PhonePe Blogs Main Featured Image

Investments

దీర్ఘ కాలిక మదుపు కోసం దృఢమైన నిర్మాణం

PhonePe Regional|2 min read|12 July, 2021

URL copied to clipboard

వ్యాయామానికి, మదుపు చేయడానికి మధ్య ఉన్న పోలికలు ఏమిటి? నిశితంగా పరిశీలిస్తే చాలా కనిపిస్తాయి!

2021 ప్రారంభం మిమ్మల్ని మరింత చురుగ్గా ఉండాలని, వ్యాయామం చేయాలని తీర్మానం చేయించిందా? మంచిది. మేము కూడా అలాగే చేశాము.! అయితే, మేము అలాంటి తీర్మానాలు చేసే సమయంలో, వ్యాయామం మరియు మదుపు చేయడం మధ్య చాలా పోలికలు ఉన్నాయని గ్రహించాము. కలల దేహదారుఢ్యాన్ని నిర్మించుకుంటూనే ఒక వ్యక్తి విజయవంతమైన మదుపుదారుగా ఎలా కావచ్చనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఇది మాకు సహాయపడింది. కాబట్టి, మనం ప్రారంభిద్దామా?

అన్నిటికన్నా ముందు చేయాల్సిందేమిటంటే, ప్రారంభించడమే

ప్రతి కొత్త సంవత్సరంలోనూ వ్యాయామం చేయాలనే తీర్మాానం చేయాలని ఎక్కువమంది ఎప్పుడూ ఎందుకు కోరుకుంటారో తెలుసా? ఎందుకంటే, ప్రతి ఒక్కరూ దానిని కోరుకుంటారు కానీ కొంత మంది మాత్రమే స్వయంగా ప్రారంభిస్తారు. మదుపు విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. దీనిని భవిష్యత్తులో చేద్దామని వాయిదా వేయడం ఎవ్వరికీ ఎన్నడూ సహాయపడదు. కాబట్టి, మదుపు చేయడాన్నైనా, వ్యాయామం చేయడాన్నైనా నేడే ప్రారంభించాలి. రేపు కాదు.

నిలకడకు ప్రాధాన్యం

జనవరి 1న జిమ్ కేంద్రానికి వెళ్లి, ఆ తర్వాత వెంటనే మానేయడం మీ ఆరోగ్య లక్షణాలలో ఎలాంటి మార్పునూ తీసుకురాదు. మీ లక్ష్యాన్ని సాధించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే ఏకైక మార్గం కాగలదు. అదే విధంగా, SIPల ద్వారా క్రమం తప్పకుండా మదుపు చేయడం, నిలకడగా ఉండడం దీర్ఘ కాలంలో గణనీయమైన సంపదను సృష్టించుకోవడంలో మీకు సహాయపడుతుంది.

నిలకడ ముఖ్య భూమిక పోషించడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందామా :

మీరు 5,000 నెలవారీ SIP ప్రారంభించి, 20 ఏళ్ల వరకు దానిని కొనసాగించాలని నిర్ణయించారనుకుందాం. ఈ మదుపుపై 12% రిటర్న్ అందుకుంటారు. 20 ఏళ్ల ముగింపులో, మీరు మొత్తం దాదాపు 50 లక్షల సంపదను సృష్టించి ఉంటారు. అంటే ప్రతినెలా 5,000 రూపాయలు మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఒక పెద్ద మొత్తాన్ని అందుకోవచ్చు..

మీకు చక్కగా పని చేసే పద్ధతిని కనుగొనండికు త

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రారంభించినప్పుడు, మీరు మీకోసం ఒక అత్యుత్తమమైన వ్యాయామ పద్ధతిని ప్రయత్నించి, కనుగొంటారు. అది కండరాల పటుత్వం కోసం చేసే బరువు తూకడం కావచ్చు. లేదా బరువు తగ్గడం కోసం చేసే కార్డియో, శక్తి కోసం చేసే పైలేట్లు అయినా కావచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మీ లక్ష్యానికి తగిన రీతిలో అనేక వ్యాయామాల కలయికను మీరు ఎంచుకోవచ్చు. మదుపు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మీ రిస్క్ ప్రాధాన్యతలు, లక్ష్యం, మదుపు కొనసాగించాలని మీరు ఎంచుకునే కాలానికి తగ్గట్టు మీరు ఫండ్లలో మదుపు చేసేలా చూసుకోవచ్చు.

స్వల్ప కాలిక లక్ష్యాల కోసం చాలా ఎక్కువ రిస్క్ కలిగిన మదుపులో మీరు పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది? మీ పెట్టుబడి చాలా ఎక్కవ హెచ్చుతగ్గులను చవి చూస్తాయి. అయితే మీ అవసరాలకు తగినట్టుగా ఫండ్లలో మదుపు చేయడం ద్వారానే ఈ పరిస్థితిని మీరు సులభంగా నివారించవచ్చు.మదుపు కాలం మరియు వివిధ రిస్క్ ప్రొఫైళ్ల ఆధారంగా రూపొందించిన మార్గదర్శిని మీరు కింద చూడవచ్చు.:

అడ్డదారులు ఉండవ్, కానీ దీర్ఘ కాలిక ఫలితాలు అనూహ్యంగా ఉండవచ్చు

వ్యాయామం అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఫలితాలు చూసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ మీ లక్ష్యానికి దగ్గరగా వస్తే, ఇక వెనక్కు తిరిగి చూడాల్సిన పని ఉండదు. ఇదే తరహాలో, పెట్టుబడుల విషయానికి వస్తే కూడా ఎలాంటి అడ్డదారులు ఉండవు. వేలంగా లాభాలు అందుకోవాలని చూస్తే, మీకు నిరాశ ఎదురు కావచ్చు.కానీ SIPల ద్వారా దీర్ఘ కాలానికి మదుపు చేయడం మీ పెట్టుబడులను నెమ్మదిగా, నిలకడగా నిర్మించుకోవడానికి ఒక గొప్ప మార్గం అవుతుంది.

చివరగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వ్యాయామ ప్రక్రియను ఉద్దేశిస్తూ చేసిన ఒక ప్రముఖ సామెత మదుపు విషయానికీ వర్తిస్తుంది. : “మీ భవిష్యత్తు మీకు ధన్యవాదాలు తెలిపే పనిని ఏదైనా ఈ రోజే చేయండి..

డిస్ క్లెయిమర్: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కు కు లోబడి ఉంటాయి.మదుపు చేసే ముందు స్కీముకు సంబంధించిన సమాచార డాక్యుమెంట్ ను దయచేసి చదవండి.

PhonePe Wealth Broking Private Limited | AMFI — రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ARN- 187821.

Keep Reading