Investments
భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫండ్‌ను ప్రవేశపెట్టిన PhonePe
PhonePe Regional|2 min read|17 August, 2021
సూపర్ ఫండ్స్ అంటే ఏంటి? వాటిలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారా?
చిన్న వివరణ ఇదిగోండి.
మ్యూచువల్ ఫండ్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయా?
మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎవరైనా మాట్లాడితే అంతా తికమకగా ఉందా? నిజానికి వాటిని అర్థం చేసుకోవడం చాలా సులభం.
ప్రధానంగా మూడు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి:
1) ఈక్విటీ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్‌లో మదుపు చేసే ఫండ్స్. వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది.
2) డెట్ ఫండ్స్ అనేవి ప్రభుత్వాలు (గిల్ట్‌లు), లేదా బ్యాంకుల లాంటి కార్పొరేట్ సంస్థలు జారీ చేసిన బాండ్‌లలో మదుపు చేసే ఫండ్స్. వీటిలో సాధారణంగా తక్కువ రిస్క్, నిలకడైన రిటర్న్ ఉంటుంది.
3) హైబ్రిడ్ ఫండ్స్ అంటే అటు ఈక్విటీ ఫండ్స్, ఇటు డెట్ ఫండ్స్ రెండింటిలోనూ మదుపు చేయడం. వీటిలో రిస్క్, రిటర్న్‌లు మాధ్యమిక స్థాయిలో ఉంటాయి.
ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి?
ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FOF) ద్వారా బహుళ రకాల ఫండ్స్‌లో మదుపు చేయవచ్చు. తద్వారా మదుపుదారులు ఎక్కువ అనుకూలతను, అధిక రిటర్న్ పొందగలుగుతారు. అయితే, చాలా వరకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు క్లోజ్‌డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తాయి. అంటే వారి సొంత కంపెనీలో ఫండ్స్‌ను ఎంచుకోవడం వరకే మదుపుదారులను అవి పరిమితం చేస్తాయి. సాధారణంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొన్ని అంశాల్లో బలంగా ఉన్నప్పటికీ, మరికొన్ని అంశాల్లో బలహీనంగా ఉంటాయి. అందువల్ల ప్రతి కేటగిరీ నుండి సరైన ఫండ్‌ను ఎంచుకోవడంలో FOFకు ఉన్న సామర్థ్యం మీద పరిమితి విధించబడుతుంది.
ఓపెన్ సూపర్ ఫండ్స్ ఎంట్రీ!
సూపర్ ఫండ్స్‌లో వివిధ రకాల ఫండ్ హౌస్‌ల నుండి ఉత్తమమైన ఫండ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక్క కంపెనీకి చెందిన ఫండ్ ఆఫ్ ఫండ్‌లో వచ్చే పరిమితులను అధిగమించగలుగుతుంది. ఉదాహరణకు, ఈక్విటీల పరంగా చూస్తే ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ (ABSL), డెట్‌ల పరంగా చూస్తే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌లు చాలా బలంగా ఉండవచ్చు. కాబట్టి ABSL నుండి ఉత్తమ ఈక్విటీ ఫండ్‌ను, యాక్సిస్ నుండి ఉత్తమ డెట్ ఫండ్‌ను ఎంచుకుని, వాటిని కలగలిపి సరికొత్త ఉత్తమమైన ఓపెన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను క్రియేట్ చేయవచ్చు.
సూపరో సూపర్: PhonePeలో సూపర్ ఫండ్స్
విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీల నుండి ఉత్తమమైన ఫండ్స్‌ను PhonePe ఎంచుకుని సూపర్ ఫండ్ సొల్యూషన్‌ను క్రియేట్ చేసింది. ఇందులో కన్జర్వేటివ్ ఫండ్, మోడరేట్ ఫండ్, అగ్రెసివ్ ఫండ్ అనే మూడు ఆప్షన్‌లను కూడా అందుబాటులో ఉంచింది. తద్వారా మీ రిస్క్, రిటర్న్ కాంబినేషన్‌కు తగినట్లుగా మీకు కావాల్సిన సూపర్ ఫండ్‌ను ఎంచుకునే వీలు కల్పించింది.
PhonePeలో ఉన్న సూపర్ ఫండ్స్ ప్రత్యేకతలు
- ఇవి సింపుల్‌గా కనిపించినప్పటికీ దీర్ఘకాలిక లాభాలనిచ్చే పరిష్కారం. మీరు తీసుకోబోయే రిస్క్ ఆధారంగా సరైన సూపర్ ఫండ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మిగతా విషయాలన్నీ నిపుణులైన ఫండ్ మేనేజర్‌లు చూసుకుంటారు. మీరు ఎంచుకున్న సూపర్ ఫండ్‌ను బట్టి మీ అభిరుచికి తగిన ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, ప్రతి ఫండ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఈ ఫండ్ మేనేజర్‌లు నిర్ణయిస్తారు.
- నిపుణులైన ఫండ్ మేనేజర్‌లు ఎప్పటికప్పుడు పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. అవసరమైతే, మార్కెట్ పరిస్థితులు, ఫండ్స్ నిలకడను బట్టి విభిన్న రకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కేటాయింపుల పరంగా పోర్ట్‌ఫోలియోను మారుస్తారు. అది కూడా పన్ను విధింపులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నష్టపోయేలా సమర్థవంతంగా మారుస్తారు. అందువల్ల సరైన ఫండ్స్‌లో మదుపు చేయడం గురించి, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం గురించి అవగాహన లేని పెట్టుబడులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- విభిన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో మదుపు చేయడానికి వీలు కల్పించే ఒక ఓపెన్ ఆర్కిటెక్చర్ ఫండ్ నిర్మాణాన్ని సూపర్ ఫండ్స్ అనుసరిస్తాయి. తద్వారా వివిధ AMCలలో ఉన్న నిలకడైన స్కీమ్‌లను ఎంచుకుని, ఫండ్ మేనేజర్ శైలిలో పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవచ్చు.
- మ్యూచువల్ ఫండ్స్ అందరికీ అందుబాటులో ఉండేలా సూపర్ ఫండ్స్ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. మదుపుదారులు కేవలం ₹ 500ల చిన్న మొత్తం మదుపు చేసి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల బలమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవచ్చు. కాబట్టి చిన్న స్థాయి ఇన్వెస్టర్‌లు కూడా అత్యున్నత దీర్ఘ-కాలిక పెట్టుబడి ప్రయోజనాలను పొందవచ్చు.
- 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం చేసే దీర్ఘకాలిక పెట్టుబడులకు సూపర్ ఫండ్స్ ఉత్తమంగా ఉంటాయి. 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే ఇండెక్సేషన్ ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల లాంటి సంప్రదాయ పెట్టుబడులతో పోల్చితే ఇవి పన్ను తగ్గింపు విషయంలో సమర్థంగా ఉంటాయి, అలాగే దాదాపుగా ఈక్విటీ ఫండ్స్ లాంటి పనితీరును కనబరుస్తాయి.
కాబట్టి మీరు చేయాల్సిందల్లా మదుపు చేసి, రిలాక్స్ కావడమే.
PhonePe Wealth Broking Private Limited | AMFI — రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ARN- 187821.