Investments
రిస్క్ మరియు రిటర్న్ లు — ఒకే నాణం యొక్క రెండు పార్శ్వాలు
PhonePe Regional|3 min read|27 May, 2021
రిస్క్ మరియు రిటర్న్ లు — ఒకే నాణం యొక్క రెండు పార్శ్వాలు
మీ పెట్టుబడులలో జాగ్రత్తగా రిస్క్‌లు తీసుకోవడం ద్వారా మీ సంపద సృష్టి యాత్రలో చాలా దూరం పయనించవచ్చు.
సినిమాలు మరియు పుస్తకాలు లాంటి అనేక జనరంజక నిదర్శనాలు జీవితంలో రిస్క్ తీసుకోవడం అనే పాత్ర గురించి అనేక రూపాల్లో తెలిపాయి. అయినప్పటికీ, మదుపు చేయడంలో దాని పాత్రను తీసిపారేయలేము. మీ మదుపులలో జాగ్రత్తగా రిస్క్ లు తీసుకోవడం మీ సంపద సృష్టి యాత్రలో చాలా దూరం పయనించవచ్చు. వాస్తవంగా, “సురక్షితమైన” ఉత్పత్తుల్లో మాత్రమే మదుపు చేయడం దీర్ఘకాలిక దృష్టి కోణంలో చూసినప్పుడు తీవ్రమైన రిస్క్ తో కూడినదిగా నిరూపితం కావచ్చు. దీనిగురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం చదవండి.
సురక్షితమైన మదుపు ఆప్షన్లు నిజంగా సురక్షితమైనవేనా?
చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పొదుపు ఖాతాలు లేదా ఫిక్స్ డ్ డిపాజిట్లలో భద్రపరుస్తుంటారు. అవి సురక్షితమైనవి మాత్రమే కాక స్థిరమైన రిటర్న్ లను ఇస్తున్నట్టు వారికి కనిపిస్తుంది. అయినప్పటికీ, ఈ సురక్షితమైన పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడంలో ఒక రిస్క్ ఉంటుంది.-అదే ద్రవ్యోల్బణ రిస్క్.
ద్రవ్యోల్బణ రిస్క్ ను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సులభమైన ఉదాహరణను చూడండి: ఐదేళ్ల కిందట ఒక మసాలా దోశకు మీరు ₹30 మాత్రమే చెల్లించారు కానీ నేడు అదే మసాలా దోశకు మీరు ₹45 చెల్లిస్తున్నారు. అంటే ఐదేళ్లలో మసాలా దోశ ధర ఏటా 8% మేర పెరిగింది. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. అంటే కాలంతో పాటు పెరిగే ధర అని అర్థం.
పెట్టుబడి సారూప్యతను ఉపయోగించి దీనిని వివరించడానికి కింది ఉదాహరణను చూద్దాం. మీరు 5 ఏళ్ల క్రితం బాగా సురక్షితమైన మదుపు ఆప్షన్ లో ₹30 పెట్టుబడి పెడితే, అది 6% వార్షిక రిటర్న్ ను మీకు సంపాదించి పెడుతుంది.కాబట్టి ఇప్పడు దాని విలువ ₹40. దీనివల్ల మీరు ₹10 లాభం పొందుతున్నప్పటికీ, మీరు ఇంకా ₹5 తక్కువే. మీ మదుపు కోసం ద్రవ్యోల్బణ రిస్క్ అని దానిని చెప్పవచ్చు.
ప్రతి మదుపుదారు సురక్షితమైన పెట్టుబడి ఉత్పత్తులలో కొంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మీ పూర్తి పెట్టుబడులను ఈ ఉత్పత్తులలో పెట్టడం ద్వారా మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు అసలు విలువ తరచూ తుడిచిపెట్టుకోవడానికి దారి తీస్తుంది. దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం, ఆచితూచి రిస్క్ లు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన డబ్బు కన్నా తక్కువ డబ్బే మీరు కలిగి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. “సురక్షిత” ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించడం దాదాపు ఒక బౌండరీ లేదా సిక్స్ కొట్టడంలో ప్రమేయం కలిగిన ఏదైనా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సెంచరీ చేస్తామనే నమ్మకంతో ఉండే ఒక బ్యాట్స్ మెన్ ఆలోచన లాంటిదే.
అధిక రిస్క్ & అధిక రిటర్న్ పెట్టుబడులకు కొంత డబ్బును కేటాయించడం ద్వారా పెట్టుబడిదారులు ఎలా ప్రయోజనం పొందవచ్చో చూద్దాం
రిస్క్ vs రిటర్న్ : సమతుల్యమైన బ్యాలెన్స్ ఛేదించడం
రిస్క్ మరియు రిటర్న్ తరచూ ఒకే దిశలో కదులుతున్నాయి. అంటే, రిస్క్ ఎక్కువైతే, తీవ్రమైన రిటర్న్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఏ రిస్క్ గురించి మాట్లాడుతున్నాము? మనం మాట్లాడుతున్న రిస్క్ అనేది మార్కెట్ కదలికలపై ఆధారపడి మీ పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. స్వల్పకాలిక పెట్టుబడుల్లో ఈ హెచ్చుతగ్గులు చాలా తరచుగా ఉంటాయి కానీ దీర్ఘ కాలంలో మీ పెట్టుబడులు అధిక రేట్ తో పెరుగుతాయి..
మీరు భరించే రిస్క్ సామర్థ్యం, లక్ష్యాలు, పెట్టుబడి కాలాన్ని బట్టి అంచనా వేసిన రిస్క్ లు తీసుకోవడం ముఖ్యం. ఈ కారకాలను ఉపయోగించి, మీరు రిస్క్ మరియు రిటర్న్ ల మద్య సమతుల్యతను సాధించవచ్చు.
అధిక రిటర్న్ సామర్థ్యంతో కూడిన పెట్టుబడి సురక్షిత పెట్టుబడి ఆప్షన్లతో పోల్చితే సంపదను పోగు చేయడంలో మీకు ఎలా సహాయ పడవచ్చనే విషయానికి ఉదాహరణను కింద చూడవచ్చు.
25 ఏళ్ల వయసులో మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకుందాం. 50 ఏళ్లు వయసు వచ్చేసరికి 1 కోటి రూపాయల సంపదను పోగు చేయాలనుకుంటున్నారు. ఈ లక్ష్యాన్ని మీరు అనేక మార్గాల్లో సంపాదించవచ్చు. ఉదాహరణకు: 6% రిటర్న్ ను అందించే సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లలో మీరు పెట్టుబడి పెట్టాలనుకోవచ్చు లేదా మీరు కాస్త ఎక్కువగా 12% రిటర్న్ అందించే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తో ముందుకు వెళ్లవచ్చు. (ఇది స్వల్పకాలంలో హెచ్చుతగ్గులతో వస్తాయి). ఈ రెండు సందర్భాల్లోనూ ప్రతినెలా మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో చూడండి.:
పరిశీలనలు:
- 6% వార్షిక రిటర్న్ సంపాదించు సురక్షిత పెట్టుబడి ఆప్షన్లలో మాత్రమే మీరు పెట్టుబడి పెడితే, 50 ఏళ్ల వయసు వచ్చే సరికి మీరు ₹1 కోటి పోగు చేసేందుకు ప్రతినెలా ₹15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టి 12% వార్షిక రిటర్న్ అందుకోవాలంటే, మీరు మీ లక్ష్యమైన ₹1 కోటి పోగు చేసేందుకు ప్రతినెలా ₹6,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ లక్ష్యాన్ని సాధించడం కోసం సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్ లో పక్కన పెట్టాలనుకుంటున్న దానికన్నా తక్కువగా ఉంటుంది.
మీ పెట్టుబడుల విషయంలో కాస్త రిస్క్ తీసుకుంటే దీర్ఘ కాలికంలో అది మీకు సహాయపడుతుందని మీరు తెలుసుకున్నారు. మీ పెట్టుబడులతో సాగే ప్రయాణంలో మీరు అలాగే కొనసాగేలా చూసుకోవాల్సిన విషయాలు కింద ఇవ్వబడ్డాయి.:
- దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టండి — దీర్ఘ కాలం పాటు అయితే ఈక్విటీ ఫండ్స్ లాంటి కొన్ని రిస్క్ ప్రభావాలు కలిగిన పెట్టుబడులు పూర్తి సురక్షితమైన పెట్టుబడులకన్నా మెరుగైన రిటర్న్ లు అందించవచ్చు. కాబట్టి, మీరు ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత మెరుగైన రిటర్న్ లు చూడవచ్చు.
- నిలకడత్వం చాలా ముఖ్యం — నెలవారీ SIPల ద్వారా రెగ్యులర్ గా పెట్టుబడులు పెడుతూ రండి. అది కాలంతో పాటుగా సంపదను పోగు చేసేందుకు సులభమైన మార్గం మాత్రమే కాదు. స్వల్పకాలికంలో మార్కెట్ హెచ్చు తగ్గుల రిస్క్ ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
- మీ పెటుబడుల్లో వైవిధ్యం పాటించండి — వివిధ రకాల ఫండ్లలో, అంటే ఈక్విటీ ఫండ్లు, డెట్ ఫండ్లు లాంటి వాటిలోకి మీ పెట్టుబడులను విస్తరించడం ద్వారా మీ పెట్టుబడి రిస్క్ సౌకర్యంతో మీ పెట్టుబడిని కూడా మీరు ఒకే పద్ధతిలోకి తీసుకురావచ్చు. దీని గురించి మరిన్ని వివరాలను here. చదవండి
దీర్ఘకాలికంలో మీ సంపదను పెంచుకోవడంలో మీకు సహాయపడుతున్నందున ఒక అంచనాతో కూడిన పెట్టుబడి రిస్క్ లనుండి దూరంగా ఉండడం మంచిది.
మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ కు లోబడి ఉన్నాయి. దయచేసి, పెట్టుబడి పెట్టే ముందు అన్ని స్కీమ్ లకు సంబంధించిన డాక్యుమెంట్లను చదవండి.
PhonePe Wealth Broking Private Limited | AMFI — రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ARN- 187821.