నివేశాలను ఉపయోగించి, సేవలను అందిస్తామని ముందుకువచ్చే అపరిచిత కాలర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. PhonePe ద్వారా మీ EMIలను బ్యాంకులు పొడిగించలేవని గమనించండి. అంతేకాక, EMIలను వాయిదా వేసేందుకు OTPని పంచుకోవడం లేదా మీ UPI పిన్ ను ప్రవేశపెట్టడం లాంటివి అవసరం ఉండదు.
మీరు సురక్షితంగా ఉండడం ఎలాగే తెలుసుకుందాం రండి:
- కార్డు నెంబర్, CVV, ముగింపు తేదీ, పిన్, లేదా OTP లాంటి రహస్యమైన వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. PhonePe ప్రతినిధి అని చెప్పుకుని ఎవరైనా అలాంటి వివరాలను కోరితే, దయచేసి మీకు ఒక ఇమెయిల్ పంపాలని వారిని కోరండి. @phonepe.com డొమైన్ నుంచి వచ్చే ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.
- అన్ని బ్యాంకు ఇమెయిళ్లు ఒక సురక్షితమైన https డొమైన్ నుంచి మాత్రమే వస్తాయి. [XYZ]@gmail.com లేదా మరేదైనా ఇతర ఇమెయిల్ సేవా సంస్థ డొమైన్ నుంచి వచ్చే ఇమెయిళ్లను పట్టించుకోవద్దు.
- PhonePeలో డబ్బు అందుకోవడం కోసం మీరు ‘పే’ చేయాల్సిన లేదా మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
- ‘పే’ను క్లిక్ చేయడం లేదా మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టే ముందు మీ PhonePe యాప్‌లో ప్రదర్శించిన సందేశాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా చదవండి.
- ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూయర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవడం చేయవద్దు.
- గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాలలో PhonePe వినియోగదారు సేవా విభాగం నెంబర్ల కోసం శోధించవద్దు. PhonePe వినియోగదారు సేవా విభాగాన్ని సంప్రదించడానికి ఏకైక మార్గం https://phonepe.com/en/contact_us.html కు వెళ్లడమే.
- PhonePe సేవా విభాగంగా చెప్పుకునే ధృవీకరించని మొబైల్ నెంబర్లకు ఎన్నడూ కాల్ చేయడం కానీ, స్పందించడం కానీ చేయవద్దు.
మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరు ఏం చేయాలి?
- వెంటనే మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ కేంద్రానికి నివేదించండి. అలాగే పోలీసుల వద్ద సంబంధిత వివరాలతో (ఫోన్ నెంబర్, లావాదేవీ వివరాలు, కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా తదితరాలు)తో FIRను దాఖలు చేయండి.
- మీ PhonePe యాప్‌కు లాగిన్ అయి, ‘సహాయం’కు వెళ్లండి. ‘ఖాతా భద్రత సమస్య/మోసపూరిత కార్యకలాపాన్ని నివేదించు’ కింద మీరు మోసపూరిత సంఘటనను నివేదించండి.
- వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లోని మా అధికారిక ఖాతాలలో మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.
ట్విట్టర్ హ్యాండిల్స్: https://twitter.com/PhonePe
https://twitter.com/PhonePeSupport
ఫేస్‌బుక్ ఖాతా: https://www.facebook.com/OfficialPhonePe/
వెబ్: support.phonepe.com