
Milestones
మెరిసేదంతా బంగారం కాదు
PhonePe Regional|2 min read|30 August, 2019
ఫిబ్రవరి 2018లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI ) ప్రచురించిన BHIM UPI గణాంకాలు ఎప్పటిలాగే ఉత్సాహం నింపేదిగా కనిపిస్తున్నాయి. భారతదేశపు మొట్టమొదటి మరియు బ్యాంకింగ్ యేతర BHIM UPI యాప్ గా ఉన్నందున, BHIM UPI రోజురోజుకూ బలం పుంజుకుంటూ ముందుకెళ్లడం చూసి ఆనందిస్తున్నాము. గడచిన ఏడాది కాలంలో అసాధారణమైన రీతిలో అది సాధించిన ప్రగతి ఎవ్వరూ ఊహించనంత ఉన్నత శిఖరాలకు చేరుకుంది.
BHIM UPI ఆకస్మిక ఎదుగుదల వినియోగదారులు, మదుపుదారులు, మీడియా, పేమెంట్ల పరిశ్రమలాంటి వాటి దృష్టిని బాగా ఆకర్షించిన విషయం బోధపడుతోంది. హఠాత్తుగా ప్రతి ఒక్కరూ BHIM UPI బ్యాండ్ వాగన్ లో దూకడానికి పరుగులు పెడుతున్నారు. వాలెట్లకు BHIM UPI పరస్పర చర్య కావాల్సిందే. బ్యాంకులు కూడా కొత్త తరం మొబైల్ యాప్ లను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి. గూగుల్, అమేజాన్, వాట్సాప్ లాంటి ప్రపంచ దిగ్గజాలు భారతదేశంలో BHIM UPI- ఆధారిత పేమెంట్ సేవలను ఆవిష్కరిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఒక పేమెంట్ల యాప్ ను ఆవిష్కరించింది. ఇంకా చెప్పాలంటే, భారతదేశంలో BHIM UPI సృష్టించిన సాంకేతికత రాకెట్ ఆశించిన రీతిలో సత్ఫలితాలను ఇవ్వడమే కాక భారత వినియోగదారులకు మెరుగైన రీతిలో ఉపయోగపడుతోంది.

అయినప్పటికీ, ఇటీవలి మీడియా కథనం కేవలం BHIM UPI లావాదేవీ పరిమాణాలపై మాత్రమే దృష్టి సారించింది. మొత్తంగా చూస్తే అది సగం కథను మాత్రమే చెప్పింది. సమతుల్యమైన BHIM UPI స్కోర్ కార్డు అనేది లావాదేవీ పరిమాణాలతో పాటుగా మొత్త లావాదేవీలు, ప్రత్యేక వినియోగదారుల సంఖ్యతో పాటు సగటు లావాదేవీ విలువ (ATV), ఒక వినియోగదారుకు సగటు లావాదేవీ (ATPC)లను కూడా కలిగి ఉంటుంది.
అందుబాటులో ఉన్న ప్రజా సమాచారం ఆధారంగా మొత్త గణాంకాలు ఈ విధంగానే ఉంటాయి.

స్థూలంగా చూస్తే, Paytm నిశ్చయంగా మార్కెట్లో ఆధిపత్యాన్ని సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. లావాదేవీలలో 40% మార్కెట్ వాటా కలిగి ఉండడం సాధారణమైన విషయమేమీ కాదు. అయితే ఇతర ప్రమాణాల మాటేమిటి? ఈ డేటా బహిరంగంగా అందుబాటులో లేదు.…
Paytm వినియోగదారులు జరిపిన మొత్తం 68మిలియన్ల లావాదేవీలలో 21 మిలియన్ లావాదేవీలు PhonePe వినియోగదారులకు (@YBL VPA హ్యాండిల్ ద్వారా) చేసిన నగదు బ్బదిలీలు కావడం మన అదృష్టం. కాబట్టి, మేము వారి ATV, ATPC తదితరాల గురించిన కొన్ని సమాధానాలను కనుగొనే ప్రయత్నం చేయాలని నిర్ణయించాము.
మేము తెలుసుకున్న విషయాలు కింద ఇవ్వబడ్డాయి!

వీటిని పరిగణనలోకి తీసుకుంటే, కేవలం 40వేల మంది ప్రత్యేక వినియోగదారులు మాత్రమే ఫిబ్రవరిలో Paytmలో 500+ లావాదేవీలు జరిపారు.
Paytm సగటు లావాదేవీ విలువ రూ 40కన్నా తక్కువే.
దీనికి భిన్నంగా, PhonePeలో 60 లక్షల మంది ప్రత్యేక వినియోగదారులు ఫిబ్రవరిలో ఐదేసి చొప్పున లావాదేవీలు జరిపారు.
సగటు లావాదేవీ విలువ రూ 1,800కు పైమాటే.
ఇంత భారీస్థాయిలో అంతరం ఉండడానికి ప్రధాన కారణంగా ATV (Paytmలో రూ. 40గా ఉంటే PhonePeలో రూ. 1,820లు)ని చెప్పవచ్చు.
అంతేకాక Paytmకు చెందిన ATPC (నెలకు/వినియోగదారుకు/525) చెబుతున్నదేమిటంటే చాలా తక్కువ మందిని ఆకట్టుకోగల రీతిలో గణనీయమైన ఒక్కో లావాదేవీ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలే Paytmలావాదేవీ పరిణామాలను ప్రభావితం చేస్తున్నాయి.
పైన ప్రస్తావించిన అంశాలనుంచి మూడు విషయాలను మనం గ్రహించవచ్చు:
- BHIM UPIని విస్తృత స్థాయిలో స్వీకరించడమనేది ఇంకా Paytmలో జరగలేదు: 40,000 మంది ప్రత్యేక వినియోగదారులు 21 మిలియన్ లావాదేవీలను జరపడాన్ని పరిగణనలోకి తీసుకుంటే Paytmకు మొత్త BHIM UPI లావాదేవీ పునాదిగా 40,000 * 68 / 21 = 1.3 లక్షల వినియోగదారులున్నారని చెప్పవచ్చు.
- వినియోగదారుల లావాదేవీ సంఖ్యలు విలక్షణమైన BHIM UPI వినియోగ సందర్భాలలో ప్రతిబింబించవు. సగటు PhonePe వినియోగదారు నెలకు ఐదు లావాదేవీలు జరుపుతుండగా, దీంతో పోల్చితే Paytmలో లావాదేవీలు జరిపే సగటు వినియోగదారుల సంఖ్య 525. ఇది సాధారణంగా BHIM UPI నెట్వర్క్ లో సాధారణ వినియోగదారుని ప్రవర్తనను ప్రతిబింబించడం లేదు.
3. Paytm లావాదేవీల సరాసరి విలువ సగటు సగటుకన్నా చాలా తక్కువ. నెట్వర్క్ పూర్తి స్థాయిలో చూస్తే, BHIM UPI’ మొత్త లావాదేవీ విలువ ఒక లావాదేవీకి రూ 1,116 వద్ద నిలుస్తోంది. Paytmకు సంబంధించి ఇది కేవలం రూ. 38 వద్ద నిలుస్తోంది. అందులోనూ క్యాష్ బ్యాక్ ప్రేరణతో జరిగే తక్కువ స్థాయి ASP లావాదేవీలేననే విషయాన్ని ఇది చెబుతోంది.
ఈ కారణాలన్నిటినీ కలిపి చూస్తున్నందువల్లే, BHIM UPIలో అతి పెద్ద సంస్థ అని Paytm చెప్పుకుంటున్న గొప్పలు ఏకపక్షంగా ఉన్నాయని, తప్పుదోవపట్టించేవిగానూ ఉన్నాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము.
మరింత ప్రత్యేకమైన వినియోగదారులను, అధిక మొత్తం లావాదేవీ విలువల ప్రవాహాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే రీతిలో భారతదేశంలో డిజిటల్ పేమెంట్లను విస్తృతంగా స్వీకరించే దిశగా మార్కెట్ విశ్లేషణ సాగాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. మొత్త పరిమాణం మరియు లావాదేవీల విలువను పంచుకోవడంలో NPCI చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అతివేగంగా విస్తరిస్తున్న డిజిటల్ పేమెంట్ల వాతావరణ పరిపుష్టికి సంబంధించిన పూర్తి చిత్రాన్ని ఆవిష్కరించేందుకు మరింత విస్తృతమైన వ్యవస్థను అందించేలా ప్రత్యేక వినియోగదారుల సంఖ్యను ప్రచురించే విషయాన్నిఅది పరిశీలిస్తే ఇంకా బావుంటుంది.