PhonePe Blogs Main Featured Image

Investments

ఏవైనా ఊహించని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం కోసం అత్యవసర నిధితో ప్లాన్ చేసుకోండి

PhonePe Regional|2 min read|28 June, 2021

URL copied to clipboard

కొవిడ్-19 మహమ్మారి అనేక రకాలుగా మనల్ని దెబ్బతీశాయి. మన వ్యక్తిగత జీవితాలపై ఈ వైరస్ తాకిడి ప్రభావాన్ని లెక్కించలేము. ఈ అనిశ్చితి కారణంగా మన ఆర్థిక జీవితాలు కూడా ప్రభావితమయ్యాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని మనం ఎదురుచూస్తామని భావించనప్పటికీ, దాంతోపాటు వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం కోసం మనం తప్పకుండా ప్రణాళిక రచించుకోవచ్చు. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమే దీనికి ఒక అత్యంత సమర్థవంతమైన మార్గంగా చెప్పవచ్చు.

అత్యవసర నిధి అంటే ఏమిటి?

భవిష్యత్తులో మన ఆర్థిక స్థితులను ప్రభావితం చేయవచ్చనుకునే ఎదురుచూడని సంఘటనలకోసం మీ రాబడిలోకొంత భాగాన్ని అత్యవశ్యకమైనదిగా ఉంచడాన్ని అత్యవసర నిధిగా చెప్పవచ్చు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్ లేదా కారు నడిపే సమయంలో సీటు బెల్డును మీరు ధరించలేదని అనుకుందాం. తీవ్రగాయాలనుండి అవి మిమ్మల్ని రక్షిస్తాయి.అదే విధంగా ఆర్థికంగా మీకు దెబ్బ తగిలే పరిస్థితి నుండి అత్యవసర నిధి మిమ్మల్ని రక్షిస్తాయి.

ఇల్లను కొనుగోలు చేయడం, మీ పిల్లల విద్యకోసం పొదుపు చేయడం లాంటి మీ భవిష్యత్ లక్ష్యాల కోసం ఈ రోజే మీరు పొదుపు చేస్తున్నారనుకుందాం. ఇలాంటి సందర్భంలో, మీరు మహమ్మారి లాంటి పరిస్థితిని ఎదుర్కుంటే, ప్రస్తుత ఆర్థిక అత్యవసర స్థితులను ఎదుర్కోవడం కోసం మీ భవిష్యత్ లక్ష్యాలతో మీరు రాజీపడే పరిస్థితులు చాలావరకు ఏర్పడవచ్చు. అయితే మీకు అత్యవసర నిధి ఉంటే, ఈ ప్లాన్ మీ భవిష్య లక్ష్యాలను ప్రభావితం చేయకుండా మీ అనుకోకుండా ఎదురయ్యే ఖర్చులను ఎదుర్కోవడంలో ఈ ఫండ్ మీకు సహాయపడుతున్నందున ఇలాంటి సందర్భాల నుంచి మీకు రక్షణ లభిస్తుంది.

మీ అత్యవసర నిధిని నిర్మించుకోవడం మీరు ప్రారంభించడంలో మీకు సహాయ పడే కొన్ని చిట్కాలు:

  • మీ యొక్క కనీసం 6 నెలల ఖర్చులను అత్యవసర నిధిగా పక్కనపెట్టుకోండి. ఉదాహరణకు, మీరు నెలవారీ ఖర్చులు ₹10,000 అయితే, కనీసం ₹60,000ను అత్యవసర నిధిగా రూపొందించేందుకు సిద్ధం చేసుకోండి.
  • మనలో చాలామందికి ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని మదుపు చేయడం సాధ్యం కాదు. కాబట్టి నెలవారీ SIPలను మీరు ఎంచుకోవచ్చు. మీకు అవసరమైనంత మేర మొత్తాన్ని పోగు చేసేందుకు ప్రతినెలా మీరు మదుపు చేయాలి.
  • ఏదైనా ఆర్థిక అత్యవసర స్థితిని ఎదుర్కునేందుకు మీరు దీనిని ఉపయోగించాలనుకుంటే మీ అత్యవసర నిధిని తిరిగి తీసుకునేలా చూసుకోండి.
  • మీ ఖర్చులు పెరుగుతున్నందున ప్రతి ఏటా మీ ఖర్చులను సమీక్షించుకుని, మీ అత్యవసర నిధిని పెంచుకోండి.

ఇప్పుడు మనకు అత్యవసర నిధి ఏంటో అర్థమైందిగా. ఈ మొత్తాన్ని మీరు ఎలా మదుపు చేయాలో తెలుసుకుందాం.

లిక్విడ్ ఫండ్ — ఆర్థిక అత్వసర పరిస్థితుల్లో పొదుపు చేసుకునే మార్గం

మన ఆర్థిక అత్యవసర సమస్యలను ఎదుర్కోవడంలో అత్యవసర నిధులు మనకు సహాయపడవచ్చనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అయితే ఈ మొత్తాన్ని మీ పొదుపు ఖాతాలో కాకుండా మరో చోటు ప్రత్యేకంగా పక్కన పెట్టడం ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగిన విషయంగా ఉందది? మీ పొదుపు ఖాతాలో కొంత అదనపు మొత్తాన్ని మీరు పొదుపు ఖాతాలో ఉంచితే, ఏదైనా లేదా ఇతర ఖర్చులకోసం దానిని ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి, అత్యవసర నిధికోసం వేరుగా మొత్తాన్ని మదుపు చేస్తే, మీరు ఆ మొత్తాన్ని ఆర్థిక పరంగా అత్యవసర సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే తప్పించి, ఇతర ఖర్చులకు దీనిని కేటాయించరు.

ఈ అత్యవసర నిధిని రూపొందించేందుకు ఒక మార్గంగా లిక్విడ్ ఫండ్స్ లో మదుపు చేయడాన్ని చెప్పవచ్చు. మీ పొదుపు ఖాతాకోసం ప్రత్యామ్నాయంగా కూడా పని చేయవచ్చు. ఈ ఫండ్స్ మీ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా, ప్రభుత్వ మరియు బ్యాంకు సెక్యూరిటీలు లాంటి సురక్షితమైన సాధనాలలో మదుపు చేస్తాయి.

లిక్విడ్ ఫండ్ లో మదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • పొదుపు ఖాతాకన్నా చాలా మెరుగైన రిటర్న్స్ లభిస్తాయి.
  • లాకిన్ పీరియడ్ ఉండదు.
  • కనీస బ్యాలెన్స్ అవసరం లేదు.
  • ₹100 నుండే పొదుపు చేయవచ్చు.
  • ₹50,000* వరకు తక్షణ ఉపసంహరణ

లిక్విడ్ ఫండ్లలో మీ డబ్బును సులభంగా అందుకునే వీలుండడంతో పాటు పొదుపు ఖాతాకన్నా ఎక్కువ రిటర్న్స్ ను సంపాదించి పెడుతున్నందున దీనిని అత్యవసర నిధిని రూపొందించుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఏదైనా అనుకోని ఆర్థిక సమస్యల ఎదురైనప్పుడు వాటి నుండి మీ భవిష్యత్ లక్ష్యాలను కాపాడుకునేందుకు నేడే మీ అత్యవసర నిధిని రూపొందించుకోండి.

డిస్ క్లెయిమర్లు:

^ లిక్విడ్ ఫండ్స్ కు లాకిన్ పీరియడ్ ఉండదు కానీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4, రోజులు, 5 రోజులు, 6 రోజులలో నిష్క్రమిస్తే, వరుసగా 0.007%, 0.0065%, 0.006%, 0.0055%, 0.005%, 0.0045% అనే తేలికపాటి నిష్క్రమణ భారం వర్తిస్తుంది.

* మీ మదుపు నుంచి ఒక రోజులో 90% వరకు లేదా ₹50,000లలో ఏది తక్కువో దానిని మీరు విత్ డ్రా చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ మదుపులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. దయచేసి మదుపు చేసే ముందు దయచేసి స్కీమ్ సమాచారం డాక్యుమెంట్ చదవండి.

Keep Reading