PhonePe Blogs Main Featured Image

Trust & Safety

క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ మోసం

PhonePe Regional|2 min read|20 December, 2022

URL copied to clipboard

క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్లతో ముడిపడిన పేమెంట్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. డిజిటల్ మార్గంలో లావాదేవీలు జరిపే సమయంలో వినియోగదారుని అనుభవం, విశ్వాసంపై అవి ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, సాంకేతిక పురోగతి, అవగాహనతో, ఇలాంటి మోసాలను గుర్తించడం, నివారించడం చేయవచ్చు.

క్రెడిట్ బిల్ పేమెంట్ మోసంలో, బాధితుని బ్యాంక్ ఖాతా నుండి డబ్బును వినియోగించుకోవడం ద్వారా వారి ఖాతాలో క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయడంలో బాధితుడిని మోసగాళ్లు దోచుకుంటారు. తమ ఖాతాలోకి తమ క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితులే చేర్చేలా మోసగాళ్లు చేస్తారు. ఆ తర్వాత వారు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను పే చేస్తారు.

క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ మోసంలో బాధితుడిని మోసగించే విధంగా జరిగే అనేక సాధారణ సూచనలు కింద ఇవ్వబడ్డాయి.

క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ మోసం జరిగిందనడానికి సాధారణ సూచనలు

సన్నివేశం 1 : మోసగాళ్లు తమను సైనిక సిబ్బందిగా చూపించుకుంటూ, తమకు వైద్య, హోటల్, బీమా రంగాల్లో సేవలు కావాలని చెబుతారు. వారి మాటలకు మీరు లొంగితే, వెంటనే పేమెంట్ పద్ధతిని సెటప్ చేసుకోవాలని కస్టమర్లను కోరుతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని కేసుల్లో, కస్టమర్ల విశ్వాసాన్ని పొందడం కోసం ఆ మోసగాళ్లు సైనిక సిబ్బంది యూనిఫాంలో కూడా కనిపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో లక్ష్యానికి గురయ్యే వారు సాధారణంగా వ్యాపారస్తులు కావచ్చు.

సన్నివేశం 2 : మోసగాళ్లు తమను దూరపు బంధువులు/కుటుంబ స్నేహితులు లేదా వ్యాపార నిపుణులుగా చూపించుకుని, మోసగాళ్ల ఖాతాలోకి వారి కార్డు వివరాలను చేర్చేలా కస్టమర్లను ఒప్పిస్తారు. ఆ ప్రక్రియ చేసే విధానాన్ని ఫోన్ ద్వారా నేర్పిస్తామని చెప్పి కూడా నటిస్తారు. ఈ సన్నివేశంలో PhonePeను తరచుగా ఉపయోగించే కస్టమర్లే లక్ష్యం అవుతుంటారు.

ఈ కాల్ పూర్తి సంభాషణ మరియు పేమెంట్ వాట్సాప్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా మాత్రమే చోటు చేసుకుంటుంది. తద్వారా ఈ మోసగాళ్లు అంతా నిజాయితీగా సాగుతోందని చూపించుకుంటూ, అనేక కాల్ ల ద్వారా పొందే విశ్వాసాన్ని ఇలాంటి కాల్ ద్వారా సంపాదించుకుంటారు.

క్రెడిట్ కార్డ్ బిల్లు మోసాలను నివారించడం ఎలా:

  • PhonePeలో డబ్బు అందుకునేందుకు మీరు ఎన్నడూ పే చేయాల్సిన అవసరం కానీ, మీ UPI పిన్ ప్రవేశపెట్టడం కానీ అవసరం ఉండదని గమనించగలరు. ‘పే చేయి’ బటన్ ను నొక్కడం లేదా మీ UPI పిన్ ను ప్రవేశపెట్టే ముందు దయచేసి మీ PhonePe యాప్ లో ప్రదర్శించిన సందేశాన్ని చదవండి.
  • ఏదైనా కొత్త పేమెంట్ “పద్ధతి/ప్రక్రియ” గురించి ఎవరైనా చెబుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. సైనిక సిబ్బంది పేమెంట్ సిస్టం కూడా భారతదేశంలోని ఏదైనా ఇతర పేమెంట్ పద్ధతి తరహాలోనే పని చేస్తుందని తెలుసుకోండి.

మోసగాడు సంప్రదించినప్పుడు మీరు ఏం చేయాలి?

  • ఆ సంఘటన గురించి వెంటనే మీకు దగ్గర్లో ఉన్న సైబర్ క్రైమ్ సెంటర్ కు నివేదించి, సంబంధిత వివరాలు (ఫోన్ నెంబర్, లావాదేవీ వివరాలు, కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా తదితరాలు)ను పోలీసులకు అందించి, FIR దాఖలు చేయండి. దీనికి బదులు, మీరు — https://cybercrime.gov.in/ లింక్ ను కూడా ట్యాప్ చేయడం లేదా సైబర్ ఫిర్యాదును ఆన్ లైన్ లో ఫైల్ చేసేందుకు సైబర్ సెల్ పోలీసులను 1930 నెంబర్ లో సంప్రదించడం చేయవచ్చు.
  • PhonePe ద్వారా సంప్రదింపు జరిపినప్పుడు, మీ PhonePe యాప్ కు లాగిన్ అయి, ‘సహాయం.’కు వెళ్లండి. ‘ఖాతా భద్రత సమస్య/ మోసపూరిత కార్యకలాపాన్ని నివేదించండి’ కింద మోసపూరిత సంఘటనను మీరు నివేదించవచ్చు. దీనికి బదులు support.phonepe.com కు మీరు లాగిన్ కావచ్చు.

Keep Reading